ప్రతి రెండు మూడు రోజులకు, ఏదో ఒక విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇబ్బంది పడుతూనే ఉంది. తాజగా, గ్రామ సచివాలయ ఉద్యోగుల పరీక్ష విషయంలో రచ్చ రచ్చ జరుగుతంది. 20 లక్షల మంది ఈ పరీక్ష రాస్తే, అందులో అతి తక్కువ మంది మాత్రమే అర్హత సాధిస్తే, అందులో ర్యాంకులు వచ్చిన వారిని చూస్తే, అసలు విషయం అర్ధమై పోతుంది. ఇదే విషయంతో ఆంధ్రజ్యోతి ఇచ్చిన కధనంతో, రాష్ట్రమంతా సంచలనం అయ్యింది. ఏపీపీఎస్సీ ఈ పరీక్షలు నిర్వహిస్తే, అక్కడ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో పని చేసిన వారికి టాప్ ర్యాంక్ రావటం, అందరినీ ఆశ్చర్యపరిచింది. వారికి ముందే పేపర్ వచ్చిందని, వారు వారి చుట్టాలకు ఈ పేపర్ ఇవ్వటంతో, వారు కూడా టాప్ లో నిలిచారు. ఈ విషయం ఇంత రచ్చ జరుగుతున్నా, ప్రభుత్వం మాత్రం కనీసం స్పందించలేదు. ప్రతిష్టాత్మిక సంస్థగా ఉన్న ఏపీపీఎస్సీకి కూడా మచ్చ వచ్చింది.

vsreddy 22092019 2

ఒక పక్క ప్రభుత్వం ఇంత ఇబ్బంది పడుతుంటే, ఈ ఇబ్బందులు తగ్గించాల్సింది పోయి, మరింత ఆజ్యం పోశారు విజయసాయి రెడ్డి. విజయసాయి రెడ్డి లాంటి నేత, ఈ సందర్భంలో, ఇలా జగన్ ను ఇబ్బంది పెట్టె పని చెయ్యటంతో అందరూ ఆశ్చర్యపోయారు. నిన్న వైజాగ్ లోని వైసీపీ పార్టీ ఆఫీస్ లో ఆయన కార్యకర్తలతో మాట్లాడారు. ‘ గ్రామ వలంటీర్లుగా 90 శాతం మంది మన వైసీపీ కార్యకర్తలనే తీసుకున్నాం. గ్రామ సెక్రటేరియట్‌ ఉద్యోగాల్లో కూడా మన కార్యకర్తలు చాలా మంది సెలక్ట్‌ అయ్యారు’ అంటూ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలతో అందరూ అవాక్కయ్యారు. ఒక పక్క ప్రభుత్వం అది తప్పు అని ఎదురు దాడి చేస్తుంటే, కాదు మేమే తీసుకున్నాం, అక్కడ అందరూ మా వాళ్ళే ఉన్నారు అంటూ విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు చెయ్యటం ఆశ్చర్యపరిచింది.

vsreddy 22092019 3

‘‘ఈ వంద రోజుల్లో మన ప్రభుత్వం ఇంచుమించుగా ఇప్పటికి 2.65 లక్షలు ఉద్యోగాలు, అంటే మూడు లక్షల మంది వాలంటీర్లని మనం నియమించి, ప్రభుత్వంలోకి తీసుకున్నాం. అయితే నేను కచ్చితంగా చెప్పగలను, నా దగ్గర ఫిగర్స్‌ ఉన్నాయి కాబట్టి, గ్రామ వాలంటీర్లు 90 శాతం వరకు మన కార్యకర్తలకే ఆ వలంటీర్‌ ఉద్యోగాలు వచ్చాయి. ఇవి రాని వారు అసంతృప్తి చెందొద్దు. ఎవరికైతే ఇప్పటి వరకూ న్యాయం జరగలేదో, వారికి కూడా మరింత కాలం ముందుంది. తప్పకుండా న్యాయం చేస్తారు జగన్మోహన్‌ రెడ్డిగారు అన్న విషయం గుర్తు పెట్టుకోవాలి. గ్రామ సెక్రటేరియట్‌ జాబ్‌ల విషయానికి వస్తే మనకున్నటువంటి పొలిటికల్‌ కంపల్షన్స్‌ కాదు, లీగల్‌ కంపల్షన్స్‌ వల్ల ఎవరికైతే క్వాలిఫికేషన్స్‌ ఉండి, మంచి మార్కులు వచ్చాయో వారిని మాత్రమే సెలక్ట్‌ చేయాల్సి వచ్చినటువంటి పరిస్థితి. దానిలో కూడా మన కార్యకర్తలు చాలా మంది సెలక్ట్‌ అయ్యారు’’ అని అన్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read