విజయసాయి రెడ్డి హవా రోజు రోజుకీ వైసిపీలో తగ్గిపోతుంది అని ప్రచారం జరుగుతున్న తరుణంలో  ఆయన పెట్టిన ట్వీట్ కూడా అందుకు అనుగుణంగానే ఇప్పుడు చర్చనీయంసం అయ్యింది. విజయసాయి రెడ్డి సహజంగా ప్రత్యర్ధుల పై దూకుడు మీద ఉంటారు. ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్ పై ప్రతి రోజు ఒంటి కాలు మీద వెళ్తూ, అసంబద్ధం అయిన ట్వీట్లు పెడుతూ ఉంటారు. ప్రతి రోజు వారిని టార్గెట్ చేస్తారు. అలాగే పవన్ కళ్యాణ్ పై కూడా సందర్భంగా వచ్చినప్పుడు పెడుతూ ఉంటారు. అయితే ఆయన గత నెల రోజులుగా ఇలాంటి ట్వీట్లు ఏవి పెట్టటం లేదు. ట్విట్టర్ మొదలు పెట్టిన దగ్గర నుంచి విజయసాయి ఇలా ఉండటం ఇదే ప్రధమం. ఇక విశాఖలో ప్రశాంత్ కిషోర్ టీం సర్వేలో, విజయసాయి రెడ్డి వల్లే విశాఖలో వైసిపీ వెనకంజులో ఉందనే ప్రచారం వచ్చింది. మరో పక్క విజయసాయి సన్నిహిత వర్గాల పై ఐటి దాడులు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలోనే, విజయసాయి రెడ్డి కేంద్ర ఆర్ధిక మంత్రిని కలిసిన ఫోటో, కేంద్ర ఆర్ధిక శాఖ ట్వీట్ చేసింది. ఇక గత్యంతరం లేదు అనుకుని, విజయసాయి కూడా రీట్వీట్ చేసారు. ఆయన కేంద్ర మంత్రులను కలిస్తే, హడావిడి చేస్తూ, ప్రెస్ మీట్ పెట్టి, ఎందుకు కలిసింది చెప్పే వారు. ఇప్పుడు అదేమీ లేకుండా,కేంద్ర ఆర్ధిక శాఖ ట్వీట్ చేసే దాకా, ఆ విషయం బయటకు తెలియదు. ఈ మొత్తం పరిణామాలు చర్చకు దారి తీస్తున్నాయి. ఇంత చర్చ జరుగుతున్నా విజయసాయి మాత్రం వివివరణ ఇవ్వకపోవటం, మరింతగా ఈ ప్రచారాలకు తావు ఇస్తుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read