ఎన్నికల రిగ్గింగ్‌లో సుప్రీం కోర్టు ప్రమేయం ఉందేమో అంటూ కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ సంచలన ఆరోపణ చేశారు. మొత్తం వీవీప్యాట్లు లెక్కించాలనే పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చడంపై ఆయన పై విధంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. ‘‘మొత్తం వీవీప్యాట్లను లెక్కించాలనే పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. అయితే ఎన్నికల రిగ్గింగులో సుప్రీం ప్రమేయం ఏమైనా ఉందా? ఎన్నికల కోసం ప్రభుత్వ పనులు మూడు నెలలు పూర్తిగా స్థంభించిపోయాయి. వీవీప్యాట్లను లెక్కించడానికి రెండు-మూడు రోజులు సమయం తీసుకోవడంలో అభ్యంతరమేంటి?’’ అనే అర్థంలో ఆయన హిందీలో ట్వీట్ చేశారు.

vvpat 22052019

ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘంపై ప్రతి పక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఎన్నికల షెడ్యూలు విడుదల చేసిననాటి నుంచే అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ అనేక విమర్శల్ని ఈసీ ఎదుర్కుంటోంది. ఇక ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై ముగింపు వచ్చేసరికి వీవీప్యాట్ల లెక్కింపు అంశాన్ని విపక్షాలు ప్రధానంగా తెరపైకి తెచ్చాయి. బుధవారం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 22 పార్టీల నేతలతో ఢిల్లీలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కూడా వీవీపీ ప్యాట్ల లెక్కింపు అంశాన్ని ప్రధానంగా చర్చకు తీసుకువచ్చారు. సమావేశానంతరం ఇదే విషయాన్ని ఈసీ ముందుకు విపక్ష నేతల బృందం తీసుకెళ్లింది. దీనిపై ఈరోజు (బుధవారం) ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు ఈసీ ప్రకటించింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read