శ్రీశైలం డ్యాంకు మరోసారి పై నుంచి వరద వస్తుంది. దీంతో శ్రీశైలం దగ్గర కృష్ణమ్మ ప్రామాదకర స్థాయికి చేరుకుంది. అయితే, ఎందుకో కాని ప్రభుత్వం, నిన్న రాత్రి వరకు, నీటిని కిందకు వదలలేదు. పై నుంచి అధికంగా వరద వస్తుందని తెలిసినా, డ్యాం కెపాసిటీ ఫుల్ గా నింపేశారు. అయితే రాత్రి మాత్రం కొన్ని గేటులు ఎత్తి, నీళ్ళు కిందకు వదిలారు. అయితే, నిన్న ఇది కూడా వివాదాస్పదం అయ్యింది. ఇంజనీర్ బాధ్యతలు నిర్వహించాల్సి ఉండగా, ఆయన భార్య వచ్చి, గేట్లు వదిలారు. ఆవిడ ముచ్చట పడటంతో, ఒక అధికారి ఇలా చెయ్యటం వివాదాస్పదం అయ్యింది. అయితే, ఈ రోజు ఉదయం శ్రీశైలం దగ్గర అనుకోని సంఘటన ఎదురైంది. సరైన వాటర్ మ్యానేజ్మెంట్ చెయ్యలేక పోవటంతో, పెద్ద ప్రమాదం తప్పింది. పై నుంచి వచ్చే నీరు అంచనా వెయ్యలేక, సరైన విధంగా గేట్లు ఎత్తక పోవటంతో, శైలం డ్యాం గేట్ల పైనుంచి వరద నీరు ప్రవహించింది.

srisailam 10092019 2

దీంతో గేట్ల నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. స్పిల్ వే నుంచి కాకుండా 2, 3, 10, 11, 12 గేట్లపై నుంచి నీరు పారింది. దీంతో ఒక్కసారిగా డ్యాం దగ్గర కలకలం రేగింది. అయితే ఈ సమయంలో, శ్రీశైలం డ్యాం దగ్గర అధికారులు లేకపోవడంతో, అక్కడ ఏమి జరుగుతుందో అర్ధం కాక, ప్రజలు ఆందోళన చెందారు. అధికారులు లేకపోవటంతో, ఇలా ఎందుకు జరుగుతుంది, డ్యాంకి ఏమైనా ఇబ్బంది ఉందా అనే విషయం తెలియక ప్రజలు ఆందోళన చెందారు. డ్యాం గేట్ల పైనుంచి వరద నీరు పారుతున్న ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో, టీవీల్లో పెద్ద ఎత్తున రావటంతో, అధికారులు రంగంలోకి దిగి, సరిచేసారు. శ్రీశైలం డ్యామ్ దగ్గర క్రస్ట్ గేట్ల పై నుంచి నీరు దూకుతూ రావటంతో, అధికారులు ఎవరూ అక్కడ అందుబాటులో లేకపోవడం పెద్ద చర్చగా మారింది.

srisailam 10092019 3

శ్రీశైలం డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 884.9 అడగులకు చేరింది. అయితే పై నుంచి వరద వస్తు ఉండటం, డ్యాం పూర్తిగా నిండినా సరే, ఆరు గేట్లను మాత్రమే ఎత్తి నీటిని విడుదల చేస్తుండడంతో మిగతా గేట్ల పై నుంచి నీరు కిందకు వెళ్లిపోతోంది. అయితే, ఈ పరిణామంతో డ్యామ్‌కు పెద్దగా ఇబ్బంది లేకపోయినా, అధికారుల నిర్లక్ష్యం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో 2009లో అధిక వరద , రికార్డు సమయంలో వచ్చినప్పుడే ఇలా జరిగిందని, కాని ఇప్పుడు మాత్రం, ముందుగా తెలుస్తున్నా, ప్రభుత్వం ఇలా నీళ్ళు వదలకుండా ఎందుకు చేస్తుందో, ప్రజలకు అర్ధం కావటం లేదు. ఏదైనా జరగరానిది జరిగితే, ప్రభుత్వం, అధికారులు, ఏమి సమాధానం చెప్తారు ? 20 రోజుల క్రిందట వరద వచ్చినప్పుడు, ప్రభుత్వం సరిగ్గా వాటర్ మ్యానేజ్మెంట్ చెయ్యలేదు అనే విమర్శలు వచ్చినా, ప్రభుత్వం మాత్రం, ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని, ఈ చర్యతో అర్ధమవుతుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read