తెలంగాణ ఎన్నికల ఫలితాలు టీడీపీ, కాంగ్రెస్‌, బీజేపీ అభిమానులకు నిరాశను మిగిల్చగా, వైసీపీ, జనసేన శ్రేణులకు ఉత్సాహనిచ్చాయి. అక్కడ ఎన్నికలతో ప్రత్యక్షంగా ఒరిగేదేమీ లేకపోయినా కూటమి గెలుపు పై టీడీపీ నేతలు నమ్మకంతో ఉన్నారు. తెలంగాణలో టీడీపీ నిలదొక్కుకుంటే ఇక్కడ రాజకీయంగా ఆత్మస్థయిర్యం పెరుగుతుందని ఆ పార్టీ అభిమానులు భావించారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసిన 13 స్థానాల్లో రెండు చోట్ల మాత్రమే టీడీపీ గెలుపొందింది. టీడీపీపై ఇటీవల ఒంటి కాలు మీద లేస్తున్న బీజేపీ నాయకుల కంఠాలు మూగబోయాయి. తెలంగాణలో ఒకే ఒక్క సీటు దక్కించుకోవడం ఆ పార్టీ నేతలు ఊహించలేదు. కన్నా లక్ష్మీనారాయణ, పురందేశ్వరి, జీవీఎల్‌ వంటి నాయకులు తెలంగాణలో ప్రచారం చేశారు.

ap 12122018 2

తెలంగాణ ఎన్నికలకు వైసీపీ, జనసేన ప్రత్యక్షంగా దూరంగా ఉన్నా అక్కడి ఫలితాలు చూసిన ఆ పార్టీల కార్యకర్తలు కొన్ని చోట్ల మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు. టీడీపీ భాగస్వామిగా ఉన్న మహాకూటమి అక్కడ ఓడిపోవడం రెండు పార్టీల శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. తెలంగాణ ఎన్నికలకు వైసీపీ, జనసేన అధికారికంగా దూరంగా ఉన్నా ఆ పార్టీల కార్యకర్తలు హైకమాండ్‌ సూచనల మేరకు హైదరాబాద్‌ వెళ్లి టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ప్రచారాలు చేశారని తెలుస్తోంది. అయితే మరో కోణం నుంచి తెలంగాణ ప్రజలు అక్కడ ప్రభుత్వానికి వేసిన పాజిటివ్‌ ఓటును టీడీపీ నేతలు స్వాగతిస్తున్నారు. తమ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పై ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఇలాంటి తీర్పు ఇస్తారనే నమ్మకం రెట్టింపైందని విశ్లేషించారు. కళ్యాణలక్ష్మికి సమానంగా ఇక్కడ చంద్రన్న పెళ్లి కానుక అమలుచేస్తుండగా ఒంటరి మహిళకు పెన్షన్ల పథకం రెండు చోట్ల ఇస్తున్నారు. అక్కడ టీఆర్‌ఎస్‌ రెవెన్యూ సంస్కరణలను అమలు చేస్తే ఇక్కడ భూధార్‌, మీ భూమి పేరిట చంద్రబాబు ప్రభుత్వం భూమి సమస్యలను తగ్గించింది. అక్కడ కాళేశ్వరం, మిషన్‌ భగీరథలను టీఆర్‌ఎస్‌ ఎన్నికల్లో ప్రచారం చేయగా ఇక్కడ పోలవరం, పట్టిసీమ, నీరు - చెట్టు, నదుల అనుసంధానం వంటివి అమల్లో ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లో రైతు రుణమాఫీ జరిగింది.

ap 12122018 3

అక్కడ లక్ష మాఫీ చేయగా ఇక్కడ లక్షన్నర జరిగింది. చంద్రబాబు డ్వాక్రా మహిళలకు 10 వేల వరకు రుణాల రద్దును అదనంగా అమలు చేశారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన చంద్రన్న బీమా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మన్ననల అందుకుంది. ఈ పథకం అక్కడ లేదు. అలాగే రాష్ట్రంలో నిరుద్యోగులకు ఇస్తున్న నిరుద్యోగ భృతి పథకం తెలంగాణలో లేదు. రాష్ట్రంలో ఆర్టీజీఎస్‌, గుడ్‌ గవర్నెన్స్‌, ఈ ప్రగతి, రాజధాని అభివృద్ధి వంటి అంశాలతో పాటు తలసరి ఆదాయం, స్థూల ఉత్పత్తిలో టాప్‌ త్రీ రాష్ట్రాల్లో ఉండటం వంటి పాజిటివ్‌ అంశాలు ఉన్నాయి. ఎక్కువగా పవన్, జగన్ పై ఫోకస్ చెయ్యకుండా, ఇలాంటి పోజిటివ్ విషయాల పై ఎక్కువ ప్రజలకు చెప్పాలి. అలాగే ఇప్పటికే ఢిల్లీ పై యుద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే బీజేపీ రాష్ట్రానికి చేస్తున్న అన్యాయం ఎక్కువగా ప్రజలకు చెప్పాలి. ఏ అంశాల పై బీజేపీ ద్రోహం చేస్తుందో పదే పదే చెప్పాలి. ఎన్నో పోజిటివ్ అంశాలు వదిలేసి, బీజేపీ పన్నిన ట్రాప్ లో పడి, పవన్, జగన్ లకు కౌంటర్లు ఇస్తూ పొతే, ప్రజలకు చేస్తున్న మంచి ప్రజల్లోకి వెళ్ళదు. అంతే కానీ అక్కడ కేసీఆర్ గెలిస్తే, ఇక్కడ చంద్రబాబుకి ఏమవుతుంది ? కేసీఆర్ ఏమన్నా కొత్త శత్రువా ? మొదటి నుంచి బీజేపీ, కేసీఆర్, జగన్, పవన్, అందరూ కలిసే, చంద్రబాబు పై దాడి చేస్తున్నారు కదా ? మహా అయితే జగన్, పవన్ లకు ఎన్నికల సమయంలో ఫండింగ్ చేస్తారు. ఇంకా చంద్రబాబుకు కొత్తగా జరిగేది ఏంటి ?

Advertisements

Advertisements

Latest Articles

Most Read