ప్రతిపక్షంగా ఉన్న ఎవరైనా, అధికార పక్షం మీద పోరాటం చేస్తారు. అదీ కాక, ఇప్పటికి అయుదు నెలలు జగన్ అధికారంలోకి వచ్చి. ఈ అయుదు నెలల్లో, రాష్ట్రం సంక్షోభం వైపు వెళ్తుంది. 40 లక్షల మండి భవన నిర్మాణ కార్మికులకు, ఈ అయుదు నెలల్లో అసలు పని లేదు. రాష్ట్రానికి ఒక్క రూపాయి పెట్టుబడి రావటం లేదు. ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయాయి. జీవనాడి అయిన పోలవరం పనులు, ఇప్పట్లో మొదలయ్యే అవకాశమే కనిపించటం లేదు. ఇక అమరావతి సంగతి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మరో పక్క పేదలు అన్నం తినటానికి పెట్టిన అన్న క్యాంటీన్ లు మూత పడ్డాయి. ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న పధకాలు అన్నీ అరకొరగా లబ్దిదారులకు చేరుతున్నాయి. ఇన్ని జరుగుతున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ మాత్రం, జగన్ మోహన్ రెడ్డిని వదిలేసి, చంద్రబాబు పై పడ్డారు. వారికి వారే ఊహించుకుని, లేని సమస్య సృష్టించి, చంద్రబాబు మా వద్దకు వస్తే అసలు ఒప్పుకోం అంటున్నారు.

bjp 20102019 2

అసలు చంద్రబాబు మీ దగ్గరకు ఎందుకు వస్తారు అంటే దానికి జవాబు లేదు. అసలు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అనే పార్టీని ఎవరూ గుర్తించటం లేదు కూడా. అటు జగన్ మొహన్ రెడ్డి అయితే, ఏపి బీజేపీ నేతలను పూచిక పుల్ల తీసినట్టు, తీసి అవతల వేస్తున్నారు. ఇక టిడిపికి, ఎలాగూ అవసరం లేదు. రాష్ట్రానికి బీజేపీ చేసిన దుర్మార్గం పై, పోరాడిందే టిడిపి. మొన్న ఎన్నికల్లో, నోటాకి 1.28 శాతం ఓట్లు వస్తే, బీజేపీకి 0.84 శాతం ఓట్లు వచ్చాయి. ఇలాంటి బీజేపీ పార్టీ, 40 శాతం ఓట్లు వచ్చిన టిడిపి పార్టీకి చాలెంజ్ చేస్తూ, మిమ్మల్ని మేము చేర్చుకోం అంటూ బిల్డ్ అప్ ఇస్తున్నారు. అయితే, ఈ వ్యూహం వెనుక, ఉన్న కారణం ఇట్టే అర్ధం చేసుకోవచ్చు అని, విశ్లేషకులు అంటున్నారు. బీజేపీకి ఏపిలో అసలు సీన్ లేదనే విషయం ఆ పార్టీ అధ్యక్షుడు కన్నాని చూస్తేనే అర్ధం అవుతుందని అంటున్నారు. వైసీపీలోకి వెళ్ళే కన్నాను రాత్రికి రాత్రి ఆపి, బీజేపీ అధ్యక్షుడుని చేసారంటేనే వారి పరిస్థితి అర్ధం అవుతుందని అంటున్నారు.

bjp 20102019 3

అయితే, మొన్నటి ఎన్నికలల్లో టిడిపి దెబ్బ తిన్న తరువాత, టిడిపి నాయకులు అందరూ , తమ పార్టీలోకి వచ్చేస్తారని ఆశ పడ్డారు. అయితే కేసులు ఉన్న సుజనా, సియం రమేష్ లాంటి ఎంపీలు నలుగురు వెళ్లారు తప్పితే, తరువాత ఎవరూ వెళ్ళలేదు. దీంతో అయుదు నెలలు అయినా, ఇంకా ఎవరూ రాకపోవటంతో, బీజేపీ నేతలకు ఫ్రస్ట్రేషన్ పీక్స్ లోకి వెళ్ళింది. గతంలో దొంగలు అని విమర్శించిన సుజనాని చేర్చుకున్నా, ఎవరూ రాకపోవటంతో, ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు పై విమర్శలు మొదలు పెట్టరు. బీజేపీ, టిడిపి, మళ్ళీ కలుస్తాయి అనే ప్రచారం వల్లే, ఎవరూ తమ పార్టీలో చేరటం లేదని ఏపి బీజేపీ నాయకులు భావన. అందుకే, అసలు చంద్రబాబుతో కలవం అని చెప్తూ, టిడిపి శ్రేణులకు సంకేతాలు ఇస్తున్నారు. అందుకే 0.84 శాతం ఓటు షేర్ ఉన్న పార్టీ, టిడిపి నేతలను తమ పార్టీలోకి తీసుకు రావాలనే వ్యుహ్యంలో, ఈ ప్రగల్భాలు పలుకుతున్నారు. ఇంత ఘోరంగా ఉన్న బీజేపీని, ఏపి ప్రజలు ఆదరిస్తారో లేదో, కాలమే సమాధానం చెప్తుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read