2019 ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి, అనూహ్య విజయం సాధించారు. 2014 నుంచి 2019 వరకు, చంద్రబాబు ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సంక్షేమ కార్యక్రమం అందేలా చేసినా, అభివృద్ధి కళ్ళ ముందు కనిపించినా, పునాదుల్లో ఉన్న పోలవరం ప్రాజెక్ట్ ని, 72 శాతం పూర్తి చేసినా, ప్రతి ఊరికి సిమెంట్ రోడ్డు, డ్రైనేజి వేసినా, చంద్రబాబుని ఓడించి, జగన్ కు భారీ గెలుపు కట్ట బెట్టారు ప్రజలు. 151 సీట్లతో, జగన్ అనూహ్య గెలుపు సాధించారు. గత ఏడాది కాలంలో, జగన్ మోహన్ రెడ్డి పాలన పై అటు ప్రజలు ఇబ్బందులు, ఇటు ప్రతిపక్షం పోరాటాలతో గడిచి పోయాయి. ఇసుక లేక ఆరు నెలలు ఇబ్బంది పడితే, మూడు నెలలు రాజధాని గొడవ, మరో మూడు నెలలు కరోనాతో జీవితాలు అల్లకల్లోలం అయిపోయాయి. పనులు లేవు, అన్ని రకాల ధరలు పెరిగిపోయాయి. ఈ అసంతృప్తిని, 87 వేల కోట్లు అప్పు తీసుకొచ్చి, కొన్ని సంక్షేమ కార్యక్రమాలు పెట్టి, చల్లార్చే ప్రయత్నం జగన్ చేస్తున్నారు. మరో పక్క అభివృద్ది అనే మాటే లేదు. ఈ తరుణంలో, సొంత పార్టీలోనే ధిక్కార స్వరం మొదలైంది. ఏడాది కాలంగా, ఉగ్గ పెట్టుకున్న కోపం అంతా, నెమ్మదిగా బయటకు వస్తుంది, త్వరలోనే ఇది మరి కొంత మందికి పాకి, బద్దలవుతుంది అనే సూచనలు కూడా కనిపిస్తున్నాయి.

జగన్ మోహన్ రెడ్డి, ఎవరినీ కలవరు అని, ఎవరి మాట లెక్క చెయ్యరు అని, ఎవరి సలహాలు తీసుకోరు అని, అసలు తమకు లెక్క చెయ్యటం లేదని, సీనియర్లకు లోలోపలు ఉన్న ఫీలింగ్. అడపాదడపా ఇది బయట పడుతూనే ఉంది. 40 ఏళ్ళ రాజకీయ జీవితం ఉన్న తమను కాదని, నిన్న కాక మొన్న వచ్చిన వారికీ, అవగాహన లేని వారిని అందలం ఎక్కిస్తున్నారనే కోపం సీనియర్లకు ఉంది. ఇక జగన్ వ్యవహార శైలితో కూడా వీళ్ళు విసుగు చెందారనే టాక్ నడుస్తుంది. ఏడాది కలాంలో అడపా దడపా వినిపిస్తున్న ఈ ధిక్కార స్వరం, వారం రోజులుగా ఎక్కువ అయ్యింది. వినుకొండ ఎమ్మెల్యే, బహిరంగంగా, రాష్ట్రంలో ఇసుక దోపిడీ జరుగుతున్న తీరు పై గళం ఎత్తారు, ఇసుక రీచ్ నుంచి, ఎక్కడికి వెళ్తుందో అర్ధం కావటం లేదని, గరమల్లో గుప్పెడు ఇసుక కూడా ఇవ్వలేక పోతున్నాం అన్నారు.

ఇక మరో ఎమ్మెల్యే, 'జిల్లాలో పాలన అస్తవ్యస్తంగా ఉంది. ఈ జిల్లాలో పాలనా వ్యవస్థ పూర్తిగా దారి తప్పింది. దీన్ని బాగు చేసేందుకు ఎవరో ఒకరు రావాల్సిన అవసరం ఉంది. సరిచేయకపోతే ప్రజలు తీవ్రంగా నష్టపోతారు.' అని సీనియర్ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి రెండు రోజుల క్రితం జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఇక నిన్న నెల్లూరు జిల్లా సీనియర్ నేత ఆనం రాంనాయరణ రెడ్డి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఏడాది కేకు సంబరాలు తప్ప, అభివృద్ధి ఏది, 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదు, ఇంకో ఏడాది చూస్తా, ఇలాగే ఉంటే ప్రభుత్వాన్ని నిలదీస్తా అని చెప్పిన సంగతి తెలిసిందే. ఇక నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణ రాజు, ఇళ్ళ స్థాలల్లో అవినీతి, రాష్ట్రంలో మత మార్పిడులు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆర్డినెన్స్, తిరుమల భూవివాదం, ఇలా అన్నిటి పై, సొంత ప్రభుత్వం పైనే ఎదురు తిరుగుతున్నారు. ఇక గతంలో స్పీకర్ తమ్మినేని, నాటు సారా మాఫియా పై చేసిన వ్యాఖ్యలు, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నీళ్ళు అమ్ముకున్నారు అనే ఆరోపణలు, కరెంటు బిల్లుల పెరుగుదల పై, విజయనగరం జిల్లా సాలూరు వైకాపా ఎమ్మెల్యే రాజన్నదొర వ్యాఖ్యలు, ఇలా చాలా మంది ఎదురు తిరుగుతున్నారు. మరి ఈ అసంతృప్తులను జగన్ అణిచివేస్తారా, లేదా పార్టీ పై పట్టు కోల్పోతారా అనేది, కాలమే సమాధానం చెప్పాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read