ఎన్నికల ఫలితాలకు ముందే జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు చక్రం తిప్పుతున్నారు. ఎగ్జిట్‌పోల్స్‌‌ అంచనాలు ఎలా ఉన్నా వెనుకడుగు వేయడం లేదు. బీజేపీయేతర పక్షాలను ఏకతాటిపై తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేసారు. ఒక్కో నేతను రెండు మూడు సార్లు కలుస్తూ వారిలో విశ్వాసాన్ని కల్పిస్తున్నారు. గత నాలుగు రోజులుగా జాతీయ నేతలతో వరుస భేటీలతో బిజీ బిజీగా ఉన్న చంద్రబాబు, నిన్న రాత్రి కూడా జాతీయ స్థాయిలో అందరి నేతలకు ఫోన్ చేసి, ఈ రోజు ఫలితాల తరువాత ఎంత వేగంగా స్పందించాలి అనేదాని పై చర్చించారు. మోడీకి మెజారిటీ రాకపోతే, మెరుపు వేగంతో విపక్షాలు రాష్ట్రపతి దగ్గరకు వెళ్లాలని, దీనికి తగు సూచనలు, అన్ని పార్టీల నేతలకు చంద్రబాబు చేసారు.

cbn poratam 23052019

ఎగ్జిట్‌పోల్స్‌ అన్నీ కేంద్రంలో ఎన్డీఏ కూటమిదే అధికారం అని చెప్పినా.. విపక్షాలు మాత్రం విబేధిస్తున్నాయి. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాదని స్పష్టం చేస్తున్నాయి. కౌంటింగ్‌ రోజున ఎవరి లెక్క ఎంతో తేలిపోతుందని విపక్ష పార్టీలు లెక్కేస్తున్నాయి. ఓ వైపు ఈవీఎంలపై పోరాడుతూనే.. బీజేపీకి మ్యాజిక్‌ ఫిగర్‌ రాకపోతే ఎలా ముందుకు వెళ్లాలి.. అన్నదానిపై విపక్ష పార్టీలు ఇప్పటికే లెక్కలు వేస్తున్నాయి. ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం.. బీజేపీ అధికారంలోకి రాదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అక్కడితోనే ఆగక.. బీజేపీ యేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూర్‌ ఇలా వివిధ రాష్ట్రాలు తిరుగుతూ.. బీజేపీ యేతర పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చారు. మొదట లక్నోలో అఖిలేష్‌, మాయావతిలతో భేటీ అయిన చంద్రబాబు. తరువాత ఢిల్లీలో సోనియా, రాహుల్‌, కేజ్రీవాల్‌ తదితర నేతలతో భేటీ అయ్యారు. భవిష్యత్తు వ్యూహాలపై చర్చించారు. ఓ వైపు మొత్తం వీవీప్యాట్లను లెక్కించాలని ఈసీతో పోరాడుతూనే.. మరోవైపు ఫలితాల తరువాత ఎలా ముందుకు వెళ్లాలి అన్నదానిపైనా అందరి నేతలతో విడివిడిగా చర్చిస్తున్నారు.

cbn poratam 23052019

మొదట మంగళవారం మమతా బెనర్జీతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈవీఎంలపై పోరాటంలో కలిసిరావాలని మమతా బెనర్జీని ఆయన కోరారు. దాదాపు 45 నిమిషాలపాటు మమతా భేటీ అయ్యారు. ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఇద్దరూ అభిప్రాయపడ్డారు. ఫలితాల తరువాత ఎలా ముందుకు వెళ్లాలి అన్నదానిపైనే ఇద్దరూ సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తోంది. మరోవైపు నిన్న ఢిల్లీలో 20కు పైగా పార్టీల నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. భవిష్యత్తు రాజకీయాలపై చర్చించారు. ఆ వెంటనే బెంగళూర్‌ వెళ్లి.. మాజీ ప్రధాని దేవెగౌడ, సీఎం కుమారస్వామిని చంద్రబాబు కలిశారు. కర్ణాటక రాజధాని బెంగళూరులోని దేవెగౌడ నివాసంలో సమావేశమై తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్‌పై వివిధ సంస్థల సర్వేల ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో చంద్రబాబు హస్తిన కేంద్రంగా జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలందరినీ ఒక్కతాటిపైకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. మరి చంద్రబాబు శ్రమ ఫలిస్తుందో లేదో, మరికొద్ది గంటల్లో తెలిసిపోతుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read