ప్రభుత్వం మొండి వైఖరికి పోకుండా, ప్రజాస్వామ్మాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ముఖ్యమంత్రి తన పంతం వీడి, ఎన్నికలకు సహకరించాల్సిన అవసరముందన్నారు. ప్రజలు తనకు నచ్చిన నాయకుడిని ఎన్నుకోవడంలో ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు సహకరించాలి. వారు అవలంబిస్తున్న విధానం సరికాదు. రాజ్యాంగాన్ని రూరల్ లాని గౌరవించాలి. స్థానిక సంస్థల ఎన్నికలను, ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్ ను తిరస్కరించడం భావ్యంకాదు. ఎన్నికల్లో బాధ్యతలు చేపట్టాల్సిన అవసరం లేదని సూచించడం జగన్ తన గొయ్యి తానే తీసుకున్నట్లుగా ఉంది. జగన్ రాజ్యాంగ, రాజకీయ సంక్షోభాన్ని సృష్టించుకుంటున్నారు. రాజ్యాంగ క్రైసిస్ లో చిక్కుకోవడమే కాకుండా గతంలో జగన్ ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదు. ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన తరువాత మేము ఎన్నికలలో పాల్గొనము అని మంత్రులు, ముఖ్యమంత్రులు, ఉద్యోగులు చెప్పిన దాఖలాలు ఎక్కడా లేవు. దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలోనే ఇలా జరుగుతోంది. జగన్ రాజ్యాంగ విలువల్ని కాపాడలేకపోయారు. రాజ్యాంగ విలువల్ని కాపాడలేని ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. జగన్ తగిన మూల్యం చెల్లిచుకునే సమయం ఆసన్నమైంది. ఇప్పటికైనా జగన్ మేల్కొని హైకోర్టు ఆర్డర్ ను తూచా తప్పక పాటించాలి. సుప్రీం కోర్టు ఆర్డర్ ను పాటిస్తామన్నట్లుగానే హైకోర్టు ఆర్డర్ ను పాటించాలి. ఎన్నికలకు సహకరించాల్సిన అవసరముంది.

governor 25012021 2

రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ప్రభుత్వంలోకి వస్తుంటాయి, పోతుంటాయి. బ్యూరోక్రైయిట్స్, ఉద్యోగులు రాజ్యాంగానికి లోబడి పని చేయాల్సి ఉంటుంది. రాజ్యాంగాన్ని ధిక్కరించిన వారి పరిస్థితి ప్రభుత్వం పోయాక అధ్వాన్నంగా మారుతుందని గుర్తుంచుకోవాలి. రాజ్యాంగ విలువల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులపై ఉంటుంది. ప్రభుత్వాలు శాశ్వతం కాదు. ప్రభుత్వాలు వచ్చినప్పుడు, పోయినప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో ఆలోచించుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగులు, బ్యూరోక్రయిట్స్ వారు సొంత నిర్ణయాలు తీసుకోవాలిగానీ ప్రభుత్వం చెప్పినట్లుగా నడుచుకోకూడదు. ఎలక్షన్ కమిషన్ కు విలువివ్వాలి. ఎస్ సి, ఎస్టీ, బీసీలను కూడా పరిపాలనలో భాగస్వామ్యం అయ్యేలా చూడాలని మహాత్మాగాంధి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ లు తెలిపారు. వారు పంచాయతీరాజ్ నుంచి పార్లమెంట్ వరకు వెళ్లడానికి అవకాశాలుంటాయి. ఆ అవకాశాల్నికోల్పోయేలా చేయొద్దు. 74, 75 అమెట్మెంట్స్ పార్లమెంటులో చట్టం చేస్తే, పంచాయతీరాజ్ యాక్టు అసెంబ్లీ చేసింది. అసెంబ్లీ, పార్లమెంటు చేసిన చట్టాలను గౌరవించాలి గానీ అవమానించకూడదు. జగన్ ఆధీనంలో ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు పనిచేయడం బాధాకరం. ప్రభుత్వం ఎన్నికల నోటిఫికేషన్ ప్రక్రియను పరిశీలించాల్సిన అవసరముంది. నామినేషన్ల పర్వం ప్రారంభమవుతోంది కాబట్టి వెంటనే గవర్నర్ ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని యనమల రామకృష్ణుడు సూచించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read