ప్రశాంత్ కిషోర్ గురించి తెలియని వారు మన రాష్ట్రంలో ఉండరు. జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ అందరికీ సుపరిచతమే. ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ జేడీయూ ఉపాధ్యక్షుడు కూడా కొనసాగుతున్నారు. ప్రశాంత్ కిషోర్ ఏమి చెప్తే అది జగన్ చేసే వారు. సొంత పార్టీ నేతలను కూడా పట్టించుకోకుండా, కేవలం ప్రశాంత్ కిషోర్ నే నమ్మి, ఆయన వ్యూహాలనే జగన్ అమలు చేసి, విజయం సాధించారు. ప్రభుత్వంలోకి వచ్చిన ఆరు నెలలు అయిన జగన్, అన్ని విషయాల్లో ఫెయిల్ అవుతూ రావటం, నేషనల్ మీడియాలో వరుస పెట్టి, జగన్ పరిపాలన పై నెగటివ్ ఎడిటోరియల్స్ రావటం, సోషల్ మీడియాలో కూడా వైసీపీ వీక్ అవ్వటంతో, జగన్ మళ్ళీ ప్రశాంత్ కిషోర్ వైపు చూస్తున్నారు అనే వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పుడు సందర్భం మాత్రం వేరు. ఎన్నికల వ్యూహకర్తగా, బీజేపీకి పని చేసి, నరేంద్ర మోడీ గెలుపులో, 2014లో ప్రశాంత్ కిషోర్ ఎంతో పని చేసారు. అయితే, ఇప్పుడు అదే ప్రశాంత్ కిషోర్, బీజేపీకి వ్యతిరేకం అయ్యారు.

pk 14122019 2

ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన, ‘పౌరసత్వ చట్ట సవరణ బిల్లు, 2019’(క్యాబ్‌)ని ప్రశాంత్ కిషోర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సొంత పార్టీ జేడీయూ కూడా, ఈ బిల్ కు సపోర్ట్ చెయ్యటం పై ప్రశాంత్ కిషోర్ విమర్శలు చేసారు. అయితే, ఇప్పుడు ఈ బిల్ పై, ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేసారు. క్యాబ్‌ అమలుకు అడ్డుకొని ‘భారత ఆత్మ’ను కాపాడాలని, వివిధ రాష్ట్రాలను కోరారు. అయితే ఇప్పటికే ఈ బిల్ పార్లమెంట్ లో పాస్ అయ్యిందని, న్యాయవస్థ కూడా దాటి వెళ్ళిపోయింది అని, కాకపొతే, మన దేశంలో ఈ చట్టాన్ని అమలు చేయాల్సిన 16 మంది బీజేపీ యేతర ముఖ్యమంత్రుల పైనే భారత ఆత్మను కాపాడాల్సిన బాధ్యత ఉందని, ప్రశాంత్ కిషోర్ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. వీరే ఈ దేశాన్ని కాపాడాలని అన్నారు.

pk 14122019 3

ఇప్పటికే అయుదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఈ బిల్ ను, తమ రాష్ట్రంలో అమలు చెయ్యం అని చెప్పారని, అలాగే ఇతర బీజేపీ యేతర ముఖ్యమంత్రులు కూడా, ఈ బిల్ ని తమ రాష్ట్రాల్లో అమలు చెయ్యకుండా చూడాలని కోరారు. ఈ చట్టం ప్రజల మధ్య వివక్షను పెంపొందించేలా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే వివధ రాష్ట్రాలు ఈ బిల్ ను అడ్డుకోవాలని అన్నారు. అయితే ప్రశాంత్ కిషోర్, జగన్ మోహన్ రెడ్డికి ఉన్న సన్నిహిత సంబంధం అందరికీ తెలిసిందే. ప్రశాంత్ కిషోర్ సలహాని, ఇప్పుడు జగన్ పాటిస్తారా అనే ప్రశ్న వస్తుంది. అయితే ఇప్పటికే వైసీపీ ఈ బిల్ ని పార్లమెంట్ లో సపోర్ట్ తెలిపింది. మరి ప్రశాంత్ కిషోర్ సూచన జగన్ పాటిస్తారా ? బీజేపీని కాదని, ఈ బిల్ ని రాష్ట్రంలో జగన్ అడ్డుకోగలరా ? చూద్దాం...

Advertisements

Advertisements

Latest Articles

Most Read