సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం, దేశంలోని ప్రజాప్రతినిధులు అందరి పై ఉన్న కేసులు, ఏడాది లోపు పూర్తి చేయాలని, ఆదేశాలు రావటంతో, అన్ని చోట్లా, ప్రజాప్రతినిధుల పై కేసుల విచారణ ఊపందుకుంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో, వేగంగా కేసులు ముందుకు వెళ్తున్నాయి. జగన్ మోహన్ రెడ్డి సిబిఐ కేసులు మాత్రం, ఇంకా విచారణ వరకు రాకుండా సాగుతూనే ఉన్నాయి. దీని పై గత కొంత కాలంగా విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలోనే వైసీపీ ఎంపీ రఘురామరాజు, సిబిఐ కోర్టులో పిటీషన్ కూడా వేసారు. ఇక ఈ విషయం పక్కన పెడితే, హైదరాబాద్ లోని ప్రజా ప్రతినిధులు కోర్టులో, ప్రజాప్రతినిధుల పై నమోదు అయిన కేసుల్లో వేగం పెరిగింది. ఇవన్నీ చాలా వరకు చిన్న చిన్న కేసులు. ముఖ్యంగా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘన లాంటి కేసులు. మొన్న మధ్య విజయమ్మ, షర్మిల కూడా ఈ కేసు విషయంలో కోర్టుకు వెళ్లారు. అయితే ఈ కేసుల్లో పెద్దగా శిక్ష లాంటివి ఉండకపోవచ్చు, లేదా అనేక కేసులు కొట్టెయ వచ్చు కూడా. అయితే లిక్కర్ స్కాం, ఓటుకు నోటు లాంటి కేసులు మాత్రం, సీరియస్ గా విచారణ జరుగుంటుంది. ఓటుకు నోటు కేసులో ప్రతి వారం ఏదో ఒక అప్దేడ్ వస్తూనే ఉంది. అయితే అవి చూపించి సంబరపడుతున్న వైసీపీకి, ఇప్పుడు లిక్కర్ స్కాం కేసులో విచారణ, టెన్షన్ పెట్టిస్తుంది.

mopidevi 09042021 2

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, ఈ లిక్కర్ స్కాం వెలుగులోకి వచ్చింది. ఇప్పటి వైసీపీ రాజ్యసభ సభ్యడు మోపిదేవి వెంకటరమణ, అప్పట్లో ఎక్ష్సైజ్ మంత్రిగా ఉన్నారు. అయితే మోపిదేవి మీద కేసు అంటే, జగన్ మోహన్ రెడ్డి సిబిఐ కేసుల్లో ఉన్న కేసు అని అందరూ అనుకుంటారు. కానీ మోపిదేవి పై, లిక్కర్ స్కాం కేసు కూడా ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి హాయాంలో, ఈ మద్యం స్కాం బయట పడటం, కిరణ్ కుమార్ ఎద్ది విచారణకు ఆదేశించటంతో, మొత్తం వ్యవహారం బయట పడింది. అప్పట్లో బొత్సా సత్యన్నారాయణ మీద కూడా అనేక ఆరోపణలు వచ్చాయి. అనేక మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ కేసు విచారణలో ఇప్పుడు ఒక కొత్త ట్విస్ట్ నెలకొంది. అప్పట్లో ఎక్ష్సైజ్ మంత్రిగా ఉన్న మోపిదేవికి, పది లక్షల లంచం ఇచ్చినట్టు, ఆధారాలు కోర్టుకు సమర్పించారు. దీని పై కోర్టు విచారణ చేస్తూ, స్టేట్మెంట్ కూడా రికార్డు చేసింది. ఈ కేసు పై తదుపరి విచారణ, 15 వ తేదీకి వాయిదా పడింది. 15 తరువాత నుంచి, ఈ కేసు కీలక దశకు చేరుకునే అవకాసం ఉంది. దీంతో, ఇప్పుడు వైసీపీ నేతలకు టెన్షన్ పట్టుకుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read