వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, రాష్ట్రంలో ఏమి జరిగినా తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ఉంటారు. ఏది జరిగినా చివరకు చంద్రబాబుకు అంటిస్తూ ఉంటారు. ఎక్కడైనా అధికారంలో ఉన్న వాళ్ళు, తాము అధికారంలో ఉంటూ, ప్రజల కోసం ఏమి చేస్తుంది, ప్రజలకు ఉపయోగ పడే సమాచారం చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం తాము అధికారంలో ఉన్నాం అనే సంగతి కూడా మర్చిపోయి, ఆ ట్విట్టర్ ను కేవలం ఆరోపణలకే ఉపయోగిస్తూ ఉంటారు. చంద్రబాబు పలానా స్కాంలో అవినీతి చేసి, వేల కోట్లు దోచేసారని ట్వీట్ చేస్తారు. మరి అధికారంలో ఉంది మీరే కదా, ఆధారలు బయట పెట్టి చంద్రబాబుని అరెస్ట్ చెయ్యండి అంటే మాట్లాడరు. రాష్ట్రంలో ఏ నేరం జరిగినా, అది చంద్రబాబు చేసారు, చేపించారు, దాని వెనుక చంద్రబాబు ఉన్నారు అంటారు. మరి అధికారం మీదే కదా, ఎందుకు అరెస్ట్ చెయ్యరు అంటే, మాట్లాడరు బురద చల్లటం, వాళ్ళే కడుక్కుంటారులే అని వెళ్ళిపోవటం. అయితే ఈ మధ్య పోలీసులు, ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు ఏమైనా ఆరోపణలు చేస్తే, ఆధారాలు చెప్పండి, అంటూ నోటీసులు ఇస్తూ , లేఖలు రాస్తున్నారు.

సహజంగా ప్రతిపక్షంలో ఉన్నవారు, అధికార పక్షం చేస్తున్న పనుల పై ఆరోపణలు చేస్తూ ఉంటారు. అదే నిజమో కాదో చెప్పాల్సిన బాధ్యత అధికారులది. మన్నా మధ్య ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అనే అనుమానాలు ఉన్నాయని, చంద్రబాబు ప్రధానికి లేఖ రాస్తే, ఆధారాలు ఇవ్వండి అంటూ డీజీపీ , చంద్రబాబుకి లేఖ రాసారు. ఆరోపణలు ఉండేది పోలీసుల మీద అయితే, వీరికి ఆధారాలు ఎలా ఇస్తారు ? అది నిజమో కాదో చెప్పాల్సిన అవసరం పోలీసులకు ఉంది. అయితే ఇప్పుడు విజయసాయి రెడ్డి, గత వారం రోజులుగా పదే పదే, అంతర్వేది రధం తగలబెట్టించింది చంద్రబాబు అంటూ, ట్వీట్లు చేస్తూ, ప్రకటనలు ఇస్తున్నారు. ఒక పక్క పోలీసులకు ఎవరు చేసారో తెలియటం లేదు, మరో పక్క ప్రభుత్వం సిబిఐకి అప్పచెప్పింది, విజయసాయి రెడ్డి మాత్రం పదే పదే చంద్రబాబు పేరు చెప్తున్నప్పుడు, డీజీపీ గారు విజయసాయి రెడ్డి గారికి నోటీసులు పంపించి, ఆయన వద్ద ఎలాంటి ఆధారాలు ఉన్నాయో తెలిస్తే, అది నిజం అయితే చంద్రబాబు మీద చర్యలు తీసుకోవచ్చు కదా ? లేదు అనుకుంటే ఇలాంటి మతపరమైన సున్నిత అంశాల పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, కనీసం వార్నింగ్ అయినా ఇవ్వాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read