రాష్ట్రంలో బూతులు సీజన్ నడుస్తుంది. సామాన్య ఎమ్మెల్యే దగ్గర నుంచి మంత్రులు దాకా, రాజ్యాంగ పదవిలో ఉన్న వారు కూడా, బూతులతో విరుచుకు పడుతున్నారు. అదేమంటే, వాక్ స్వాతంత్ర్యము అంటున్నారు. అలాగే చంద్రబాబు పై రాళ్ళు వేసి కొడితే, నిరసన తెలిపే హక్కు ఎవరికైనా ఉంటుంది అంటూ డీజీపీ వ్యాఖ్యలు చేసారు. అయితే ఇవన్నీ వైసీపీకి అనుకూలంగా ఉండేవారికి అనుకుంటా, అంటున్నారు తెలుగుదేశం నేతలు. ఈ రోజు ఒక మహిళను అరెస్ట్ చెయ్యటం చూస్తుంటే, ఇదే నిజం అని అనిపిస్తుందని టిడిపి ఆరోపిస్తుంది. కొడాలి నాని చేసిన పరుష వ్యాఖ్యలకు, బూతులకు, కంచికచర్లకు చెందిన మహిళా రైతు యలమంచిలి పద్మ, తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. మంత్రి కొడాలి నాని మాట్లాడిన భాషలోనే, ఆయనకు సమాధానం చెప్పారు పద్మ. అయితే, టీవిలో మాట్లాడిన ఈ మాటలు, సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యారు. చాలా మంది, ఈ వీడియోని షేర్ చెయ్యటంతో, వీడియో బాగా వైరల్ అయ్యింది.

padma 03122019 2

దీంతో, ఆ మహిళా రైతు పై, కేసు పెట్టారు వైసీపీ నేతలు. దీంతో, మహిళా రైతు యలమంచిలి పద్మ పై కేసు నమోదు చేసిన కంచికచర్ల పోలీసులు పద్మపై సీఆర్‌పీసీ 41 కింద నోటీసు జారీ చేశారు. ఈ కేసు విషమై ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అయితే, విషయం తెలుసుకున్న తెలుగుదేశం నేతలు, స్థానిక మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, పోలీస్ స్టేషన్ కు వెళ్లి, వివరాలు కనుక్కుని, ఆమెకు స్టేషన్ బెయిల్ వచ్చేలా చేసి, ఆమెను విడిపించుకుని వచ్చారు. గత నెల 26న రాజధానిపై స్పష్టత కోసం యర్రబాలెంలో రైతులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. స్థానిక రైతులతో కలసి పద్మ నిరసన ప్రదర్శనలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె మంత్రి కోడాలి నానిపై తీవ్ర హెచ్చరికలు చేసింది.

padma 03122019 3

మరో పక్క స్టేషన్ నుంచి బయటకు వచ్చిన మహిళా రైతు పద్మ, నేను కొడాలి నాని చేసిన వ్యాఖ్యలకు, చంద్రబాబుని నోటికి ఇష్టం వచ్చినట్టు తిడుతున్న బూతులకు స్పందించానని, కడుపు మండి స్పందించానని అన్నారు. చంద్రబాబు పై ఇష్టం వచ్చిన బూతులు ఆపకపోతే, నేను అలాగే మాట్లాడతానని అన్నారు. మా ఆడవాళ్ళం అందరం కలిసి, మీడియాను పిలిచి, వీళ్ళు మాట్లాడే బూతులు ఖండిస్తామని అన్నారు. ఈ కేసులకు భయపడేది లేదని, తప్పుని తప్పు అని చెప్పటం కూడా, తప్పు అయితే ఎలా అని అన్నారు. అయితే తెలుగుదేశం నేతలు కూడా, ఈ విషయం పై స్పందించారు. బూతులు తిడుతున్న మంత్రులను వదిలేసి, ఆ బూతులు తిట్టద్దు అని చెప్తున్న సామాన్యుల పై, మహిళల పై, మీ ప్రతాపం చూపిస్తారా అని మండి పడుతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read