తెలుగుదేశం పార్టీ, సాక్షి మీడియా పై ఎడిటర్స్ గిల్డ్ తో పాటుగా, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేసింది. ఐటి దాడులకు సంబంధించిన వార్తలను సాక్షి మీడియా ఉద్దేశపూర్వకంగా వక్రీకరించి, తమ ఇమేజ్ దెబ్బతీయడానికి చంద్రబాబు నాయుడు మాజీ వ్యక్తిగత కార్యదర్శిని సాకుగా చూపి, బురద చల్లింది అంటూ తెలుగుదేశం పార్టీ తన ఫిర్యాదులో పేర్కొంది. “సంబంధం లేని విషయాల్లో చంద్రబాబుని ఇరికించారు. తప్పుడు కథనాలు అల్లుతూ, జర్నలిస్టిక్ విలువలు పూర్తిగా విస్మరించబడ్డాయి ”అని టిడిపి సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు లేఖలో ఆరోపించారు. సాక్షి టీవీ న్యూస్, సాక్షి వార్తాపత్రిక క్లిప్పింగులు మరియు వీడియో సిడిలను ఎడిటర్స్ గిల్డ్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు పంపించారు. మరోవైపు, మీడియా సంస్థ పై 500 కోట్ల పరువు నష్టం దావా వేయడానికి టిడిపి ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన పరువు భంగం కలిగించే వార్తలు వేసారని, ఇప్పటికే సాక్షి మీడియాపై పరువునష్టం దావా వేసిన విషయం తెలిసిందే.

రాష్ట్రంలో రాజకీయ వాతావరణ వేడెక్కుతుంది. ఐటి దాడులు కేంద్ర బిందువుగా సాక్షిక్ చేస్తున్న ప్రచారం, దానికి కౌంటర్ గా వచ్చిన పంచనామా రిపోర్ట్ తో జనంలో ఆసక్తిని పెంచుతుంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యక్తిగత కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస్ దగ్గర రూ.2000కోట్లు మేరకు ఆదాయపన్ను ఎగవేత పరిధిలో ఆక్రమలావాదేవీలు జరిగినట్లు సాక్షి హడావిడి చేసింది. అధికార పార్టీ నేతలు ఐటి ప్రకటన వక్రీకరించి టిడిపి పై ఎదురుదాడికి దిగారు. నిజానికి ప్రస్తుతం పెండ్యాల శ్రీనివాస్ మాజీ సీఎం చంద్రబాబు దగ్గర పనిచేయడం లేదు. యిపి సచివాలయంలో తన మాతృసంస్థలో పనిచేస్తున్నారు. ఆయనపై ఐటి దాడుల నిర్వాహణకు సంబంధించి ప్రకటన చేస్తే, అదే విషయాన్ని ప్రస్తావించాల్సి వుంది. మూడు ఇన్ఫ్రా కంపెనీలు నకిలీ బిల్లుల ను గుర్తించామని ఐటి శాఖ తన నోట్లో చెప్పింది.

గతంలో చంద్రబాబుకు పిఎస్ గా పనిచేసినంత మాత్రం చేత పెండ్యాల ఆర్థిక లావాదేవీలకు తెలుగుదేశం పార్టీకి సంబంధం ఏమిటని టిడిపి నేతలు ప్రశ్నించారు. ఇఫ్రా కంపెనీల్లో అక్రమాలు జరిగితే వాటికి తెలుగుదేశంకు ముడిపెట్టడం ఏమిటంటూ ప్రశ్నలు సంధించారు. మాజీ ఎంఎలు బొండా ఉమా, తంగిరాల సౌమ్యలు నేరస్తులకు చిరునామా వైఎస్ కాంగ్రెస్ అంటూ అధికారపార్టీపై ప్రతిదాడి చేసారు. సాక్షి పత్రిక, టీవీతో టిడిపిపై అవినీతి ఆరోపణలను అధికార పార్టీ చేసింది అనే విమర్శలు వచ్చాయి. ఐటి దాడులతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు నారాలోకేష్ అవినీతి భాగోతం బట్టబయలు ఆయిందంటూ , చంద్రబాబు, ఆయన కుమారుడు పాస్ పోర్ట్ స్వాధీనం చేసుకోవాలంటూ హడావిడి చేసారు. కాని ఐటి శాఖ పంచనామా బయట పడటంతో, సాక్షి చెప్పినవన్నీ అబద్ధాలు అని తేలిపోయాయి. అయితే, సాక్షిలో వచ్చిన ఈ తప్పుడు కధనాల పై, ఇప్పుడు తెలుగుదేశం ఇచ్చిన ఫిర్యాదు ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read