తమ సొంత పార్టీ ఎంపీ, రాష్ట్రంలో ప్రభుత్వం పై జరుగుతున్న అవినీతి విషయాలు, మీడియా ముందుకు తెచ్చారరే కారణంతో, ఆయన్ను అనర్హుడిగా ప్రకటించాలి అంటూ, ఇప్పటికే వైసిపీ ప్రయత్నాలు మొదలు పెట్టింది. అయితే రఘురామరాజు మాత్రం, ఎక్కడా పార్టీని, నాయకుడిని నేను తిట్టలేదు అని, నేను ప్రభుత్వంలో జరుగుతున్న విషయాలు సియంకు చెప్దాం అనకుంటే, ఆయన నాకు అపాయింట్మెంట్ ఇవ్వని కారణంగా, మీడియాలో చెప్పి, ఆయన దృష్టికి తెవాల్సి వచ్చిందని చెప్పారు. ఈ వివాదం ఇలా కొనసాగుతూ ఉండగానే, ఇప్పుడు వైసీపీ వ్యూహం మార్చి, రఘురామాకృష్ణం రాజు పై పోలీసు కేసులు పెట్టిస్తుంది. నిన్నటి నుంచి ఈ ప్రక్రియ మొదలైంది. ఆయనకు వ్యతిరేకంగా, జిల్లాలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్కటి అయ్యారు. నిన్న రఘురామకృష్ణం రాజు పై, మంత్రి శ్రీరంగనాథ రాజు తన పీఏ చేత పోలీస్ కంప్లైంట్ ఇప్పించారు. తమను ఆయన దూషించారని, తమ పై అసత్య వార్తలు చెప్తూ, ప్రజల్లో గందరగోళం సృష్టించారు అంటూ కంప్లైంట్ ఇచ్చారు.

నిన్న మంత్రి ఫిర్యాదు చేస్తే, ఈ రోజు ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌, మరో ఎమ్మెల్యే రామకృష్ణ రాజు, తమ పార్టీ ఎంపీ పై, అదే రకమైన ఫిర్యాదు చేసారు. వేరు వేరు పోలీస్ స్టేషన్లలో ఈ కేసులు పెట్టారు. తమను తిడుతూ, అవమానించేలా, ఉద్రిక్తతలు రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారని తెలిపారు. ఆయన పై సరైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. అలాగే జిల్లా ఎస్పీకి కూడా ఈ ఫిర్యాదు చేసారు. ఇవన్నీ చూస్తుంటే, రఘురామకృష్ణం రాజుని వదిలించుకోవాలనే అధిష్టానం నిర్ణయంతో, ఈ గేం ఆడిస్తున్నారని తెలుస్తుంది. అయితే ఈ పరిణామం పై రఘురామ కృష్ణం రాజు కార్యాలయం ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది, ఇవన్నీ కావాలని చేస్తున్నారని, ఆ ప్రెస్ నోట్ సారంశం. ఈ విషయం పై రఘురామ రాజు, ఇంకా నేరుగా స్పందించలేదు. ఒక ఎంపీ మీద పోలీస్ కంప్లైంట్ అంటే, పై నుంచి వచ్చిన ఆదేశాలు ప్రకారం ఇలా చేసారని, దీని పై ఏ వ్యూహం ఉందో, దీని పై రాజు గారు ఎలాంటి పంచ్ ఇస్తారో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read