రఘురామకృష్ణం రాజు ఇస్తున్న జర్కుల నుంచి, ఇక విముక్తి తీసుకోవాలని, వైసిపీ భావిస్తుంది. ఆయన పై అనర్హత వేటు వేసే దిశగా, వైసిపీ పావులు కదుపుతుంది. రేపు స్పెషల్ ఫ్లైట్ వేసుకుని మరీ, లాయర్లు, ఎంపీలతో కలిసి, వైసీపీ నేతలు, రేపు ఢిల్లీ వెళ్తున్నారు. రేపు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాతో భేటీ అయ్యి, రఘురామరాజు పై అనర్హత పిటీషన్లు వేస్తారని తెలుస్తుంది. అయితే ఈ స్పెషల్ ఫ్లైట్ వేసుకుని, తన పై చర్యలు తీసుకోవాలి అంటూ, వస్తున్న వార్తల పై రఘురామ రాజు స్పందించారు. "వీళ్ళకు అసలు కంటెంట్ లేదు. నేను పార్టీని, సియం ని ఏమి అనలేదు. వీళ్ళు ఖాళీగా ఉన్నారు, విమానం ఉంది, ప్రభుత్వ ఖర్చు, తిరుగుతున్నారు. ప్రభుత్వ ఖర్చుతో విమానం వేసుకుని వచ్చి, ఏదో షో చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాలు కూడా, ప్రత్యేక విమానం వేసుకుని వచ్చి, ప్రభుత్వం ఖర్చులో వేస్తారు. ఇది అనవసర ఖర్చు. ఎందుకు చేస్తున్నారో అర్ధం కావటం లేదు. టిటిడి భూములు వేలం ఆపమన్నాని, ఇసుకలో అక్రమాలు మంత్రులే మాట్లాడుతున్నారు, నేను అదే చెప్పా, ఇళ్ళ స్థలాల కుంభకోణం కూడా అంతే. మరి వీళ్ళు నా మీద ఎందుకు పడుతున్నారో. పార్టీకి దేవుడు భూములు అమ్మకానికి, పార్టీకి ఇసుక కుంభకోణానికి సంబంధం ఏమిటి ? ఇది ప్రభుత్వ సంగతి. రెండిటికీ తేడా ఉంది. "

"వీళ్ళకు విమాన ఖర్చులు కూడా దండగ. నన్ను స్పీకర్ సంజయషీ అడుగుతారు, నేను జగన్ గారికి ఏమి రిప్లై ఇచ్చానో, అదే స్పీకర్ గారికి చెప్తాను. అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. ప్రజల కష్టాలు, ఒక ఎంపీ, సియంకు తెలియ చెయకూడదు అనే వాదన ఏంటో అర్ధం కావటం లేదు. ప్రజల సమస్యలు లేవనెత్తటం తప్పా ? ఢిల్లీలో మొత్తం చక్రం తిప్పాను, రాజు గారి మీద ఆక్షన్ తీసుకోవచ్చు అని, అని మా పార్టీ ఎంపీ బాలసౌరి గారు, జగన్ గారికి భరోసా ఇచ్చారని, తరువాతే వీళ్ళు ఇక్కడకు వస్తున్నారని తెలిసింది. చూద్దాం ఏమి చేస్తారో. అయితే నా వరకు, ఇది వృధా. స్పెషల్ ఫ్లైట్ డబ్బులు, దాదాపుగా 14 లక్షలు అవుతుంది, ఆ నష్టం తప్ప ఏమి లేదు. నాకు అయితే ఒక క్లారిటీ వచ్చింది. ఇన్నాళ్ళు జగన్ గారికి తెలియకుండా జరిగింది అని అనుకున్నా, అయితే ఈ రోజు విమానం మొత్తం సెట్ చేసారు అంటే, జగన్ గారికి తెలిసే జరిగింది అని అర్ధం అవుతుంది." అని రఘురామకృష్ణం రాజు అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read