చంద్రబాబు ట్రాప్‌లో వైసీపీ భలే ఇరుక్కుంది. వైజాగ్‌లో చంద్రబాబు తన పర్యటనను పెట్టుకోవటం, బాబును ఎలాగైనా వైజాగ్‌లో అడుగు పెట్టనివ్వం అని వైకాపా ప్రకటించటంతో చంద్రబాబు ప్లాన్ ఊహించిన రీతిలో క్లిక్ అయింది. వైజాగ్ వాసులకు వైకాపా వాళ్లు ఎంత దౌర్జన్యపరులు, ఎంత దాదాగిరి చేస్తారు, ఎలా దాడులు చేస్తారు, ఎలా పేట్రేగిపోతారో చంద్రబాబు వాళ్లతోనే ఈవాళ లోకల్ ప్రజలకు ఒక డెమో ఇప్పించారు. ఇంతకాలం రాజకీయ ఆరోపణగానే ఉన్న వైకాపా రౌడీయిజం చేస్తుంది, వైకాపా వస్తే అరాచకం ప్రబలుతుంది అని తెలుగుదేశం, జనసేన, బీజేపీ చాలాసార్లు రాజకీయంగా ఆరోపించాయి. ఇప్పుడు వాళ్లతో అదే పని చేయించి చంద్రబాబు విశాఖ వాసుల దృష్టిలో వైకాపాను ఎక్స్‌పోజ్ చేశారు. వైజాగ్ వీధుల్లో, విమానాశ్రయానికి వెళ్లే రహదారుల్లో కోడిగుడ్లు, టమాటాలు, చెప్పులు పట్టుకుని నడిరోడ్డు మీద వైకాపా కార్యకర్తలు భీభత్సం చూస్తుంటే వైజాగ్ జనం బిర్ర బిగుసుకుపోయారు. ఆనాడు జగన్‌ను విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి వెనక్కి తిరగ్గొట్టినట్టే చంద్రబాబును కూడా రిటర్న్ పంపాలని వైసీపీ ప్లాన్ వేసింది.

బాబు టూరును ఎవరో తమ సత్తా చూపుతారో వాళ్లకి పార్టీలో గుర్తింపును ఇస్తామని లోకల్‌గా ఆధిపత్యం వహిస్తున్న ఓ ప్రముఖ నేత నిన్నటి వైకాపా కేడర్ మీటింగ్‌లో వాగ్దానం కూడా చేశారు. దాంతో భారీ ఎత్తున వాహనాల్లో జనాలను తీసుకుని వచ్చి విశాఖ నగరంలో వైకాపా చేసిన అల్లరి జనంలో అధికారపార్టీని బ్యాడ్ చేసిందే తప్ప వాళ్లు ఇందులో పాముకునేదేం లేదు. సున్నిత మనస్కులు, సహృదయులు, శాంతికాముకులు అయిన వైజాగ్ సిటిజన్స్‌కు ఈరోజు వైసీపీ ఇచ్చిన డెమో ప్రభావం వచ్చే కార్పోరేషన్ ఎన్నికల్లో ఖాయంగా ఉంటుంది. ప్రశాంతంగా ఉన్న వైజాగ్ పై, పులివెందుల ముఠా కన్ను పడింది అంటూ, తెలుగుదేశం పార్టీ ఇన్నాళ్ళు చేసిన ప్రచారం, నిజం అనే విధంగా, ఈ రోజు వైజాగ్ ప్రజలు లైవ్ లో చూసారు.

ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు విశాఖ చేరుకున్నారు. తెదేపా, వైకాపా కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు చేస్తున్నారు. ఇరుపార్టీల కార్యకర్తలు ఒకే చోట గుమిగూడిన పరిస్థితుల్లో.. విమానాశ్రయం దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తెలుగుదేశం, వైకాపా వర్గీయుల పోటాపోటీ మోహరింపుతో విశాఖ విమానాశ్రయం అట్టుడికింది. తెదేపా అధినేత చంద్రబాబు విమానాశ్రయానికి చేరుకునే సమయానికి ఇరు పార్టీల కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు. పోటాపోటీ నినాదాలతో హోరెత్తించారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ సమయంలోనే విమానాశ్రయం నుంచి చంద్రబాబు బయటకు వచ్చారు. అప్పటికే అక్కడ మోహరించి ఉన్న వైకాపా శ్రేణులు.... ఆయన వాహనశ్రేణిని చుట్టుముట్టారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read