ఒక పక్క జగన్ మోహన్ రెడ్డి, నేను అవినీతి చెయ్యను, చెయ్యనివ్వను, అవినీతి లేని సమాజం నా ధ్యేయం అంటుంటే, సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రం, మొత్తం అవినీతిమయం అని చెప్తున్నారు. ఆనం రాంనారాయణ రెడ్డి, వినుకొండ ఎమ్మెల్యే, రఘురామకృష్ణం రాజు, ఇలా కొంత మంది ప్రజాప్రతినిదులే రాష్ట్రంలో జరుగుతున్న స్కాంలు బయట పెడుతున్నారు. అయితే ఇప్పుడు నెల్లూరు జిల్లాలో జరుగుతున్న విషయాల పై మరో ఎంపీ గళమెత్తారు. నెల్లూరు జిల్లాలో ఒక ఎమ్మెల్యే చేస్తున్న అవినీతి పై, ఫిర్యాదులు చేస్తున్నారు. వాలంటీర్ పోస్టుల నుంచి షిప్ట్ ఆపరేటర్లు, ఉద్యోగాల బదిలీలు, ఉద్యోగాల నియామకం, ప్రభుత్వ నిధుల్లో పర్సంటేజీలు, అక్రమ కట్టడాల్లో వాటాలు, మున్సిపల్ గదుల కేటాయింపులో దందా.. ప్రకృతి సంపద దోపిడీలో భాగస్వామ్యం .. చివరకు బ్రాందీషాపులో పనిచేయాలంటే కూడా ఆ ప్రజా ప్రతినిధికి లంచం ఇచ్చుకోక తప్పడం లేదన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. కొంత మంది అగ్రనేతలు ఈయన అవినీతి బాగోతాలపై అధిష్టానంలోని ముఖ్యనేతలకు ఫిర్యాదులు చేసినట్టు తెలుస్తుంది.

అధికారం చేతిలో ఉంది.. అందిన కాడికి దోచుకోవాలని హోల్‌సేల్ వ్యాపారం మొదలెట్టారని ఆరోపిస్తున్నారు. అయితే ఈ మొత్తం బాగోతం పై ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ రావు ఫిర్యాదు చేసారు. ఆ ప్రజాప్రతినిధి అభివృద్ధి పనుల్లో కమిషన్లు అందుకుంటూ టెండర్ విధానంతో కాకుండా నామినేషన్ పద్దతిలో పనులు పందారం చేయించారని, అందులో కూడా పనులు చేయకుండానే లక్షల నగదు స్వాహా చేసినట్లు, అధికారపార్టీలోని తిరుపతి పార్లమెంటు సభ్యులు బల్లి దుర్గాప్రసాద్ రావు నేరుగా జిల్లా కలెక్టర్ కే లేఖ రాసి ఈ అవినీతి వ్యవహారం పై విచా రణ జరిపించాలని కోరారు. ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభం అయ్యింది. ఎంపీ బల్లి దుర్గాప్రసాద్రావు అధిష్టానికి కాకుండా, జిల్లా కలెక్టర్ కు డైరెక్ట్ గా ఫిర్యాదు చెయ్యటం పై చర్చ జరుగుతుంది. ఆయనే చేసారా, లేక అధిష్టానం చెప్తే ఫిర్యాదు చేసారా అనేది తెలియాల్సి ఉంది. ఎంపీ బల్లి దుర్గాప్రసాద్రావు గత వారం, ఒక శంకుస్థాపన విషయంలో, ప్రోటోకాల్ పాటించకపోవటం పై సొంత పార్టీ నేతల పైనే అసహానం వ్యక్తం చేసారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read