ఆలూ లేదు, చూలూ లేదు. కొడుకు పేరు సోమలింగం అన్నట్లు తయారైంది వైసీపీ వ్యవహారం. వచ్చే నెల 23న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనుండగా, అప్పుడే గెలుపు తమదేనంటూ ఊహల్లో తేలియాడుతున్నారు. ‘పైనా...కిందా.. మనదే గెలుపు. టీడీపీ వారి డీలర్‌షిప్‌లు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు తదితర పోస్టుల మనకే’నంటూ అప్పుడే లెక్కలు వేసుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో అయితే డీలర్‌షిప్‌ నాది, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పోస్టు నీదంటూ అప్పుడే పంపకాలు కూడా పూర్తి చేసుకుంటున్నారు. వీరి పరిస్థితి చూస్తున్న కొందరు గ్రామీణులైతే లోలోపలే నవ్వుకుంటూ అప్పుడే పదవుల కోసం ఆరాటపడుతున్నారే.. ఇక అధికారంలోకి వస్తే పరిస్థితేమిటంటూ చర్చించుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో అయితే కులాల వారీగా ప్రభుత్వం నుంచి లబ్ధి పొందే వివిధ పథకాలను చేజిక్కించుకోవడానికి ఇప్పటికే తమదైన శైలిలో ప్రయత్నిస్తున్నారంటే వైసీపీలో అధికార దాహం ఏస్థాయికి వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు.

ycp 18042019

రెండు రోజుల కిత్రం అనంతపురం జిల్లా ధర్మవరం మండలంలోని ఓ గ్రామంలో వీటిపై ప్రత్యేక సమావేశం నిర్వహించి స్టోర్‌ డీలర్‌షిప్‌లు, ఫీల్డ్‌ అసిస్టెంట్లతో పాటు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల పదవులు కూడా కేటాయింపులు చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. మరికొందరైతే బాగా ఆదాయం వచ్చే పథకాలు మీకెలా ఇస్తామంటూ కొంత అసంతృప్తి కూడా వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మరికొన్ని గ్రామాల్లో అయితే ప్రభుత్వ పథకాలన్నీ మీరే తీసుకుని తనకు హోంశాఖ బాధ్యతలు అప్పగించాలంటూ ఓ నాయకుడు అడుగుతూండడం ఆసక్తి కలిగిస్తోంది. మరికొందరు మాత్రం తమకు రెవెన్యూ శాఖ బాధ్యతలు అప్పగిస్తే చాలంటూ తమ మనస్సులోని మాటను పలువురు సన్నిహితుల వద్ద పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. వీటిని బట్టి చూస్తే ప్రజా సంక్షేమం పక్కన పెట్టి తమ స్వార్థ చింతన కోసం ఎలా ప్రాకులాడుతున్నారో స్పష్టంగా తెలుస్తోంది.

ycp 18042019

రాష్ట్రంలో వైసీపీ అధికారం చేపడుతుందా లేదా అనే విషయం ఇంకా స్పష్టం కాలేదు. అయితే ఈసారి అధికారం తమదేనంటూ సోషల్‌ మీడియాలో వైసీపీ హల్‌చల్‌ చేస్తుండగా, తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం రాష్ట్ర ప్రజలు, మేధావులు, విద్యావంతులు, ముఖ్యంగా మహిళలు తమవైపే ఉన్నారంటూ.. అభివృద్ధికే పట్టం కడతారనే అపార నమ్మకం, అచంచల విశ్వాసంతో ఉన్నారు. గెలుపోటములపై పందేలకు ఎంతకైనా రెడీ అంటూ వైసీపీ నాయకులు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నా కార్యరూపంలోకి వచ్చే సరికి వెనుకడగు వేస్తున్నారని పలువురు చర్చించుకుంటున్నారు. టీడీపీ వారు మాత్రం తమదే గెలుపని వైసీపీ సిద్ధపడితే వారు ఒక వంతు ఇస్తే తాము రెండు వంతుల డబ్బు ఇవ్వడానికి సిద్ధమని పేర్కొంటున్నారు. అయితే వైసీపీ ఊహలు ఫలిస్తాయా? టీడీపీ నమ్మకం, విశ్వాసం గెలుస్తుందా? అనేది తేలాలంటే మే 23వ తేదీ వరకు వేచి చూడక తప్పదు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read