నిన్నమొన్నటి వరకు సవాళ్ళు, ప్రతి సవాళ్ళు. పందెం ఎంతైనా సరే.. మేము రెడీ అంటూ రెచ్చగొట్టే ధోరణి. గెలుపు మాదే.. మెజార్టీ మీరే చెప్పండి.. సీట్లు ఎన్ని, ఓట్లు ఎన్నో కూడా తేల్చేస్తాం. ఈసారి అధికారంలోకి వచ్చేది మేమే, మీ అందరి పని పట్టేది మేమే.. గడిచిన పది రోజులుగా వైసీపీ శిబిరంలో చోటు చేసుకున్న పరిణామాలివి. కాని ఒక్కసారిగా ఈ సందడి కాస్తా చప్పపడినట్టుగానే కనిపిస్తోంది. ఇంతకు ముందు మాదిరిగా సవాళ్ళు లేనేలేవు. పందెం రాయుళ్ళ విర్రవీగుడుతనం తగ్గింది. ఇప్పుడే ఎందుకు అంత తొందర.. ఓట్ల లెక్కింపునకు ఇంకా చాలా సమయం ఉంది కదా అంటూ దాటవేత వైఖరి. ఫ్యాను గాలి వేడెక్కింది. తర్జనభర్జనల నడుమ ఉక్కిరిబిక్కిరి అయ్యి వాదనలను వాయిదా వేస్తున్నారు. గెలుపోటములపై లెక్కలు తీయడం ఆపి ఎదుటి పక్షం ఏం జరుగుతుందో ఆరా తీయడం ఆరంభమైంది.

jagan 25042019

వైసీపీలో నిన్నామొన్నటి వరకు దుందుడుకుగా వ్యవహరించిన తీరును చూసిన వారంతా అసలేం జరుగుతుందనే దానిపైనే దృష్టి పెట్టారు. మరికొందరు రకరకాల ఊహాగానాలు చేస్తున్నారు. పోలింగ్‌ పూర్తయిన వెంటనే అత్యధిక స్థానాలు ఎవరు గెలవబోతున్నారనే దానిపై తర్జనభర్జనలు సాగాయి. వైసీపీ నేతల్లో అత్యధికులు ఇంకేముంది అధికారం మా పరం.. అంటూ ఏకంగా జబ్బలు చరిచారు. అంతకంటే మించి మెజార్టీ కూడా లెక్కించి మరీ చెప్పారు. ఇంకాస్త ముందుకు వెళ్ళిన కొందరు గెలవబోయేవారిలో ఎవరెవరు మంత్రులు కాబోతున్నారో నోటిమాట ప్రచారం చేశారు. ఇలా ఒక రకంగా కాదు.. ప్రజా తీర్పు తమవైపే ఉందంటూ రకరకాల ప్రచారాలు తెరముందుకు తెచ్చారు. వాట్సప్‌ గ్రూపుల్లో వచ్చిన వైసీపీ అనుకూల సర్వేలు హల్‌చల్‌ అంతా ఇంతా కాదు. కాని ఇంతిలా.. కొన్ని రోజులు సాగిన హడావుడి కాస్తా ఇప్పుడెందుకు సద్దుమణిగింది.

 

jagan 25042019

నియోజకవర్గాల వారీగా, బూత్‌ స్థాయిలో వేసిన అంచనాలే కారణమా.. మరేదైనా కారణాలు స్పష్టంగా ఉన్నాయా.. ఊహించిన దానికంటే భిన్నంగా బలం తగ్గినట్టు కనిపిస్తుందా.. ఓటింగ్‌ సరళిలో మార్పులు గమనించారా.. అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్న వారిలో వైసీపీలోనే అత్యధికంగా ఉన్నారు. జగన్ కూడా అంతా దేవుడి దయ అంటూ పోలింగ్ తీరుపై మాట్లాడటంతో వైసీపీ నేతలు పూర్తిగా నమ్మకం కోల్పోయే పరిస్థితికి వచ్చారు. అయితే పోలింగ్ ముగిసిన తరువాతి రోజు సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వైసీపీ నేతల్లో గెలుపు ఉత్సాహాన్ని నింపాయి. ఈవీఎంలపై పోరాటాన్ని తీవ్రతరం చేయడంతో చంద్రబాబే పరోక్షంగా ఓటమిని అంగీకరించారని వారు విశ్లేషించుకుని ఉత్సాహాన్ని తెచ్చుకున్నారు. ఆ తరువాత పోలింగ్ బూత్‌ల వారీగా లెక్కల్లో తేడా కొట్టడంతో వారికి తత్వం బోధ పడింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read