వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా పేరున్న రోజా, ఈ మధ్య సైలెంట్ అయ్యారు. అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చి, చంద్రబాబుని, లోకేష్ ని తిట్టి వెళ్ళటం మినహా పెద్దగా ఆక్టివ్ గా ఉండటం లేదనే చెప్పాలి. ఇటీవల రోజుకి సొంత జిల్లాలో, సొంత పార్టీ నుంచే పోరు ఎక్కువ అయ్యింది. సొంత పార్టీ క్యాడర్ నుంచి కూడా బహిరంగంగా వ్యతిరేకత రావటం ఒకటి రెండు సందర్భాల్లో మీడియాలో కూడా వచ్చింది. ఇక మరో పక్క ఇద్దరు మంత్రులు నుంచి కూడా రోజాకు సహకారం లేదనే ప్రచారం ఉంది. అయితే ఇవన్నీ పక్కన పెడితే, జగన్ దగ్గర తనకు పలుకుబడి ఉందని, ఏదైనా అక్కడే తెల్చుకుంటా అంటూ, వ్యతిరేక వర్గానికి చెక్ పెడతాను అంటూ రోజా తన సన్నిహితుల దగ్గర చెప్తూ ఉంటారని ప్రచారంలో ఉంది. అయితే ఇప్పుడు తాజాగా అధిష్టానం వైపు నుంచి కూడా రోజాకు షాక్ తగిలింది. దీనికి కారణం ఇటీవల ప్రకటించిన 56 బీసి కులాల కార్పొరేషన్ లు వాటి కూర్పు. రోజాకు తన నియోజకవర్గంలో, కే.శాంతి అనే వైసిపీ నేత నుంచి వ్యతిరేకత వస్తుంది. ఒకానొక సందర్భంలో బహిరంగంగా కూడా మాటలు అనుకునే స్థాయికి వచ్చారు. అయితే ఇప్పుడు శాంతి అనే ఆవిడకు ఈడిగ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించటం, రోజా వర్గానికి మింగుడు పడటం లేదు. ఇంకా ఇబ్బంది పెట్టే అంశం, ఈ చైర్మెన్ లు అందరికీ క్యాబినెట్ ర్యాంక్ ఉండటం. రోజాకు కూడా ఏపీఐఐఐసి చైర్మెన్ గా క్యాబినెట్ ర్యాంక్ ఉంటే, ఇప్పుడు తన వ్యతిరేక వర్గం అయిన శాంతికి కూడా క్యాబినెట్ ర్యాంక్ తో కూడిన పదవి రావటంతో, షాక్ తిన్నారు.

గతంలో శాంతి అనే వైసీపీ నాయకురాలు, నగరి మునిసిపల్ చైర్ పర్సన్ గా పని చేసారు. ఆమె భర్త కుమార్ కూడా, మునిసిపల్ చైర్పర్సన్ గా పని చేసారు. వీరికి నగిరి నియోజకవర్గం పై పట్టు ఉంది. అదీ కాక నియోజకవర్గం బీసిలు, ఎస్సీల డామినేషన్ ఎక్కువ. గతంలో వీరు, రోజాతో కలిసి పని చేసేయిన్ వారే. ఎలక్షన్ ప్రచారంలో, రోజా వీరి ఇంట్లో హాల్ట్ తీసుకునేంత చనువు కూడా ఉంది. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత, ఇరు వర్గాలకు గ్యాప్ వచ్చింది. కారణాలు బయటకు తెలియకపోయినా, ఇరు వర్గాల మధ్య కోల్డ్ వార్ట్ నడుస్తుంది. దీంతో ఇరు వైపులా, ఎవరి ఎత్తులు వారు వేస్తూ రాజకీయం చేస్తున్నారు. ఇక మరో పక్క వీరికి, జిల్లాలోని ఇద్దరు మంత్రులు నుంచి సపోర్ట్ ఉండటం, అలాగే ఇరువురు రోజాకి వ్యతిరేకంగా పని చేస్తున్నారనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. ఈ నేపధ్యంలో, మంత్రుల అండదండలతోనే, శాంతికి పదవి వచ్చిందని, రోజా వర్గం భావిస్తుంది. నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన రోజా వ్యతిరేక వర్గం అయిన శాంతికి పదవి రావటం రోజాకు షాక్ అనే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రోజా దూకుడుకు బ్రేక్ వేసే క్రమంలోనే అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని భావిస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read