ఎంకి పెళ్లి సుబ్బి చావు కొచ్చిందన్నట్లు.. కరోనా ప్రభావం స్థానిక సంస్థల్లో పోటీ చేసే అభ్యర్థులను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంరంభం ప్రారంభమైన దగ్గర నుంచి పోలింగ్ కు సమయం తక్కువగా ఉండటంతో గతంతో పోలిస్తే తక్కువ ఖర్చులో బయట పడొచ్చని చాలా మంది అభ్యర్థులు భావిం చారు. మార్చి 1 వతేది ఎంపీటీసీ, జెడ్పీటీసీలతో పాటు 8న కార్పొరేషన్లు, మున్సిపాలి టీలు, నగర పంచాయతీలకు నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి, అల్లకల్లోలం సృష్టించింది వైసీపీ. అన్ని వీడియోలు టీవీల్లో, సోషల్ మీడియాలో వచ్చాయి. దోర్జన్యాలతో, జగన్ చెప్పినట్టు, 90 శాతం సీట్లు మావే అని వైసీపీ విర్రవీగుతున్న సమయంలో, తొమ్మిదో రోజు మార్చి 15న మాత్రం ఊహించని పిడుగు లా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని కరోనా ప్రభావమంటూ ఆరు వారాలు వాయిదా వేయడంతో చాలా మంది అభ్యర్థులు డీలా పడిపోయారు. ఏకగ్రీవాలు అయిన వారు ప్రస్తుతం ఊపిరి పీల్చుకుంటున్నా.. భవిష్యత్తులో ఏమైనా మార్పులు చేర్పులు జరిగితే మళ్లీ వ్యవహారం మొదటికి వస్తుందేమోనన్న అనుమానాలు ఏదోమూలవారిని కూడా వెంటాడుతున్నాయి.

ఎంతో కష్టపడి, మ్యానేజ్ చేసి, ఏకాగ్రీవాలు చేస్తే, ఇప్పుడు నోటిఫికేషన్ ఉంటుందో, రద్దు చేసి, మళ్ళీ మొదలు పెట్టాలో అనే భయం వారిని భయపెడుతుంది. అంతా అనుకున్నది అనుకున్నట్లయితే ఎంపీటీసీ, జెడ్పీటీసీ లకు మార్చి 21న, మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లు, నగర పంచాయితీలతో పాటు గ్రామ స్థాయి పంచాయతీలకు కూడా ఈ నెల 27న పోలింగ్ పూర్తవ్వాల్సి ఉంది. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం.. ఎంపీటీసీ అత్యధికంగా రూ.2 లక్షల వరకు, జెడ్పీటీసీ అత్యధికంగా రూ.4 లక్షల వరకు ఖర్చు పెట్టుకోవచ్చు. అదే విధంగా కార్పొరేషన్ల పరిధిలోని వార్డు సభ్యులు రూ.2 లక్షలు, మున్సిపాలిటీ పరిధిలోని వార్డు సభ్యులు రూ.1.50 లక్షలు, నగర పంచాయితీ పరిధిలోని వార్డు సభ్యులు ఒక లక్ష రూపాయిల వరకు గరిషంగా ఖర్చు చేసుకునే వెసులుబాటు ఎన్నికల సంఘం కల్పించింది. ప్రస్తుత వాయిదా నేపధ్యంలో మరలా పోలింగ్ జరిగే వరకు ఓటర్లతో పాటు కార్యకర్తలను, ప్రజలను ఆకట్టుకోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి.

ఖర్చు ఎంతవుతుందో తెలియదు, ఎన్నికల కోడ్ కూడా తీసివేయమని సుప్రీం కోర్టు సూచించిన నేపధ్యంలో.. మరో 40 రోజులు ప్రచారంలో గడపాలా వద్దా, ఒక వేళ గడపాల్సివస్తే అంత ఖర్చును భరాయిస్తూ ఎలా అన్నదే ఇప్పుడు ఎక్కువ మంది అభ్యర్థులను వేధిస్తున్న ప్రధాన సమస్య. నిబంధనలు మీరితే ప్రత్యర్థులతో పాటు సొంతపార్టీలోని అస్మదీయుల కన్ను కూడా తమపై ఉండటంతో ఏమి చేయాలో పాలుపోని పరిస్థితుల్లో పోటీకి దిగిన ఆశావహులు కొట్టుమిట్టాడుతున్నారు. కరోనా ప్రభావంతో అకస్మాత్తుగా ఆరు వారాలు అంటే సుమారు 42 రోజులు వాయిదా పడటంతో అభ్యర్థులు బెంబేలెత్తు తున్నారు. 5 నుంచి 12 రోజులకు సరిపడా నగదును సిద్ధంచేసుకుని రంగంలోకి దిగిన వారికి ఇప్పుడు మరో ఆరు వారాలు అదనంగా ప్రచారం చేయడం, మ్యానేజ్ చెయ్యటం ఆర్థికంగా పెను భారం కానున్నది. వాయిదా ప్రకటన రావడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. అన్నింటినీ సిద్ధం చేసుకున్న కొందరు ఇప్పుడు సంబంధిత పార్టీలలో ఇతర పోటీదారులతో పాటు స్థానికుల ఒత్తిడిని కూడా తట్టుకోలేక పోతున్నారు. అన్నిటికీ మించి, నోటిఫికేషన్ రద్దు అయితే, ఇంత కష్టపడి, అందరినీ మ్యానేజ్ చేసి, చేసిన ఏకగ్రీవాలు, వాటి కోసం పెట్టిన ఖర్చు ఎలా అనేది, అధికార పార్టీ నేతలకు అర్ధం కావటం లేదు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read