వైఎస్ వివేక కేసు సిబిఐకి అప్పచెప్పిన తరువాత, అనేక సంచలన విషయాలు బయట పడ్డాయి. అయితే పెద్ద తలకాయల ప్రమేయం ఉందని, ఎంత చెప్పినా, ఎన్ని ఆధారాలు కళ్ళ ముందు ఉన్నా, ఇప్పటి వరకు సిబిఐ మాత్రం, అటు వైపు కూడా తొంగి చూడటం లేదు అనే విమర్శలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే, ఇప్పుడు అరెస్ట్ చేసిన వారు కూడా బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కేసు విచారణ కీలక దశలో ఉన్న సమయంలో, వీళ్ళు బయటకు వస్తే, ఏమైనా జరగొచ్చు అనే ప్రచారం ఉంది. కళ్ళ ముందే పరిటాల రవి కేసు అందరికీ గుర్తుంది. ఈ నేపధ్యంలోనే, ఈ కేసు విషయం పై, ఇప్పుడు సునీత నేరుగా రంగంలోకి దిగారు. ఈ పరిణామం, ఇప్పుడు ఈ కేసు విషయంలో ఒక ట్విస్ట్ అనే చెప్పాలి. ఇందుకు ప్రధాన కారణం, సిబిఐ మీద సునీతకు అనుమానాలు ఉండటమే కారణం అనుకోవాలి. అందుకే ఆమె నేరుగా కోర్టులో పిటీషన్ వేసి, తన వైపు నుంచి కూడా వాదనలు వినలాని కోరారు. వివేక కేసులో, సునీల్‌ యాదవ్‌ , గజ్జల ఉమాశంకర్‌ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌ రెడ్డిలను సిబిఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో దేవిరెడ్డి శివశంకర్‌ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డికి చాలా కావలసిన మనిషి అనేది అందరికీ తెలిసిందే. వీరు ముగ్గురూ ప్రస్తుతం జైలులో ఉండటంతో, వాళ్ళు ఇప్పుడు బెయిల్ పిటీషన్ దాఖలు చేసారు.

viveka 03052022 2

అయితే వీరు ముగ్గురూ తమ వాదనలు కోర్టు ముందు వినిపించారు. ఇక సిబిఐ తన వాదనలు వినిపిస్తే, వీరి బెయిల్ పిటీషన్ పై కోర్టు ఒక నిర్ణయం ప్రకటించనుంది. అయితే అనూహ్యంగా ఈ బెయిల్ పిటీషన్ల విషయంలో వైఎస్ సునీత ఎంటర్ అయ్యారు. ప్రధానంగా సిబిఐ వాదనల పై ఆమెకు నమ్మకం లేకే, ఆమె నేరుగా తన వైపు నుంచి కూడా వాదనలు వినిపించి, ఆ ముగ్గురికీ బెయిల్ రాకుండా ఉండటానికి చూడటానికి ప్రయత్నం చేస్తున్నారు అనే ప్రచారం జరుగుతుంది. వివేకా కుమార్తెగా తమకు కూడా హక్కు ఉందని, తమ వాదనలు కూడా వినాలి అంటూ, సునీత, కోర్టులో అనుబంధ పిటీషన్ దాఖలు చేసారు. దీంతో కోర్టు ఈ పిటీషన్ ను అనుమతి ఇచ్చింది. బుధవారం నాడు, సునీత తరుపున వాదనలు వినటానికి కోర్టు అంగీకరించింది. ఒక పక్క సిబిఐ పై అనేక అనుమానాలు ఉన్న నేపధ్యంలో, సునీత నేరుగా రంగంలోకి దిగి పోరాటం చేస్తున్నారు. ఆమె పోరాటం ఫలిస్తుందా, ఆమె తండ్రిని చంపిన వారికి శిక్ష పడేలా ఆమె పోరాటం ఉంటుందో లేదో చూడాలి మరి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read