మాజీ ఎంపీ వివేకానందరెడ్డి మృతిపై నమ్మలేని నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. పోర్టుమార్టం రిపోర్టులో వైద్యులు వివేకాది హత్యేనని ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు. అయితే వివేకా మృతిపై కడప ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ పలు కీలక విషయాలు మీడియాకు వివరించారు. వివేకానందరెడ్డిది హత్యేనని ఆయన వెల్లడించారు. తలపై మూడు, ఒంటిపై రెండు గాయాలున్నాయని తెలిపారు. వివేకా గదిలో ఫింగర్‌, ఫుట్‌ ప్రింట్స్‌ సేకరించామని, ఇంటి వెనుక తలుపు తెరిచే ఉందని ఎస్పీ చెబుతున్నారు. వెనుక తలుపు నుంచి ఎవరైనా వచ్చారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని, ఘటన రాత్రి 11:30కి జరిగినట్లు తెలుస్తోందన్నారు. రాత్రి 11:30 గంటల నుంచి ఉదయం 6:30 గంటల మధ్యలో.. ఇంటికి ఎవరెవరు వచ్చారు అనే విషయంపై ఆరా తీస్తున్నామన్నారు.

jagan kcr 15032019

పోస్టుమార్టం, ఫోరెన్సిక్‌ నివేదికలు ఇంకా రాలేదని రాహుల్‌దేవ్‌శర్మ తెలిపారు. కొద్దిసేపటి క్రితం వివేకానందరెడ్డి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తైంది. మృతదేహాన్ని అధికారులు కుటుంబసభ్యులకు అప్పగించారు. తలకు బలమైన గాయం, ఒంటిపై గాయాలు ఉండటంతో.. పోలీసులు హత్యగా అనుమానిస్తున్నారు. వివేకానందరెడ్డి ఇంట్లో డాగ్‌ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించింది. వివేకా ఇంటి ఆవరణలో తిరిగి పోలీస్‌ డాగ్‌ లోపలికి వెళ్లింది. వివేకా మృతి హత్య కేసుగా పోలీసులు నమోదు చేశారు. ఐపీసీ 302 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. ఘటనాస్థలాన్ని సిట్‌ ఇన్‌చార్జ్‌ అమిత్ గార్గ్ పరిశీలించారు.

jagan kcr 15032019

ఇవీ అనుమానాలు.. ముందుగా వివేకా మృతదేహాన్ని చూసిందెవరు? ఎన్ని గంటలకు మృతదేహన్ని గుర్తించడం జరిగింది? పోలీసులకు ఎన్ని గంటలకు సమాచారం ఇచ్చారు..? పోలీసులు వచ్చేలోపుగా వివేకా ఇంటికి ఎవరెవరు వచ్చారు? వచ్చిన వారు ఏం చేశారు? బాత్ రూంలోని మృతదేహన్ని బెడ్ రూంలోకి మార్చిందెవరు? బెడ్ రూంలో రక్తం మరకలను తుడిచింది ఏవరు? ఆ రక్తం మరకలను తుడవమని చెప్పిందెవరు? వివేకా మృతి చిన్న విషయమే.. కేసు వద్దు అని ఎందుకన్నారు? కేసు అవసరం లేదని అవినాష్‌ అన్నారన్న మాట నిజమేనా? వివేకా కూతురు, అల్లుడు హైదరాబాద్‌ నుంచి పోలీసులతో మాట్లాడిన తర్వాతే కేసు నమోదు చేశారా? నుదుటిపై గాయాలు ఎందుకున్నాయని వివేకా కూతురు నిగ్గదీశారా? ఒంటిమీద అంత పెద్ద పెద్ద గాయాలు ఉంటే గుండెపోటు, సహజ మరణం అన్న మాటలు ఎందుకొచ్చాయి? హత్యగా స్పష్టంగా కన్పిస్తున్న గుండెపోటు అని ఎందుకు ముందు ప్రకటించారు?అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read