గుడివాడలో మంత్రి కొడాలి నాని నిర్వహిస్తున్న క్యాసినో విషయం పై, నిజ నిర్ధారణ చేయటానికి ఈ రోజు తెలుగుదేశం పార్టీ బృందం గుడివాడ వెళ్ళింది. అయితే అందరూ అనుకున్నట్టే, అటు పోలీసులు, ఇటు వైసిపీ నేతలు, టిడిపి పైన దా-డి-కి తెగ బడ్డారు. పోలీసులు కేవలం టిడిపి నేతలనే అడ్డుకోవటం, వైసిపీ వారికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వటంతో, ఏకంగా గుడివాడ టిడిపి కార్యాలయం పై దా-డి వరకు విషయం వెళ్ళింది. ఈ దా-డిలో బొండా ఉమా కారు కూడా ధ్వంసం అయ్యింది. కొడాలి నాని ఫంక్షన్ హాల్ లో, కొడాలి నాని పాటలు పెట్టుకుని, వైసిపీ రంగులు వేసుకుని, క్యాసినో ఆడిన వీడియోలు బయటకు వచ్చాయి. అయితే అక్కడ ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం లేట్ గా రెస్పాండ్ అయ్యారు. దీంతో టిడిపి రంగంలోకి దిగింది. అసలు అక్కడ ఏమి జరిగిందో తెలుసుకోవటానికి నిజ నిర్ధన కమిటీ, గుడివాడ వెళ్ళింది. అయితే టిడిపి బృందం బయలు దేరిన దగ్గర నుంచి పోలీసులు అడ్డుకున్నారు. ముందుగా పామర్రు దగ్గర అడ్డుకోగా, చివరకు వదిలి పెట్టారు. తరువాత గుడివాడ వెళ్ళగా, అప్పటికే అక్కడ మొహరించి ఉన్న వైసిపీ శ్రేణులు, టిడిపి నాయకుల పై దా-డి చేసారు. రా-ళ్ళ దా-డి చేయటంతో, బొండా ఉమా కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఎదురు టిడిపి నేతలనే పోలీసులు అరెస్ట్ చేసారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read