ప్ర‌కాశం జిల్లాలో పింఛ‌ను డ‌బ్బు మొత్తం దొంగ‌నోట్లు ఇచ్చిన వాలంటీర్ గుర్తున్నాడా? ఈ దొంగ‌నోట్లు ఎక్క‌డి నుంచి వ‌స్తున్నాయ‌నే డౌట్ కూడా లేటెస్ట్ గా క‌ర్ణాట‌క పోలీసుల అరెస్టుతో తేలిపోయింది. వైసీపీ పెద్దలకి బాగా కావాల్సిన వైసీపీ మ‌హిళానేత రసపుత్ర రజని వ‌ద్ద ల‌క్ష‌ల్లో దొంగ నోట్లు స్వాధీనం చేసుకున్నారు బెంగ‌ళూరు పోలీసులు. క్రిమిన‌ల్ హిస్ట‌రీ షీట్ ఉన్న రజనీకి వెన్నుద‌న్నుగా వైసీపీ కీలక నేతలు నిలుస్తున్నారు. గ‌తంలోనూ ఉద్యోగాలు ఇప్పిస్తాన‌ని మోసం చేసిన కేసులో ర‌జ‌నీ ప్ర‌ధాన సూత్ర‌ధారి. బెంగళూరులోని సుబ్రమణ్యపుర పోలీసులు ర‌జ‌నీతోపాటు మ‌రి కొంద‌రిని అరెస్ట్ చేసి రూ. 44 లక్షల విలువైన దొంగ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. వైసీపీ కీల‌క‌నేత‌గా పెద్ద‌ల ఆశీస్సుల‌తో చెలామ‌ణి అవుతోన్న ర‌జ‌నీని రాష్ట్ర బొందిలి కార్పొరేషన్ డైరెక్టర్ గా కూడా నియ‌మించారు. మోసాలే వృత్తిగా ర‌జ‌నీ చాలా ఎత్తుకు ఎదిగింది. ఆమె వెనుక బ‌డానేత‌లు ఉండ‌డంతో నోట్లు ముద్రించి ఏపీలో స‌ర్కులేట్ చేస్తున్నార‌ని ఆరోప‌ణ‌లున్నాయి. ర‌జ‌నీ అరెస్టుపై ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే మాట్లాడుతూ న్యాయ‌స్థానాల‌లో పోరాడుతామ‌ని, త‌ప్పుచేయ‌క‌పోతే అండ‌గా ఉంటామ‌ని ప్ర‌క‌టించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read