ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం వ‌చ్చిన నుంచీ ప్ర‌చార‌పిచ్చి ప‌రాకాష్ట‌కు చేరింద‌ని క‌థ‌నాలు వ‌చ్చాయి. ప‌చ్చ‌నిచెట్లు కొట్టేసి, వాటికి మోడుకి వైసీపీ రంగులు వేయ‌డం, ప‌థ‌కాల పేర్లు మార్చేయ‌డం ద‌గ్గ‌ర నుంచీ ప్ర‌తీ విష‌యంలోనూ సీఎం జ‌గ‌న్‌ ప‌బ్లిసిటీ పిచ్చ చూపించుకుంటున్నార‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. కేస్ట్ స‌ర్టిఫికెట్ల మీద‌, పాసుబుక్కుల మీద, కొల‌త‌ల రాళ్ల మీద కూడా జ‌గ‌న్ రెడ్డి ఫోటోలు వేసుకోవ‌డం చూసి సామాన్య జ‌నం మా హ‌క్కుల‌పై జ‌గ‌న్ ఫోటోలేంటి అని బాహాటంగానే ప్ర‌శ్నిస్తున్నారు. అయినా వెన‌క్కి త‌గ్గ‌ని ప్ర‌భుత్వ పెద్ద‌లు విద్యార్థులు పాఠ్య‌పుస్త‌కాలు, స్ట‌డీమెటీరియ‌ల్, నోటు బుక్కుల‌పైనా త‌మ ఫోటోలు, పార్టీ రంగులు వేసుకోవ‌డం అన్నివ‌ర్గాల నుంచీ తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలోని 480 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం రూ. 1.20 కోట్లు వెచ్చించి 49వేల తెలుగు-ఆంగ్ల మాధ్యమ స్టడీ మెటీరియల్ పుస్తకాలను ముద్రించ‌డానికి జడ్పీ నిధులు వెచ్చించారు.  ‘జగనన్న విద్యా భారతి’ పేరుతో ముద్రించిన ఈ స్టడీ మెటీరియల్ పుస్తకాల‌పై సీఎం జగన్, మంత్రులు బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాల నాయుడు, పినిపే విశ్వరూప్, దాడిశెట్టి రాజా, చెల్లుబోయిన వేణు, జెడ్పి చైర్మన్, సీఈఓల ఫోటోలు వేశారు. మెటీరియ‌ల్ ఇంగ్లీషు మీడియం..క‌వ‌ర్ పై వైసీపీ ప్ర‌క‌ట‌న‌లు తెలుగులో ఉన్నాయి. విద్యార్థుల‌కు ఇచ్చే స్ట‌డీ మెటీరియ‌ల్ పై వైసీపీ నేత‌ల ఫోటోలు, రంగులు వేయ‌డంపై విద్యావేత్త‌లు తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read