2019 ఎన్నికల ముందు జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తూ ఉండగా, కోర్టు వాయిదా కోసం విశాఖ ఎయిర్ పోర్ట్ కి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి పై కోడి కత్తితో అటాక్ జరిగిన విషయం తెలిసిందే. జగన్ భుజానికి కొంచెం గుచ్చుకోవటంతో, వైసీపీ చేసిన రాద్దాంతం అంతా ఇంతా కాదు. అప్పట్లో అధికారంలో ఉన్న చంద్రబాబు చేపించాడు అంటూ, గోల గోల చేసారు. అయితే కేవలం రెండు గంటల్లోనే, ఆ వ్యక్తి వైసీపీ సానుభూతి పరుడుగా తేలింది. జగన్ పేరుతో ఫ్లెక్స్ లు, జగన్ అంటే అభిమానం, ఇలా అనేక విషయాలు ఆధారాలతో బయటకు రావటంతో, అప్పట్లో వైసీపీ ఇరుకున పడింది. వెంటనే తమ ప్రచారం వేరే విధంగా తిప్పి, టిడిపి మీద ఆరోపణలు చేయాలనే తమ ప్లాన్ ను మార్చుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పుడు కూడా ఇలాగే టిడిపి మీద ఆరోపణలు చేద్దాం అని ప్రయత్నం చేసిన వైసీపీకి భారీ షాక్ తగిలింది. రాష్ట్రంలో మంచి ఏమి జరిగినా తమ ఖాతాలో వేసుకుని, చెడు ఏమి జరిగినా టిడిపి ఖాతాలో వేయటం, వైసిపికి బాగా అలవాటు. ఏమి జరిగినా, చంద్రబాబు మీద, టిడిపి మీద తోసేసి పబ్బం గడుపుతూ ఉంటారు. ఇలాగే రెండు రోజుల క్రితం, హైకోర్టులో పేదల ఇళ్ళ నిర్మాణాల పై ఇచ్చిన తీర్పు విషయంగా, టిడిపిని, చంద్రబాబుని, కోర్టులను ఆపాదిస్తూ వైసీపీ చేసిన ప్రచారం బూమరాంగ్ అయ్యింది.

jagan 13102021 2

విషయానికి వస్తే, పేదలకు ఇళ్ళ నిర్మాణం అంటూ వైసిపి హడావిడి చేస్తున్నా, ఒక్క ఇల్లు నిర్మాణం కూడా ఇప్పటి వరకు జరగలేదు. ఈ లోపు రెండు రోజుల క్రితం, కోర్టులో వేసిన ఒక పిటీషన్ లో, ఇళ్ళ నిర్మాణం సెంటు భూములు చేయటం పై అభ్యంతరం వ్యక్తం కాగా, కోర్టు ఒక కమిటీ వేసి, దీని పై నెల రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరింది. అయితే, దీన్ని అవకాసంగా తీసుకున్న వైసీపీ, టిడిపి ఈ పిటీషన్ వేసిందని, ఇళ్ళ నిర్మాణం టిడిపికి ఇష్టం లేదు అంటూ ప్రచారం చేసారు. అయితే తీరా చూస్తే పిటీషన్ వేసిన వ్యక్తి. పొదిలి శివమురళి అనే వైసిపి కార్యకర్త, జగన్ తో సేల్ఫీ కూడా దిగిన ఫోటోలు బయటకు వచ్చాయి. దీంతో ఈ పిటీషన్ వైసీపీనే వేయించింది అంటూ టిడిపి ఎదురు దాడికి దిగింది. గతంలో జూపూడి జాన్సన్ అనే వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల అనుచరుడు, అలాగే వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి అనుచరుడు కూడా ఇలాగే కేసులు వేసి, ఎదురు టిడిపి పైన ఆరోపణలు చేయటాన్ని టిడిపి గుర్తు చేస్తుంది. ఇళ్లు కట్టలేక వైసీపీ నాటకాలు ఆడుతూ, తమ పైన ఆరోపణలు చేస్తుంది అంటూ, టిడిపి ఈ ప్రచారాన్ని తిప్పి కొట్టింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read