గన్నవరం MLA వల్లభనేని ని వంశీ ని ఉద్దేశించి, వైసిపి MLA శ్రీధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. ఇది అనంతపురం జిల్లలోనే కాక, రాష్ట్ర వ్యాప్తంగా హట్ టాపిక్ గా మారింది. పుట్టపాడు నియోజకవర్గం నల్లమాడులో  గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం అనే కార్యక్రమానికి పుట్టపర్తి MLA శ్రీధర్ రెడ్డి హాజరయ్యారు. ఇదే కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ముందుగా గౌరవ సభల పేరుతో తెలుగు దేశం పార్టీ ప్రజల్లో కి వెళ్తున్న దాని పై విమర్శలు గుప్పించారు. గౌరవ సభల పేరుతో కార్యక్రమాలు చేస్తున్న చంద్రబాబును మా వైసిపి MLAలు, ఏ ఒక్కరూ కూడా విమర్శలు చేయలేదు, ఆ విమర్శలు చేసింది  వల్లభనేని వంశీ, వంశీతో తమకు, తమ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని, వల్లభనేని వంశీ అనే వాడు తెలుగుదేశం పార్టీ "బి ఫాం" తో గెలిచాడు, చంద్రబాబు ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసింది కూడా వాడే అంటూ శ్రీధర్ రెడ్డి విరుచుకు పడ్డారు. గన్నవరం MLA వంశీ ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలతో ఆ కార్యక్రమం లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ విమర్శలు రాజకీయంగా కూడా  తీవ్ర చర్చకు దారి తీసాయి. వైసిపి అధిష్టానం నుంచి మరీ ముఖ్యంగా ప్రబుత్వ సలహాదారు సజ్జల, శ్రీధర్ రెడ్డి చాలా సన్నిహితంగా ఉంటారని  అధికార పార్టీ నేతలు చెపుతుంటారు. అయితే  శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యల వెనుక మర్మం ఏంటనేది అర్ధం కావట్లేదని నేతలు చర్చించుకుంటున్నారు. ఈ వ్యాఖ్యల వెనుక వైసిపి అధిష్టానం ఉందని కూడా తీవ్ర చర్చ జరుగుతుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read