తిరుమల తిరుపతి దేవస్థానం, కొత్త చైర్మెన్ గా నియమించబడ్డ, జగన్ బంధువు, వైవీ సుబ్బారెడ్డి తీసుకున్న నిర్ణయం వివాదాస్పదం అయ్యింది. తిరుమలలో ఉండాల్సిన చైర్మెన్ క్యాంపు కార్యాలయం, అమరావతిలో కూడా కావాలి అంటూ, ఒక లేఖ బయట పడటంతో అందరూ ఆశ్చర్యపోయారు. టిటిడి చైర్మెన్ ఆదేశించారని, ఆయనకు వెంటనే తాడేపల్లి సమీపంలో ఒక క్యాంపు కార్యాలయం ఏర్పాటు చెయ్యాలని, టిటిడి ఈఓకు దేవాదాయ శాఖ లేఖ రాసింది. చైర్మెన్ కోసం ఒక పెద్ద గది, దానికి అటాచేడ్ బాత్రూం ఉండాలి అని ప్రత్యేకంగా ఆ ఉత్తరంలో రాసారు. అంతే కాదు, తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పని చెయ్యటానికి, ఆరుగు సిబ్బంది కూడా కావాలని ఆ లేఖలో కోరారు. అయితే ఈ నిర్ణయం వివాదాస్పదం అయ్యింది. ఇప్పటికే తిరుమలలో చైర్మెన్ కు క్యాంపు కార్యాలయం ఉంది.

yv subba reddy 18072019 2

అక్కడ 21 మంది సిబ్బంది పని చేస్తున్నారు. తిరుమలలో ఉండాల్సిన చైర్మెన్ కు, తాడేపల్లిలో క్యాంపు కార్యాలయం ఎందుకు అంటూ, పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియాలో దాదపుగా రెండు రోజుల పాటు, ఇదే వార్త వైరల్ అయ్యింది. పొదుపు పొదుపు అంటూ ఒక పక్క డప్పు కొడుతూ, మరో పక్క ఈ దుబారా ఖర్చులు ఏంటి అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తాడేపల్లిలో క్యాంపు కార్యాలయం ఏర్పాటు పై పెద్ద ఎత్తున నిరసన రావటంతో, వైవీ సుబ్బారెడ్డి వెనక్కు తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయన నిర్ణయం యు-టర్న్ తీసుకుంటూ, అబ్బే ఇదేమి లేదు అంటూ, నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాల్సిన పరిస్థితి. ఒక పక్క లేఖలో స్పష్టంగా చైర్మెన్ కు కొత్త క్యాంపు కార్యాలయం కావాలి, దాంట్లో ఆరుగు సిబ్బంది కూడా కావాలి అని ఉంది.

yv subba reddy 18072019 3

అయితే నిన్న ప్రెస్ మీట్ లో సుబ్బారెడ్డి మాత్రం, ఇదంతా చంద్రబాబు, లోకేష్ కుట్ర అని కొట్టిపారేసారు. మాట మార్చిన సుబ్బారెడ్డి, అది క్యాంపు కార్యాలయం కాదని, అక్కడ సమాచార కేంద్రం మాత్రం ఏర్పాటు చెయ్యాలని కోరామని అన్నారు. ఇలాంటి సమాచార కేంద్రాలు, హైదరాబాద్, ఢిల్లీ, బెంగుళూరు, ఢిల్లీలో కూడా ఇలాంటి సమాచార కేంద్రాలు ఉన్నాయని, అలాంటిదే మరొకటి అని చెప్పి మాట మార్చారు. మొత్తానికి సోషల్ మీడియాలో వచ్చిన విమర్శలతో టిటిడి చైర్మెన్ ఆయన నిర్ణయం పై వెనక్కు తగ్గాల్సి వచ్చింది. మరో పక్క ఇలాగే ఎల్1, ఎల్2 దర్శనాల రద్దు పై కూడా ప్రజల అందరూ మంచి నిర్ణయం అని అనుకున్నారు. కాని ఈ రోజు రద్దు చేసిన ఎల్1, ఎల్2 స్థానంలో, బిగినింగ్ బ్రేక్ దర్శనం అంటూ మరో పేరుతొ మొదలు పెట్టారు. పేరు ఏదైతే ఏమి, మా కష్టాలు మామూలే కదా అని ప్రజలు అనుకుంటున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read