తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌, జరుగుతున్న పరిణామాల పై మనస్తాపానికి గురయ్యారు. మొన్న ఒక టీవీ ఛానెల్ చర్చలో భాగంగా, వల్లభనేని వంశీ, రాజేంద్రప్రసాద్ మధ్య జరిగిన చర్చ, గొడవకు దారి తీసి, బూతులు తిట్టే స్థాయికి వెళ్ళింది. ఈ సందర్భంలో, వ్యక్తిగత ఆరోపణలుకు దిగిన వంశీ, వైవీబీ పై విరుచుకు పడ్డారు. అయితే మాలలో ఉండి, ఇలా మాట్లాడకూడదు కదా అంటే, వాళ్ళు చేసిన వ్యాఖ్యలకు ఇలాగే చెప్తాను అంటూ, వంశీ తన వ్యాఖ్యలను సమర్ధించుకున్నారు. అయితే, ఈ విషయంలో ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అనేది, ప్రజలే నిర్ణయం తీసుకుంటారు. అయితే, తనని అంత పర్సనల్ గా తిట్టినా, ఎవరూ తనకు మద్దతుగా రాలేదని, సొంత పార్టీ నేతల పై, వైవీబీ అలిగారు. పార్టీ కోసం నేను మాట్లాడితే, అతను అన్ని బూతులు తిడుతుంటే, ఎవరూ రాలేదని ఆయన ఆవేదన చెందారు. అయితే, ఆ రోజు చంద్రబాబు దీక్ష ఉండటం, నాయకులు అందరూ వంశీ, చంద్రబాబు పై విరుచుకు పడుతూ చేస్తున్న కామెంట్స్ పై ఫోకస్ పెట్టారని, అందుకే వైవీబీకి మద్దతుగా రాలేకపోయమని అంటున్నారు.

bode 16112019 2

అయితే నిన్న సాయంత్రం పెట్టిన ప్రెస్ మీట్ లో, వంశీ భాషను ఖండించామని గుర్తు చేస్తున్నారు. అయితే, వైవీబీ మనస్తాపానికి గురయ్యారని తెలుసుకున్న చంద్రబాబు, వైవీబీకి ఫోన్ చేసి, జరిగిన విషయం తెలుసుకున్నారు. వ్యక్తిగత విమర్శలు చేసి మిమ్మల్ని బాధ పెట్టిన విషయాన్ని ఖండిస్తున్నామని, పార్టీ మీకు ఎప్పుడూ అండగా ఉంటుంది అని చెప్పారు. మరో పక్క అదే నియోజకవర్గానికి చెందిన బోడె ప్రసాద్ కూడా, ఆయన్ను వెళ్లి కలిసారు. జరిగిన విషయం అడిగి తెలుసుకుని, పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. ఆ రోజు దీక్ష ఉండటం, ఉదయమే, ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశం ఉండటంతో, బిజీగా ఉన్నామని, సాయంత్రం నాయకులు పెట్టిన ప్రెస్ మీట్ లో, ఖండించామని గుర్తు చేసారు.

bode 16112019 3

ఈ విషయం పై బోడె ప్రసాద్ మాట్లాడారు. వైవీబీ రాజేంద్రప్రసాద్‌ ఇంటికి వెళ్లి మాట్లాడానని బోడె ప్రసాద్ తెలిపారు. స్నేహం వేరు, రాజకీయం వేరని, వంశీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు. వ్యక్తిగత దూషణలు ఎవరి పై చేసినా మంచిది కాదని బోడె ప్రసాద్ హితవుపలికారు. రాజేంద్రప్రసాద్ కు తాము ఏమి డబ్బు ఇవ్వలేదని, వంశీ ఇలాంటి ప్రచారాలు కావలనే చేస్తున్నారని అన్నారు. మరో పక్క, వంశీ చేసిన వ్యక్తిగత ఆరోపణల పై, వైవీబీ న్యాయ పోరాటానికి కూడా సిద్ధం అవుతునట్టు తెలుస్తుంది. ఇలా వదిలేస్తే, అందరి మీదకు ఇలాగే వెళ్తాడని, పార్టీ కనుక న్యాయ సహాయం అందిస్తే, దీని పై తాను ముందుకు తీసుకు వెళ్లి పోరాడతానని, చెప్పినట్టు తెలుస్తుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read