పోలవరం నిర్మాణంలో పరావరణ అనుమతుల పై, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీవ్రంగా స్పందించింది. పర్యావరణ నిబంధనల అమలు పరిరక్షణ కోసం, రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో, ఒక నిపుణుల కమిటీని కూడా ఏర్పాటు చేస్తాం అంటూ, ఈ రోజు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. ఈ నిపుణుల కమిటీలో ఐఐటి అలాగే ఐఐఎస్ఆర్ కు సంబందించిన నిపుణులు కూడా ఈ కమిటీలో ఉంటారని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ రోజు పేర్కొంది. పర్యావరణ నిబంధనల అమలు పర్యవేక్షణ కోసం, రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ఈ కమిటిని ఏర్పాటు చేయబోతున్నారు. ఏపి హైకోర్టు చీఫ్ జస్టిస్ తో చర్చించి, రిటైర్డ్ జస్టిస్ పేరు ఖరారు చేస్తామని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చైర్మెన్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం, ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ కమిటీలో ఢిల్లీ, హైదరాబాద్, ఐఐటి నిపుణులు, ఆడే విధంగా సాయిల్ నిపుణులు కూడా ఉండబోతున్నారు. ముందుగానే పర్యావరణ ప్రభావం పై, అంచనా వేయాలి కానీ, సమస్య వచ్చిన తరువాత, ఈ యొక్క చర్యలు తీసుకోవటం కాదు, కాబట్టి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు. లేకపోతే ఇప్పుడు ఉత్తరాఖండ్‍లో జరిగిన ప్రళయం ఏర్పడిందో, ఇక్కడ పోలవరంలో కూడా అలాగే ప్రమాదమే జరిగే అవకాసం ఉందని పేర్కొంది.

భూమి కోల్పోయిన వారికీ సరైన నష్ట పరిహారం ఇవ్వాలి అంటూ, పెంటపాటి పుల్లారావు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ని ఆశ్రయించారు. ఆ మేరకు, ఈ పిటీషన్ పై ఈ రోజు గ్రీన్ ట్రిబ్యునల్ లో విచారణ చేసి, ఈ ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే ఇది ఒక కీలక పరిణామం అనే చెప్పాలి. ఒక నిపుణులు కమిటీ ఏర్పాటు చేయటమే కాక, పర్యావరణ అనుమతులకు తగ్గట్టు పనులు జరగటం లేదని ఆక్షేపించటం, గమనించాల్సిన పరిణామం. పర్యావరణ ప్రణాళికలను లోపభూయిష్టంగా రూపొందించారని తీవ్ర వ్యాఖ్యలు చేయటం మరో అంశం. వస్తున్న సమస్యలు పదే పదే ఉత్పన్నం అవ్వటానికి, ఇదే కారణం అని గ్రీన్ ట్రిబ్యునల్ అభిప్రాయ పడింది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఉత్తరాఖండ్‍లో జరిగిన ప్రళయం, ఇక్కడ కూడా జరిగే ప్రమాదం ఉంది అంటూ హెచ్చరించింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read