ఆధార్ కార్డు ఇప్పుడు అన్నిటికి అదే మూలం... అడ్రస్ ప్రూఫ్ దగ్గర నుంచి, అన్ని అవసరాలకు, ఇప్పుడు ఇది అవసరం... డిజిటల్ పేమెంట్స్ కు కూడా, ఇప్పుడు ఆధార్ అనుసంధానంతో చేసే వెసులుబాటు ఉంది. ఈ తరుణంలో, ఆధార్ కార్డు లో ఏ విధమైన తప్పులు ఉన్నా, ఇది చెల్లదు... మొన్నటి వరకు, ఆధార్ లో ఉన్న తప్పులు సరి చేసుకోవాలి అంటే, MRO ఆఫీస్ చుట్టూ, తిరగాల్సి వచ్చేది... అలాగే అక్కడ లంచం కూడా, తప్పదు..

కాని, ఇక ఆధార్ లో మార్పు చేసుకోవాలని ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఆన్ లైన్ లో అప్ డేట్ వెర్షన్ తీసుకొచ్చింది ప్రభుత్వం. www.uidai.gov.in అనే వెబ్ సైట్ లో ఆధార్ అప్ డేట్ ఆప్షన్ ఇచ్చింది. అప్ డేట్ లో క్లిక్ చేసి మీ వివరాలను మార్చుకోవచ్చు.

ఒక్క ఫొటో మినహా మిగతా అన్నీంటినీ మార్చుకోవటానికి వెసలుబాటు కల్పించారు. అడ్రస్, మొబైల్ నంబర్లు, ఆధార్ లోని మిస్టేక్స్ ను మార్పులు చేసుకోవచ్చు. ఇప్పటికే కొన్ని సవరణలను అందుబాటులోకి వచ్చినా.. ఆఫీస్ కు వెళ్లకుండా పూర్తిస్థాయిలో ఆన్ లైన్ ద్వారానే మార్పులను అమల్లోకి తెచ్చారు. దీంతో, ప్రజలకి, చాలా సమయం కలిసి వచ్చి, పనులు కూడా ఇబ్బంది లేకుండా, వెంటనే జరుగుతాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read