సమర్ధవంతమైన ముఖ్యమంత్రికి, సమర్ధవంతమైన అధికారి తోడైతే ? టెక్నాలజీతో పరిపాలన సాగించి, ప్రజలకు మరిన్ని సేవలు అందిచాలన్న ముఖ్యమంత్రి ఆశయానికి, ప్రభుత్వ ఉద్యోగులు తోడైతే ? ఆ రిజల్ట్ ఎలా ఉంటుంది ? మనల్ని పాలించే నాయకులు, అధికారులు, మనకోసమే వినూత్న ఆలోచనలతో, మన ముందుకు వస్తుంటే, అంతకంటే మనకు ఏమి కావలి... ఇలాంటి నాయకులు అరుదుగా ఉంటారు, ఇలాంటి అధికారులు, ఇంకా అరుదుగా దొరుకుతారు....

నవ్యాంధ్రకు అలాంటి ఒక సమర్ధవంతమైన అధికారే నండూరి సాంబశివరావు... ఆంధ్రప్రదేశ్‌ రోడ్డు రవాణా సంస్థ (APS RTC) మేనేజింగ్‌ డైరెక్టర్‌గా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డీజీపీగా, తనదైన ముద్ర వేస్తూ, ప్రజలకు మరింత దగ్గరవతున్నారు.

1984 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి సాంబశివరావు. ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన సాంబశివరావు ఆంధ్రా యూనివర్సిటీలో (1974-79) ఇంజనీరింగ్‌ పూర్తి చేశారు. ఆ తర్వాత ఆయన (1979-81 )ఐఐటీ కాన్పూర్‌లో మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో ఎంటెక్‌ పూర్తిచేశారు. 1984లో ఐపీఎ్‌సకు ఎంపికయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో పోలీసు శాఖలో పలు కీలక పదవులు చేపట్టారు. విశాఖ పోలీసు కమిషనర్‌గా పనిచేశారు. ఆ సమయంలోనే అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. అలాగే, రాష్ట్రం ఏర్పడిన తర్వాత, అగ్నిమాపక శాఖలో అదనపు డీజీగా, పోలీసు అకాడమీ డైరెక్టర్‌గా, ఆంధ్రప్రదేశ్‌ రోడ్డు రవాణా సంస్థ (APS RTC) మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. సమర్థత, సీనియారిటీ ఆధారంగా, చంద్రబాబు, డీజీపీగా సాంబశివరావు వైపు మొగ్గు చూపారు.

ఆంధ్రప్రదేశ్‌ రోడ్డు రవాణా సంస్థ (APS RTC) మేనేజింగ్‌ డైరెక్టర్‌గా...
రాజధాని నేపథ్యంలో విజయవాడ పండిట్‌ నెహ్రూ బస్‌ స్టేషన్‌ను పెరుగుతున్న అవసరాలకనుగుణంగా అన్ని రకాల ఆధునిక హంగులు, టెక్నాలజీతో అన్ని సదుపాయాలు ఒకే చోట లభించే విధంగా 'డిస్ట్‌నేషన్‌' కేంద్రంగా తయారు చేశారు సాంబశివరావు. వేలాది మంది ఉద్యోగులు, వందల కోట్ల రూపాయల బడ్జెట్‌, నిత్యం ప్రజల మధ్య అనుబంధం కలిగి ఉండే ఆర్టీసీ సంస్థ సేవలే ప్రభుత్వ పనితీరుకు గీటురాయిగా నిలుస్తాయనడంలో సందేహం లేదు. ఏడాదిన్నర పాటు సాంబశివరావు ఆర్టీసీలో మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పని చేస్తూ అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. బస్టాండ్ల అభివృద్ధి, కొత్త కొత్త బస్సు సర్వీసులు, అంతర్గతంగా పలు మార్పులు చేర్పులు చేయసాగారు. అప్పటివరకు మొండిగోడలతో కళావిహీనంగా ఉన్న విజయవాడ పండిట్‌ నెహ్రూ బస్టాండుకు పూర్తిగా కొత్త కళ తెచ్చారు. ఇంటీరియర్‌తో పాటు, అద్బుతమైన వాల్‌ ఇంటీరియర్‌, మోడల్‌ ప్రయాణీకుల లాంజ్‌లు, ప్లాస్మా టీవీలు, ఆటోమేటిక్‌ అనౌన్స్‌మెంట్‌, వెబ్‌ బేస్డ్‌ బస్‌పాస్‌ల కౌంటర్‌, కాన్ఫరెన్స్‌ హాల్‌ , భారీ ఎల్‌ఈడీ టీవీ తెరలు, విశ్రాంతి మందిరాలు, సినీ థియేటర్లతో కార్పొరేట్‌ హంగులు కల్పించడంలో సక్సెస్ అయ్యారు.

ఆర్టీసీలో కొరియర్‌ సేవలతో, ఒక విప్లవాత్మకమైన, సర్వీస్ కు నాంది పలికారు. ప్రయాణికులు తమ కొరియర్‌ను దెగ్గరలోని ఆర్టీసీ బస్ స్టాండ్ కి వెళ్లి ఇస్తే చాలు, అక్కడ నుండి ఆర్టీసీ, రాష్ట్రంలో ఏ మూలకైనా మీ కొరియర్ డెలివర్ చేస్తుంది.

విజయవాడ బస్టాండ్ మాత్రమే కాదు, బస్టాండ్ బయట ఉన్న సిటీ టెర్మినల్‌ కూడా అభివృద్ది చేసారు.

అంతే కాదు, రాష్ట్ర విభజన అనంతరం, హైదరాబాద్ కేంద్రంగా, అన్ని శాఖలు పని చేస్తున్న రోజుల్లో, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా, అమరావతి (విజయవాడ), వచ్చిన మొదటి శాఖ సాంబశివరావు గారి ఆధ్వర్యంలోని APS RTC. మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండి) క్యాంపు కార్యాలయం, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్స్‌ (ఇడిలు), ఛాంబర్లు, ఇతర ఉన్నతాధికారులతో కూడిన కార్యాలయం మొత్తాన్ని బస్‌హౌస్‌ పేరుతో శాశ్వత ప్రాతిపదికన అత్యాధునిక వసతులతో విజయవాడ బస్‌స్టేషన్‌లోనే ఏర్పాటు చేసారు.

APS RTC మేనేజింగ్‌ డైరెక్టర్‌గా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ ఛార్జ్ డీజీపీగా, రెండు బాధ్యతలతో కృష్ణా పుష్కరాలు....
సాంబశివరావు గారి, సమర్ధత ఏంటో చెప్పటానికి, కృష్ణా పుష్కరాలు ఒక ఉదాహరణ.. APS RTC మేనేజింగ్‌ డైరెక్టర్‌గా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ ఛార్జ్ డీజీపీగా, రెండు బాధ్యతలతో కృష్ణా పుష్కరాలు సమర్ధవంతంగా ఏ లోపం లేకుండా చేసారు. నిజానికి పోలీస్ బాస్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత కృష్ణ పుష్కరాల విధులను సమర్థివంతంగా నిర్వహించిన నండూరి… అదే సమయంలో పుష్కరాల్లో కీలకమైన ఆర్టీసీ సేవలు కూడా అదుర్స్ అనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆర్టీసీపై సంపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తిగా ప్రగతి చక్రాన్ని తనదైన స్టయిల్లో పరుగులుపెట్టించిన సాంబశివరావు… డీజీపీగానూ తన సామర్థ్యాన్ని చాటుకున్నారు.

కృష్ణా పుష్కరాల సందర్భంగా జరిగిన ఒక సంఘటన, సాంబశివరావు గారి మానవతా కోణం ఏంటో చెప్తుంది...
రోడ్డు ప్రమాదంలో చావుబతుకుల మధ్య ఉంటే మీరేం చేస్తారు? మహా అయితే 108కి ఫోన్ చేసి వెళ్లిపోతారు. కానీ, ఒక ఐపీఎస్ స్థాయి అధికారి అలా చేయలేదు. రోడ్డు మీద గాయాలతో పడి ఉన్న యువకుడ్ని భుజానెత్తుకున్నాడు. తన కారులో కూర్చోబెట్టుకుని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. తక్షణం చికిత్స చేయించాడు. ఇదేదో…సినిమా స్టోరీలా ఉందా..? కానేకాదు.. కృష్ణా పుష్కరాల సందర్భంగా జరిగిన వాస్తవం. మానవత్వంతో స్పందించిన ఐపీఎస్ ఎవరో కాదు ఏపీ డీజీపీ నండూరి సాంబశివరావు. పుష్కరాల సందర్భంగా రాత్రి శాంతిభద్రతలను పర్యవేక్షించి విజయవాడ బందర్ రోడ్డు మీదుగా వెళుతున్నారు. అదే రోడ్డులో యువకుడ్ని ఒక కారు ఢీ కొట్టి వెళ్లిపోయింది. గాయాలతో యువకుడి రోడ్డు మీద పడి కొట్టుమిట్టాడుతున్నాడు. అటుగా వెళుతోన్న సాంబశివరావు గాయపడిన యువకుడ్ని చూశాడు. వెంటనే కాన్వాయ్ ను ఆపించాడు. యువకుడ్ని తన కారులో కూర్చొబెట్టుకున్నారు. ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించడంతో యువకుడి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీగా..
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు పోలీస్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలనే ఆలోచనలో ఉన్న డీజీపీ సాంబశివరావు తొలుత పోలీస్ స్టేషన్లపైనే దృష్టి సారించారు. పరిసరాలు, పరిశుభ్రత, టెక్నాలజీ అంశాలపై దృష్టి పెట్టారు. దీనిలో భాగంగా ఇప్పటివరకు ఇరుకు గదులతో ఉన్న పాత పోలీస్ స్టేషన్ల స్థానల్లో కొత్త స్టేషన్ల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించారు. దీనిలో భాగంగా గుంటూరు నగర కేంద్రంలో రెండు మోడల్ పీఎస్‌లకు డీజీపీ శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా వంద మోడల్ పోలీస్ స్టేషన్లకు ప్రణాళిక రూపొందించారు.

వీటి నిర్మాణ విషయంలో డీజీపీ నండూరి సాంబశివరావు చూపిన శ్రద్ధ ప్రశంసనీయం. పోలీస్‌స్టేషన్ల నిర్మాణం జరిగిన నాలుగు నెలల వ్యవధిలో డీజీపీ సుమారు 50 సార్లు వచ్చారంటే ఈ పోలీస్‌స్టేషన్లను ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అర్ధం చేసుకోవచ్చు. ఇక్కడ నిర్మించిన పోలీస్‌స్టేషన్ల ఆధారంగానే రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది చివరికి సుమారు 200 పోలీస్‌స్టేషన్లను నిర్మించాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో డీజీపీ వీటి నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించారు. నిన్న(సోమవారం) ఈ స్టేషన్లను సీఎం చంద్రబాబు ప్రారంభించారు.

శేషాచల అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్‌, ఉత్తరాంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో నక్సలైట్ల బెడద, రాష్ట్రంలో, కొత్త రాజధానిలో శాంతి భద్రతలకు ఎలాంటి భంగం కలుగకుండా చూడటంలో ఆయన విజయం సాధిస్తున్నారు...

Proud of you Andhra DGP Sir...

Advertisements

Advertisements

Latest Articles

Most Read