కృష్ణా గోదావరి సంగమ తరంగాల నడుమ, సర్వ వాద్య స్వర తరంగాలు అమరావతి వాసులను అలరించాయి. జాతీయ, అంతర్జాతీయ కళాకారుల లయ విన్యాసాలు, పవిత్ర సంగమంలో ప్రేక్షకులను మెప్పించాయి.

ముందుగా డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు పంచరాగ, పంచనంద ప్రక్రియలో మృదంగ విన్యాసాన్ని పవిత్ర సంగమం వేదికపై ఎల్లా వెంకటేశ్వరరావు శృతిపర్వంగా అందించారు. పెద్ద ఎత్తున పవిత్ర సంగమం వద్ద చేరుకున్న ప్రజలు ఎల్లా మృదంగ విన్యాసానికి జేజేలు పలికారు. భారతీయ పురాతన లయ వాయిద్యాలలో ఒకటైన మృదంగ వాయిద్యంలో అత్యంత ప్రఖ్యాతిగాంచిన ఎల్లా వెంకటేశ్వరరావు కీర్తిపొందారు. శాస్త్రీయ సంగీత కళాకారులుగా. 36 గంటల పాటు నిర్విరామంగా మృదంగ వాద్య ప్రదర్శన చేసి గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్పులో స్థానాన్ని పొందిన ఘనత వహించారు.

తీన్ తాల్ రిథమ్ లో తబలా విన్యాసంలో అనిందో చటర్జీ అందించిన లయ విన్యాసం పవిత్ర సంగమం వేదిక వద్ద ఆహుతులను అలరించింది. ఆ తర్వాత అంతర్జాతీయ సంగీత నృత్యోత్సవ వేదికపైనా తన ప్రదర్శన కొనసాగించారు. ప్రకృతి పరవళ్లను తన మృదంగం ద్వారా లయబద్ధం చేశారు. వర్షం ఏ విధంగా ఒక్క పెట్టున వస్తుందన్నది ఆ తర్వాత ఎలా మామూలు వాతావరణం ఉంటుందన్నది తన వాయిద్యం ద్వారా ఆలపించారు. రోడ్డుపై కార్లు ఎలా వెళ్లాయి. ట్రాఫిక్ జామ్ ఎలా ఉంటుందన్న నేపధ్యాన్ని వివరించారు. దేవునికి పూజ ఏవిధంగా చేస్తామన్నది కూడా తబల ద్వారా స్వరబద్ధం చేశారు. పండిట్ అనిందో చటర్జీ తబలా విన్యాసంలో జాతీయంగా, అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు. అనింది చటర్జీ పారోఖూబాద్ ఘరానాకు చెందిన ప్రఖ్యాత తబలా విద్వాంసులు. తబలా వాయిద్యంలో చేరగని ముద్ర వేశారు.

గణపతి తాళంలో విఘ్నశ్వరుడు ఎలాంటి ఆహర్యాన్ని ప్రదర్శిస్తారన్నదాని పై వికు వినాయక్ రామ్, స్వామినాథన్ లయబద్ధంగా ఘటం పై స్వరపరిచారు. గణేష్ ఎలా నడచివస్తాడు. ఎలా మహిమలు ప్రదర్శిస్తాడన్నది దృశ్యరూపం చేశారు. సుందర గణపతి. జైజై గణపతి.సురసుర గణపతి దివ్య నమస్తే అంటూ స్వామినాథన్ ఆలపించారు. 74 ఏళ్ల వయసులోనూ 24 ఏళ్ల యువకునిలా వికు వినాయక్ రామ్ ఘటంపై చేసిన వాయిద్య విన్యాసం శ్రోతలను ఆకట్టుకుంది. ఆడియన్స్ అందరితోనూ చప్పళ్లతో ఘటానికి సమాంతరంగా చేసిన విన్యాసానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. హాజరైనవారందరూ చప్పళ్లతో వికూ ఘట వాయిద్యాన్ని ఫాలో అయ్యారు. ఆ తర్వాత స్వామినాథన్ ట్రెయిన్ ఎలా వెళ్తుందన్నదానిని రిథమ్ చేసి చూపించారు. ట్రెయిన్ ఎలా పికప్ నుంచి స్పీడ్ గా ఎలా వెళ్తుంది. బ్రిడ్డి మీద ఎలా వెళ్తుందీ. వివరించారు. భార్యభార్తల మధ్య గొడవ ఎలా ఉంటుందన్నదాని పై రెండు సౌండ్లతో స్వామినాథన్ రిథమ్ చేశారు. ఎలా మొదలై. ఎలా పతాకస్థాయికి చేరుతుందని. చివరికి భార్య గెలుస్తుందని తెలిపారు. పుట్టినరోజు పాటను సైతం రిథమ్ చేశారు. దూరం నుంచి హలికాప్టర్ దగ్గరకు వచ్చే సరికి ఎలా సౌండ్ వస్తుంద్నది చేసి చూపించారు. తాత, మనమడు చివరగా గురువందనం చేసి కర్ణాటక సంగీతం మధురానుభూతిని ప్రేకకులకు విన్పించారు.

ముగ్గురు విదేశీ కళాకారులతో కలిసి త్రిలోక్ గుర్తు ప్రదర్శనచేశారు. కీబోర్డ్, గీటార్, ట్రంపెట్ తోపాటు, డ్రమ్స్ పై త్రిలోక్ గుర్తు చేసిన ఫీట్లకు ప్రేకకుల తన్మయత్వం చెందారు. జాజ్ సంగీతానికి, తబలా విన్యాసాన్ని జోడించి త్రిలోక్ గుర్తు చేసిన ప్రదర్శన ఆకట్టుకొంది. పంచధాతువులైన ఆకాశం, గాలి, నీరు, నేల, నిప్పు చేసే సౌండ్లను త్రిలోక్ గుర్తు విన్పించిన తీరు ప్రేక్షకులను నయనానందభరితులను చేసింది. వాట్ టు డూ అంటూనే. పాప్ కార్న్ బీట్ అందించారు. త్రిలోక్ గుర్తు ప్రపంచంలో తమకంటూ, ప్రత్యేకమైన మరియు వినూత్నమైన స్థానాన్ని పొందిన డ్రమ్స్ కళాకారులు. త్రిలోక్ గుర్తు జాజ్, జాజ్ ఫ్యూజన్, వరల్డ్ మ్యూజిక్ లో డ్రమ్స్, తబలాలను ఉపయోగించి అద్భుతాలు సృష్టిస్తారు. ప్రపంచ ప్రసిద్ద చెందిన జాన్ మెక్ లాగ్లిన్, ఎంట్రో, ఓర్లియన్ తోపాటు పలువురు కళాకారులతో కలిసి అంతర్జాతీయ ప్రదర్శనలు అందించారు.

శివమణి - త్రిలోక్ గుర్తు లయ విన్యాసం
త్రిలోక్ గుర్తు శివమణికి స్వాగతం పలకడంతో ఒక్కసారిగా స్టేజ్ కొత్త సౌండ్లతో మార్మోగింది. అప్పటి వరకు ఉన్న ధ్వని ఒక్కసారిగా రెట్టింపయ్యిందా అన్పించింది. డ్రమ్ స్టిక్స్ ను చేతుల్లోంచి వదులుతూ పట్టుకుంటూ శివమణి తన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. శివమణి డ్రమ్స్ విన్యాసానికి త్రిలోక్ గుర్తు తకిటధమ్ తకిటధమ్ ప్రేక్షకులను అలరించింది. వేదికపైకి వచ్చిన శివమణి అందరికీ నమస్కారమంటూ తెలుగులో పలకరించారు. గురుబ్రహ్మ..గురు విష్ణు. గురు మహేశ్వరతో డ్రమ్స్ ను రిథమ్ ప్రకారం వాయించాడు. శివమణి డ్రమ్స్ తో ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. గుండెలు జలదరించేలా డ్రమ్స్ ధ్వని ప్రతిధ్వనించింది.

అంతర్జాతీయ సంగీత నృత్యోత్స వేదికను శివమణి ఉర్రూతలూగించాడు. ఆడిటోరియంలోకి ప్రవేశించిన దగ్గర్నుంచి ప్రదర్శన చివర వరకు ప్రేక్షకులను కట్టిపడేశాడు. లయబద్ధంగా సాగిన డ్రమ్స్ వాయిద్యానికి ప్రేకకుల నుంచి అదృత స్పందన లభించింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read