ఆంధ్రా పోలీస్ సంస్కరణల బాట పడుతుంది... విజిబుల్‌ పోలీసింగ్‌ అండ్‌ అన్‌విజిబుల్‌ పోలీస్‌ అనే నినాదంతో పోలీసు శాఖ ముందుకు వెళ్తుంది... ఇందులో భాగంగా ముందుగా, ఈ సంస్కరణలు అన్నీ, గుంటూరులోని ఆదర్శ స్టేషన్లలో ప్రయోగాత్మకంగా, ప్రవేశపెట్టారు.. లోటు పాట్లు, సరి చేసుకుని, రాష్ట్రం అంతటా, ఇదే విధంగా, పోలీస్ శాఖను ప్రక్షాళణ చేస్తారు.

ఇందులో ముఖ్యంగా చెప్పుకునేది, పోలీస్ డ్రెస్‌కోడ్‌...ఖాకీ కనిపించకుండా పోలీసింగ్‌ చెయ్యటం... ఎప్పుడూ వాడే ఖాకీ దుస్తులు ఇక్కడ వాడరు. లేత నీలంరంగు చొక్కా, ముదురు నీలంరంగు ఫ్యాంటు ఈ పోలీసుల యునిఫార్మ్. కానిస్టేబుల్‌ నుంచి ఎస్‌ఐ వరకు, ఈ డ్రెస్ లోనే ఉంటారు. బయటకు వెళ్ళేప్పుడు మాత్రం, ఖాకీ దుస్తులు ధరిస్తారు.

అలాగే, ‘ఐయామ్‌ ఏ కాప్‌’ అన్న రేడియం ప్లేట్‌ పోలీస్ షర్టు పై ఉంటుంది. దీంతో పాటు, కార్పొరేట్‌ ఉద్యోగులను తలపించేలా ట్యాగ్‌తో కూడిన ఐడీ కార్డు మెడలోవేలాడుతోంది.

అలాగే, ఈ డ్రెస్ కోడ్ ఉన్న పోలీసులు, బాడీ వొర్న్ కెమెరాలు ధరిస్తారు... నేరాలు అదుపు చెయ్యటంలోనే కాదు, ఈ కెమేరాతో, పోలీసుల పని తీరు కూడా మారుతుంది. ప్రజలతో దురుసుగా మాట్లాడితే, ఈ కెమెరాలో రికార్డు అయిన మొత్తం విని, ఉన్నతాధికారులు, ఆ పోలీస్ మీద ఆక్షన్ తీసుకుంటారు. సాంకేతికత సాయంతో సిబ్బంది ప్రవర్తన మారేలా.. జవాబుదారితనం పెంచేలా.. దేశంలోనే తొలిసారిగా ఈ ప్రయోగం చెయ్యనున్నారు.

32 మెగా పిక్సల్‌ క్వాలిటీతో, 64 జీబీ సామర్థ్యం ఈ కెమెరాలో ఉంటుంది. విధుల్లో ఉన్న సిబ్బంది కెమెరాలను ధరించి వాటిని ఆన్‌చేసి ఉంచాలనే నిభందన పెట్టారు. ఆఫ్ చేస్తే, ఎందుకు ఆఫ్ చేసారో, సమాధనం చెప్పాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read