నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో వీలైనంత త్వరగా సొంత ఇంటిని నిర్మించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఇంటి నిర్మాణానికి సంబంధించి స్థలం కొనుగోలు పై ఆయన ప్రత్యేక దృష్టిసారించారు. కృష్ణా నది అభిముఖంగా ఇంటికి అవసరమైన స్థలాన్ని కోనుగోలు చేయాలా ? లేక ఇంకా వేరే ప్రాంతంలో ఇంటిని నిర్మిస్తే బాగుంటుందో సంప్రదింపులు చేస్తున్నారు. ఈ విషయం పై, చంద్రబాబు తనయుడు లోకేష్ వాస్తు పండితులను కోరినట్టు సమాచారం.

అమరావతిలో నిర్మించే రాజధానికి సునాయాసంగా చేరుకునే విధంగా, ఇక్కడికి సమీపంలో స్థలాన్ని కొనుగోలు చేయాలని చంద్రబాబు భావిస్తున్నట్టు సమాచారం. అధికార నివాసంతో పాటు తాను, తన కుటుంబ సభ్యులు ఉండేదుకు వీలుగా చిన్నపాటి ఇల్లును నిర్మించుకోవాలన్నది చంద్రబాబు కోరిక అని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

విజయవాడ నుంచి పాలనను ప్రారంభించిన చంద్రబాబు కరకట్ట రోడ్డులో ఓ ప్రైవేటు నీవాసంలో బస చేసిన సంగతి తెలిసిందే. కృష్ణా నది ఒడ్డున ఉన్న ఈ నివాసం చంద్రబాబు ఉండేందుకు అనువగా లేకపోయినప్పటికీ, విజయవాడలో ఉన్న భవనాల్లో ఇదే కాస్త్ర విశాలంగా ఉందన్న భావనతో ఆయన ఆ ఇంట్లో ఉంటున్నారు. ఇప్పుడు కొత్త ఇల్లు కూడా, దాదుపుగా, అమరావతి రాజధాని గ్రామాల్లోనే నిర్మించే అవకాశం ఉంది. విజయవాడ, గుంటూరు కంటే, రాజధాని ప్రాంతం అయితేనే, వెలగపూడి సచివాలయం, అసెంబ్లీ, అలాగే అమరావతి ప్రాంతంలో జరుగుతున్న నిర్మాణాల ప్రదేశాలను చేరుకోవటానికి, తేలికగా ఉంటుంది అని చంద్రబాబు భావిస్తున్నారు.

హైదరాబాద్లో పాత ఇంటిని నేలమట్టం చేసి ఆ స్థానంలో కొత్త ఇంటిని ఏర్పాటు చేసుకున్నచంద్రబాబు, వచ్చే ఏడాదిలోగా అమరావతిలోని ఓ ఇంటి వాడు కావాలని సంకల్పించారు. ఈ నెల చివరిలోపు స్థలం కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసి ఇంటి నిర్మాణం పై ఒక నిర్ణయానికి రావాలని చంద్రబాబు నిర్ణయించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read