సివిల్‌ సర్వీసెస్‌కు సిద్ధమయ్యే విద్యార్థులకు ఆంధప్రదేశ్ ప్రభుత్వం ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విశ్రాంత ఐఏఎస్‌ అధికారి రేచల్‌ చటర్జీ నేతృత్వంలో సివిల్స్‌ అభ్యర్థులకు శిక్షణ ఇస్తున్నారు. సీనియర్‌ ఐఏఎస్గా, ముక్కుసూటిగా వ్యవహరించే అధికారిగా పేరొందిన ఆమె.. ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. టాపర్స్‌ అకాడమీలో ప్రముఖ విశ్రాంత ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఆర్‌టీఎస్‌ అధికారుల ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. సివిల్స్‌లో విజయం సాధించడానికి పరీక్ష విధానానికి అనుగుణంగా అభ్యర్థులకు అవసరమైన శిక్షణ అందించి... వారి ప్రతిభను వెలుగులోకి తెస్తారు. ఎన్టీఆర్‌ విద్యోన్నతి పథకం కింద ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సివిల్స్‌ అభ్యర్థులకు ఉచిత శిక్షణతోపాటు స్టైఫండ్‌ అందజేస్తోంది.

ఎన్‌టీఆర్ విద్యోన్నతి పథకం కింద సివిల్స్ పరీక్షకు ఉచిత శిక్షణనిచ్చే కార్యక్రమ నోటిఫికేషన్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది.
ఈ పథకం కింద ఉచిత కోచింగ్‌తో పాటు, నెలవారీ స్టైఫండ్ అందిస్తారు. దరఖాస్తు చేసుకోవడానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, బ్రాహ్మణ, మైనారిటీ, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల అభ్యర్థులు అర్హులు. ప్రవేశ పరీక్ష ద్వారా మొత్తం 3850 మందిని ఎంపిక చేసి దేశవ్యాప్తంగా నిర్దేశించిన 15 కోచింగ్ సెంటర్లలో 9 నెలల పాటుశిక్షణ ఇస్తారు.

సీట్ల సంఖ్య
ఎస్సీ – 700
ఎస్టీ – 300
బీసీ – 1000
కాపు – 750
మైనారీటీ – 300
బ్రాహ్మణ – 50
ఈబీసీ – 750
మొత్తం – 3850

వయోపరిమితి: ఆగస్టు 1, 2018 నాటికి 21 సంవత్సరాలు నిండి ఉండాలి.కాపు, బ్రాహ్మణ, మైనారిటీ అభ్యర్థుల వయస్సు 32, బీసీలకు 35, ఎస్సీ, ఎస్టీలకు 37, VH/HH/OH అభ్యర్థులకు 42 సంవత్సరాల లోపు ఉండాలి.
విద్యార్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. (కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయానికి డిగ్రీ పాస్ సర్టిఫికేట్ పొందాలి)
ఆదాయ పరిమితి: కుటుంబ సంవత్సర ఆదాయం రూ. 6 లక్షలు మించరాదు.
గమనిక: రెండోసారి ఉచిత శిక్షణకు అవకాశం లేదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.
ఎంపిక విధానం: ప్రవేశపరీక్ష ద్వారా
పవేశ పరీక్ష ఫీజు: ఉచితం
పరీక్ష కేంద్రాలు: అన్ని జిల్లా కేంద్రాలు
సిలబస్: సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష సిలబస్ ప్రకారం ప్రవేశ పరీక్ష ఉంటుంది.
స్టైఫండ్: ప్రతి నెల అభ్యర్థికి స్టైఫండ్ ఇస్తారు.

నిర్దేశించిన కోచింగ్ సంస్థలు
Alternative Learning Systems, Delhi
Sri Ram IAS, Delhi
Analog IAS, Hyderabad, Guntur, Bangalore
Braintree, Hyderabad
Dr.Lakshmaiah IAS Study Circle, Hyderabad
Krishna Pradeep 21st Century, Hyderabad & Visakhapatnam
LA Excellence, Hyderabad
RC Reddy IAS Study Circle Hyderabad
Toppers IAS Academy, Hyderabad
Varsity Management, Hyderabad
Shankar IAS Academy, Chennai
Universal Coaching Center, Bangalore

ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: మే 25, 2017
దరఖాస్తుకు చివరి తేది: జూన్ 14, 2017
హాల్ టికెట్ డౌన్‌లోడ్: జూన్ 15-19 వరకు
పరీక్ష తేది: జూన్ 20, 2017

పూర్తి వివరాలకు..
http://www.kapucorp.ap.gov.in/documents/Detailed%20Notification.docx

Advertisements

Advertisements

Latest Articles

Most Read