తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ అని పేరే కాని, ఇప్పటి వరకు ఒక్క ఇంటర్నేషనల్ సర్వీస్ కూడా ఇక్కడ నుంచి లేదు. అయితే, త్వరలోనే ఈ కల తీరనుంది. తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి, విదేశీ సర్వీసులు నడవనున్నాయి. మొదటగా ఏప్రిల్ నెల నుంచి, గల్ఫ్‌ దేశాలకు విమాన సర్వీసులు నడవనున్నాయి. రేణిగుంట ఎయిర్‌పోర్టు నుంచి గల్ఫ్‌ దేశాలైన కువైట్‌, ఖత్తర్‌, దుబాయి, అబుదాబి తదితర దేశాలకు ఈ సర్వీసులను నడపనున్నారు. ప్రస్తుతం, తిరుపతి విమానాశ్రయానికి 7 విమానాలు నడుస్తున్నాయి.

గల్ఫ్‌ దేశాలకు నడపటానికి కారణం, కడప, చిత్తూరు, నెల్లూరు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి గల్ఫ్‌ దేశాలకు, ఉపాధి కోసం వేలాదిగా వెళ్తూ ఉంటారు. వీళ్ళు చెన్నై ఎయిర్‌పోర్టు ను ఆశ్రయిస్తూ ఉంటారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంత ప్రజల సౌలభ్యం దృష్ట్యా ప్రవాస భారతీయుల కోసం గల్ఫ్‌ దేశాలకు నుంచి సర్వీసులు నడపడానికి నిర్ణయించారు. అలాగే, తిరుమల శ్రీ వారి దర్శనం కోసం, వచ్చే భక్తులకి కూడా, ఈ సర్వీస్ ఉపయోగపడుతుంది. అలాగే, త్వరలోనే, మరిన్ని దేశాలకు, విమానాలు నడుపుతామని, పౌర విమానయాన మంత్రి అశోకగజపతి రాజు వెల్లడించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read