ఆంధ్రప్రదేశ్ ఆటోమొబైల్ రంగంలో, మొదటి అడుగు పడింది, జపాన్‌కు చెందిన దిగ్గజ వాహన తయారీ సంస్థ ఇసుజు మోటార్స్ తో.. తరువాత కియా మోటార్స్, హీరో మోటార్స్, అపోలో టైర్స్ ఇలా దిగ్గజ కంపెనీలు, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టటానికి, ముందుకు వచ్చాయి...

జపాన్‌కు చెందిన దిగ్గజ వాహన తయారీ సంస్థ ఇసుజు మోటార్స్ చిత్తూరు జిల్లాలోని శ్రీ సిటీలో 107 ఎకరాల విస్తీర్ణంలో రూ.3వేల కోట్లతో ఏర్పాటు చేసిన ఇసుజు మోటార్స్ ప్లాంట్ 2016లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ప్రొడక్షన్ ప్రారంభించిన కంపనీ, ఏడు సీట్లతో కూడిన ఎస్‌యువి ఎంయు-ఎక్స్‌ అనే మోడల్ చారు ఆంధ్రప్రదేశ్ లో తయారు చేసి, మే 2017లో దేశీ మార్కెట్లోకి తీసుకువచ్చింది.

ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా 400 మందికి, పరోక్షంగా 600 మందికి ఉపాధి లభించనుంది. అత్యంత ఆధునిక పరిజ్ఞానం, రోబోటిక్‌ సహాయంతో ఈ పరిశ్రమలో వాహనాలను తయారు చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీసిటీ ప్లాంట్‌ సామర్థ్యం ఏటా 50 వేల యూనిట్లుండగా దీన్ని 1.2 లక్షల యూనిట్లకు పెంచేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది.

భారత నుంచి 15-20 దేశాలకు ఇసుజు వాహనాలను ఎగుమతి చేయాలని ఇసుజు మోటార్స్ లక్ష్యంగా పెట్టుకుంది. శ్రీసిటీలో ఏర్పాటు చేసిన ప్లాంట్‌ నుంచి ఇప్పటికే నేపాల్‌కు ఎగుమతులను ఇసుజు ఇండియా ప్రారంభించింది.

ఈ వీడియో చూడండి, శ్రీసిటీలోని 107 ఎకరాల ఇసుజు ప్లాంట్, కార్లు ఎలా తయారు చేస్తుందో... ఇది మేడ్ ఇన్ ఆంధ్రా కార్... ఆ సౌండ్ ఇంటుంటే, వచ్చే ఫీలింగే వేరు కదా...

Advertisements

Advertisements

Latest Articles

Most Read