మొన్నా మధ్య "ఆఫ్టర్ 2 ఇయర్స్ సియం" సీన్ గుర్తుందా.. పోనీ "నువ్వు ఒక ముఖ్యమంత్రిని పట్టుకుంటున్నావ్" అనే సీన్ గుర్తుందా... అలాంటి సీన్ మళ్ళీ ఇవాళ రిపీట్ అయ్యింది... ఈ సారి కృష్ణా జిల్లా కలెక్టర్ మీద "గుర్తుపెట్టుకో, నిన్ను సెంట్రల్ జైలుకు పంపిస్తా "..

ఈ పాటికి అర్ధమయ్యే ఉంటుంది, ఈ మాటలు అన్నది, మన ప్రియతమ ప్రతిపక్ష నేత... నందిగామ ప్రభుత్వాస్పత్రిలో దివాకర్ ట్రావెల్స్‌ బస్సు ప్రమాదంలో, మరణించిన కుటుంబాలని పరమార్సించటానికి జగన్ వచ్చారు.. ఆ సందర్భంలో నందిగామ ఆస్పత్రి దగ్గర జగన్‌ హల్‌చల్‌ చేశారు. బస్సు ప్రమాదంలో డ్రైవర్ పోస్టుమార్టం నివేదికను డాక్టర్ దగ్గర నుంచి బలవంతంగా లాక్కొన్నారు. ఆ డాక్టర్, ఇది డ్రాఫ్ట్ రిపోర్ట్, మీకు డిటైల్డ్ రిపోర్ట్ ఇస్తాము, ఇలా ఒక డాక్టర్ నుంచి లక్కోకూడదు, పేపర్లు ఇవ్వండి అంటే, ఆ డాక్టర్ పై అంతెత్తున లేచారు. డాక్టర్ ని, చెయ్యి తియ్యి అంటూ అరుపులు అరసారు.

వెంటనే అక్కడు కలెక్టర్ ఆ చర్యను అడ్డుకున్నారు. జగన్ తీరును కలెక్టర్ తప్పు పట్టారు. డాక్టర్ చేతిలో నుంచి రిపోర్ట్ లాక్కోవడం సరికాదన్నారు. మీరు ఇలా చెయ్యకూడదు అంటుంటే, కలెక్టర్‌పై అంతెత్తున లేచారు జగన్. నిన్ను, ఈ డాక్టర్ ని, ఈ పోలీసు డిపార్టుమెంట్ మొత్తాన్ని త్వరలోనే సెంట్రల్ జైలుకు పంపిస్తా, గుర్తుపెట్టుకో అని జగన్ హంగామా చేశారు.

ఈయన పరామర్శించడానికి వచ్చి, ఈ హంగామా ఏంటి అని, అక్కడ ఉన్న వాళ్ళు తల బాదుకున్నారు. కొంతమంది, "ఆఫ్టర్ 2 ఇయర్స్ సియం" సీన్ గుర్తు తెచ్చుకుని నవ్వుకున్నారు... జైలుకు పంపిస్తా అంటే, BP ఆచార్య, శ్రీలక్ష్మి లాంటి IAS ఆఫీసర్లని, అవినీతి కేసుల్లో జైలుకి పంపినట్టా అని కూడా గుసగుసలాడారు..

ఈ వీడియో చూడండి...

Advertisements

Advertisements

Latest Articles

Most Read