అదేంటి కృష్ణా జిల్లా నుంచి ఎవరికీ మంత్రి పదవి దక్కలేదు కదా అనుకుంటున్నారా, ఇది చదవండి... పశ్చిమ గోదావరి జల్లా కొవ్వూరు ఎమ్మెల్యే కొత్తపల్లి శ్యామ్యూల్ జవహర్ కు రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కింది. అయితే ఆయన స్వగ్రామం, కృష్ణా జిల్లా తిరువూరు మండలం గానుగపాడు. జవహర్ తల్లిదండ్రులు కొత్తపల్లి అమృతం, దానమ్మ కనుమూరుడు. గానుగపాడు, జి.కొతూరు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేసి పదవీ విరమణ చేశారు. తండ్రి అమృతం 2014 ఎన్నికలకు ముందు కన్నుమూశారు. ప్రస్తుతం తల్లి గానుగపాడులో జవహర్ అన్న రవీంద్రనాథ్ వద్ద నివసిస్తున్నారు. కొత్తపల్లి జవహర్ అయిదుగురు అన్నదమ్ముల్లో చివరివాడు. జవహర్ సతీమణి ఉషారాణి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నారు.

కొత్తపల్లి శ్యామ్యూల్ జవహర్ ఒకటి నుంచి రెండో తరగతి వరకు గానుగపాడు మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలలో, 3 నుంచి 5వ తరగతి వరకు ఖమ్మం, 6వ తరగతి కనుమూరు, 7 నుంచి 10 వరకు గంపలగూడెం మండలం అమ్మిరెడ్డి గూడెం, గుంటూరు ఆంద్రా క్రిస్టియన్ కళాశాలలో ఇంటర్, డిగ్రీ చదువుకున్నారు. బీఈడీ విజయవాడ సిద్దార్ధ కళాశాల, హైదరాబాద్లో ఏపీ టూరిజంలో డిప్లోమా పూర్తి చేశారు. 1994లో కొవ్వూరు వెళ్లి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ, 1997లో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా తన ప్రస్తానం ప్రారంభించారు. నందమూరు పాఠశాలలో పనిచేస్తున్న ఆయనకు 2014లో సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా అభ్యర్థిగా ఎమ్మెల్యే సీటు కేటాయించగా విజయం సాధించి ప్రస్తుతం మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read