పునర్విభజన తరువాత ఏర్పడిన నవ్యాంధ్రప్రదేశ్ పతాకాన్ని ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్టు శిఖరం పై నిలిపే మహోన్నత కార్యక్రమానికి చంద్రబాబు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడానికి వెళుతున్న ఆరుగురు బృంద సభ్యులకు మంత్రి కొల్లు రవీంద్ర, విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం నుంచి తొలిసారిగా మౌంట్ ఎవరెస్టును ఎక్కడానికి తుదిగా ఆరుగురిని ఎంపిక చేశారని, ఈ బృందంలో అయిదుగురు అబ్బాయిలతో పాటు అమ్మాయి కూడా ఎంపిక కావడం అభినందనీయమన్నారు.

ఎవరెస్ట అధిరోహణకు 300 దరఖాస్తులు రాగా కొండపల్లిలో వీరికి పరీక్షలు నిర్వహించి 160 మందిని ఎంపిక చేసి, తరువాత ఆరు దశల్లో జరిపిన పరీక్షల్లో 9 మందిని ఎంపిక చేసి, వీరికి సిక్కిం, హిమాలయాల్లో ప్రత్యేక శిక్షణను ఇచ్చిన తరువాత చివరిగా ఆరుగురిని ఎంపిక చేశారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం సుమారు 2 కోట్ల 45 లక్షలను వెచ్చించింది.

ఆరుగురు సభ్యులతో కూడిన బృందం ఈ నెల 8వ తేదీన ఎవరెస్ట అధిరోహణకు బయలుదేరుతుంది. అక్కడ నుంచి ఖాట్మాండు చేరుకోవడంతో ఎవరెస్ట్ ప్రయాణం మొదలవుతుంది. మొత్తం ప్రయాణంలో బేస్ క్యాంప్ తో, సహా మొత్తం నాలుగు క్యాంప్లులు ఉంటాయి. తుదిగా ఎంపిక చేసిన బృందంలో వెూతూకూరి ధర్మ తేజ, గజివెల్లి చెన్నారావు (పశ్చిమ గోదావరి), కారే సత్యారావు, సంద్రాణి నాగరాజ (విశాఖ జిల్లా), తంబినేని భరత్ (కర్నూల్), కంటేపల్లి పార్వతి (నెల్లూరు) ఉన్నారు.

25 వేల అడుగుల ఎత్తులో ఉన్న ఎవరెస్టు శిఖరం వద్ద, దాదాపు మైనస్ 50 డిగ్రీలు ఉష్ణోగ్రత ఉంటుంది. మన వాళ్ళు, సక్సెస్ ఫుల్ గా, ఎవరెస్టు శిఖరం పై కాలు మోపి, నవ్యాంధ్ర పతాకం రెపరెపలాడాలిచ్చాలి అని ఆసిస్తూ... బెస్ట్ అఫ్ లక్....

Advertisements

Advertisements

Latest Articles

Most Read