హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 36లో ఓ బెంజ్‌ కారు మెట్రో స్తంభాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మృతుల్లో ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నారాయణ కుమారుడు విజిత్‌ నారాయణ, అతని స్నేహితుడు రాజారావు వున్నట్లు సమాచారం.

మంత్రి కుమారుడు ప్రయాణిస్తున్న బెంజ్ కారు వేగంగా వచ్చి మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ఇద్దరిని స్థానికులు అపోలో ఆస్పత్రికి తరలించారు. అయితే వారు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. నారాయణ కుమారుడు నిషిత్ ప్రస్తుతం నారాయణ విద్యాసంస్థలకు డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు.

ప్రమాదానికి అతి వేగం కారణమా, లేక మద్యం సేవించారా అనేది కూడా తెలియాల్సి ఉంది. అదీ కాక, నిన్న హైదరాబాద్ లో వర్షం పడటం, కరెంటు లేకపోవటం, రోడ్డు సరిగ్గా లేకపోవటం కూడా కారణాలుగా చెప్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మంత్రి నారయణ, అమవారతి డిజైన్స్ మీద, లండన్ పర్యటనలో ఉన్నట్టు సమాచారం..

Advertisements

Advertisements

Latest Articles

Most Read