ఆపత్కాలంలో ఆదుకొని ప్రాణాలు రక్షించే 108 అంబులెన్స్ వాహనాలు కొత్తరూపును సంతరించుకున్నాయి. అధునాతన లైఫ్‌సపోర్ట్ పరికరాలతో అవి మరింత మెరుగైన వైద్య సేవలందించనున్నాయి. దాదాపు మొబైల్ ఐసీయూగా రూపుదిద్దిన 108 వాహనాలను రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాలకి పంపిణీ చేసింది. జిల్లాకు 28 కొత్త వాహనాలను ప్రభుత్వం కేటాయించిది. విజయవాడ సిద్ధార్థా మెడికల్ కాలేజీ గ్రౌండ్స్ లో వీటిని ఉంచి, అన్ని జిల్లాలకి పంపిస్తున్నారు.

కొత్తగా వచ్చిన వాహనంలో ఈ క్రింది సదుపాయాలు ఉన్నాయి

  • రోగికి బీపీ, ఈసీజీ, పల్స్రేట్ ముందుగానే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మల్టీమీటర్ ద్వారా పరీక్షించవచ్చు
  • అలాగే విషద్రావణం తీసుకున్న వ్యక్తిని కాపాడేందుకు ప్రత్యేకంగా సెక్షన్ ఆపరేటర్ ఏర్పాటు చేశారు. దీంతో రోగిని ఆసుపత్రికి చేరిన వెంటనే డాక్టర్ల వైద్యం చేయడానికి వీలుంటుంది
  • పల్స్ ఆక్సీ మీటర్
  • ఇంకా ఐదు రకాల స్టక్టర్స్
  • అధునాతన వీల్ చైర్ నీడిల్ కట్టర్
  • మల్టీ మానిటర్
 • సెక్షన్ ఆపరేటర్
 • మ్యాన్యువల్ ఆక్సిజన్ సిలిండర్
 • బేబి వార్మింగ్ బ్లాంకెట్
 • ఆత్యవన సేవల్లో భాగం ఆక్సిజన్ కై రెండు ఫోర్టబుల్ సిలెండర్ల ఏర్పాటు చేయడం ద్వారా ఇద్దరు రోగులకు సేవలు అందించవచ్చు
 • స్పైరల్ నెక్ గార్డ్ లాంటివి ఈ వాహనంలో ఉన్నాయి
 • త్వరలో రోగుల అత్యవసర సేవల్లో భాగంగా గుండెజబ్బుకు సంబందించి (షాక్ ట్రీట్మెంట్) డిఫిబ్రిలేటర్ పరికరంతో పాటు కృత్రిమశ్వాశ అందించే వెంటిలేటర్ సౌకర్యం కల్పనకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది

ఇక ఈ అంబులెన్స్‌లు తక్కువ సమయంలోనే ప్రజలను చేరుకొనేలా చర్యలు తీసుకున్నారు. ఆన్లైన్ లో కూడా, అంబులెన్స్‌ ఎక్కడ ఉందో ట్రాక్ చెయ్యవచ్చు.. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జిపిఎస్) అమర్చటం ద్వారా వాహనం ఎక్కడ ఉంది అనేది చూడవచ్చు., ఇక్కడ క్లిక్ చెయ్యండి.
http://gamyamtech.com/avlt/#/welcome

Advertisements

Advertisements

Latest Articles

Most Read