ఆంధ్రప్రదేశ్ కు కొత్త గవర్నర్‌గా కిరణ్ బేడీ నియమితులయ్యే అవకాశాలున్నాయని పరిశీలకులు అంచనాలేస్తున్నారు. ఏడాది క్రితం పుదుచ్చేరి లెఫ్ట్ నెంట్ గవర్నర్‌గా బేడీ నియమితులయ్యారు. అయితే అప్పట్నుంచి ఆమె పుదుచ్చేరి విషయంలో సంతృప్తికరంగా లేరు. ఆరేళ్ళ పదవీ కాలం ఉన్నప్పటికీ రెండేళ్ళు మాత్రమే పదవిలో కొనసాగుతానంటూ ఇటీవలె ఆమె రెండో పర్యాయం ప్రకటించారు. ఆ రాష్ట్ర పరిస్థితుల్లో పాటు అక్కడున్న వాతావరణం కూడా బేడీకి నచ్చడంలేదు.

ఇది ఇలా ఉంటే, కిరణ్‌ బేడీ చంద్రబాబు పరిపాలనా దక్షతతో ఆమె తరచూ ఆకర్షితురాలౌతున్నారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రాప్తంగా ఆమె ఆంధ్రప్రదేశ్ ను గుర్తించారు. రాష్ట్రంలోని ప్రతి పరిణామాన్ని బేడీ నిశితంగా పరిశీలిస్తున్నారు. ఆమెకు పుదుచ్చేరి నుంచి ఆంధ్రప్రదేశ్ కు బదలీ కావాలన్న ఆకాంక్షుందన్న వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. ఈ అంశంపై చర్చించి చంద్రబాబు ఆసక్తిని అంచనా వేసేందుకే బేడీ విజయవాడ వచ్చినట్లు సమాచారం. వాస్తవానికి జాతీయ మహిళా పార్లమెంట్లో ఆమె శనివారం ప్రసంగించాల్పుంది. కానీ తన కార్యక్రమాన్ని ఓ రోజు ముందుకు జరిపించారు. తొలి రోజు శుక్రవారమే ఆమె ప్రసంగించేశారు. ఇందుకోసం గురువారం రాత్రే విజయవాడకు చేరుకున్నారు. విజయవాడలో చంద్రబాబు, కిరణ్ బేడీల మధ్య సమావేశం జరిగిందన్న వార్తలు గుప్పవుంటున్నాయి. దీని సారాంశం ఖచ్చింగా గవర్నర్‌ గిరి పై, బాబు అభిప్రాయాన్ని సేకరించడానికేనని తెలుస్తోంది.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా నరసింహన్ వ్యవహరిస్తున్నారు. ఆయన రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్‌గా ఉన్నారు. గత ఏడాదిగా రెండు రాష్ట్రాలకు ఇద్దరు గవర్నర్లను నియమించాలన్న ప్రతిపాదన సాగుతోంది. ఇటీవల ఈ ప్రయత్నాలు వేగం పుంజుకున్నాయి కూడా, నరసింహన్ను ఆంధ్రప్రదేశ్ కు కేటాయించాలి అని కేంద్రం చూస్తున్నా, ఆయన మాత్రం తెలంగాణా వైపే మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. దీంతో ఆంధ్రప్రదేశ్ కు మరో గవర్నర్ నియామకం అనివార్యమైంది. ఓ దశలో సీనియర్ బిజెపి నేత పేరును కేంద్రం పరిశీలించింది. అయితే ఈ ప్రతిపాదనపై కేంద్రం ఇంకా తుది నిర్ణయంతీసుకోలేదు.

ఈ దశలో కిరణ్ బేడీ ఆసక్తి తెరపైకొచ్చింది. నరసింహన్ లాగే బేడీ కూడా మాజీ ఐపిఎస్ అధికారే. విధుల నిర్వహణలో ఆమె నిబద్దత అంతర్జాతీయ గుర్తింపు పొందింది. సామాజిక ఉద్యమాల్లోనూ ఆమె కీలక పాత్ర పోషించారు. అవినీతి వ్యతిరేక పోరాటంలో ఆమె అగ్రభాగాన నిల్చారు. పార్టీల కంటే సిద్ధాంతాలు, విధానాలకే ఆమె విలువనిస్తారు. ప్రధాని వెూడి కూడా బేడీకి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి గెలిచుంటే కిరణ్ బేడీయే ముఖ్యమంత్రి అయ్యేవారు. కానప్పటికీ బేడీకి తగిన గౌరవ మర్యాదలు కల్పించాలన్న లక్ష్యంతోనే పుదుచ్చేరి గవర్నర్ బాధ్యతలు అప్పగించారు.

ఇప్పడు కూడా బేడీ ప్రతిపాదనల్ని నరేంద్రమోడి తిరస్కరించరని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మహిళను రాష్ట్ర గవర్నర్‌గా నియమిస్తే చంద్రబాబు కూడా హర్షిస్తారు. అసలే ఇప్పడు దేశవ్యాప్తంగా మహిళాభ్యుదయం జోరుగా సాగుతోంది. ఇందులో చంద్రబాబు ముందుంటున్నారు. మహిళలు ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రాల్లో కూడా జరగని స్థాయిలో దేశంలోనే తొలి జాతీయ మహిళా పార్లమెంట్ను విజయవాడలో ఆయన అత్యద్భుతంగా నిర్వహిస్తున్నారు. మహిళా బిల్లు ఆమోదానికి కూడా తాను కట్టుబడినట్లు ఆయన ప్రకటించారు. కుటంబం నుంచి పార్టీ వరకు అన్నింటా మహిళలకిస్తున్న ప్రాధాన్యతను వివరించారు. ఈ దశలో రాష్ట్రానికి మహిళా గవర్నర్ నియమితులైతే సానుకూల సంకేతాలే వెళ్ళే అవకాశాలున్నాయి. పైగా బేడీ బాబు ఇద్దరూ గత కొంతకాలంగా మిత్రులు. బేడీ వైఖరి చంద్రబాబుని కూడా ఆకర్షిస్తోంది. అలాగే బాబు పాలనాదక్ష తపట్ల కిరణ్‌ బేడీ అచంచల విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read