చంద్రబాబు నాయుడు -13 డిగ్రీల చలిలో, పొద్దున్నో 7 గంటల నుంచి, రాత్రి 11 గంటల వరకు వివిధ ప్రముఖ కంపెనీల CEOలతో శమావేసమవుతూ పెట్టుబడులు పెట్టమని అభ్యర్దిస్తున్నారు... మధ్యలో సెమినార్లు, ప్రసంగాలు.... దావోస్ లో ఉన్న కంపెనీల ప్రతినిధులు అందరి చూపు ఏపి పెవిలియన్ వైపే... ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం... కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, ఇక్కడ పరిస్తితి చుస్తే ఇండియా అంటే చంద్రబాబులా ఉందే అన్న వార్త విన్నాం.... రతన్ టాటా, చంద్రబాబు పట్టుదల చుస్తే ఆశ్చర్యం వేస్తుంది, ఇంత చలిలో 17 గంటలు ఆయన పని చూస్తుంటే ముచ్చట వేస్తుంది అనే వార్తా విన్నాం....

ఇంకేముంది ఇవన్నీ చూసి, మన రాష్ట్రంలో ఏడుపు గాళ్ళు, పక్క రాష్ట్రంలో అపర మేధావులకి ఆక్రోశం తలకి ఎక్కింది... ఆక్రోశం ఎక్కువైతే వచ్చేది ఉన్మాదం.. ఆ ఉన్మాదంతో ఏమి మాట్లాడుతున్నామో, ఎవర్ని అంటున్నామో కూడా తెలియని మానిసిక వైకల్యం... భవిష్యత్తు తరాల ఆశాజ్యోతి అయిన అమరావతిని, భ్రమరావతి అనే సన్నాసులే వీళ్ళు.... ఒకడు బాగుపడుతుంటే, మంచి మనసు ఉన్నవాళ్లు, పోనీలే ఏదో తిప్పలు పడుతున్నాడు, కష్టపడి పైకి వస్తున్నాడు అని సంతోషిస్తారు... కొంత మంది ఉంటారు, ఆక్రోశం ఎక్కువైపోయి, ఉన్మాదంతో కూడిన ఏడుపులు ఏడుస్తారు... ఇలాంటి ఉన్మాదులు, ఇప్పుడు మన రాష్ట్రం, మన ముఖ్యమంత్రి చంద్రబాబు మీద పడ్డారు... అలా ఇలా కాదు, రాబందులు లాగా... చంద్రబాబు మీద ఎప్పుడూ పడతానే ఉంటారుగా అంటారా...

విషయంలోకి వద్దాం, చంద్రబాబుకి అసలు దావోస్ నుంచి ఇన్విటేషనే రాలేదంట.. ఇన్విటేషన్ కొనుక్కుని వెళ్లారు అంట... మొన్న చంద్రబాబు శ్రీలంక వెళ్ళినప్పుడు, అక్కడ ప్రభుత్వం చంద్రబాబుని అసలే పట్టించుకోలేదు అంట.... రోజూ టీవీలో వార్తలు వస్తున్నాయి గా, పేపర్లో వార్తలు వస్తున్నాయి గా అంటే, ఎబ్బే చంద్రబాబు అవన్నీ మేనేజ్ చేస్తున్నాడు, మేము మా ఆఫీషియల్ గజెట్ పేపర్ లో వస్తేనే నమ్ముతాం అంటున్నారు, మన రాష్ట్రంలో ఏడుపు గాళ్ళు, పక్క రాష్ట్రంలో అపర మేధావులు... ఆ గజెట్ పేపర్ లో వాస్తవాలు రాయరు కాని, వరల్డ్ ఎకనామిక్ ఫోరం వెబ్సైట్ లో, ఉన్న కొన్ని వాస్తవాలు ఈ సన్నాసులకి చూపిద్దాం... ఇప్పుడైనా నోరు ముస్తారేమో... నోర్లు మూసే అలవాటు వాళ్లకు లేదు కద, మీకెందుకు ఈ ఆత్రం అంటారా... బట్ట కాల్చి మొఖం మీద వేస్తారు.... మనం అప్రమత్తతో లేకపోతే మన మొఖమే కాలిపోతుంది... తరువాత వీళ్ళే అంటారు నీ మొఖం నల్లగా ఉంది అని... మన రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడ నానా తంటాలు పడి, ఒక్క కంపెనీ వచ్చినా చాలు అనుకుంటూ, 17 గంటలు, -13 డిగ్రీల చలిలో నానా కష్టాలు పడుతుంటే, ఈ విష ప్రచారాన్ని తిప్పికొట్టాలి అనే ఉద్దేశంతోనే....

మీ CMకు ఇన్విటేషన్ లేదు ఆహ్వానం కొనుక్కొని మరీ దావోస్ వెళ్ళారనే మేధావులూ ఇవి చూసి అయినా మీ నోర్లు మోతపడతాయా...

వరల్డ్ ఎకనామిక్ ఫోరం చాలా కొద్ది మంది రాజకీయ నాయకులకి మాత్రమే ఇన్విటేషన్ పంపిస్తుంది...
ఈ క్రింద మూడు లింక్ లు చూడండి...

వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎవర్ని ఇన్వైట్ చేస్తుంది
http://www3.weforum.org/docs/WEF_AM17_Overview.pdf

wef 19012017 7

2017 వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎజెండా లో చంద్రబాబు పేరు
http://www3.weforum.org/docs/Media/AM17/am17_programme_0901.pdf - Page9

wef 19012017 5

2017 వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇన్వైటీస్ లిస్టు లో చంద్రబాబు పేరు. ఇండియా నుంచి ఇన్విటేషన్ అందిన వారిలో నలుగురు మాత్రమే
http://www3.weforum.org/docs/Media/AM17/AM17_Public_Figures_10.01.2017.pdf - Page 3

wef 19012017 2

ఇంకో మేధావి అంటాడు, 2015-2016 లో కూడా చంద్రబాబు ఇదే మోసం చేసాడు అంట... ఇదిగో సాక్ష్యం... చంద్రబాబు చేసిన ప్రసంగం..
https://www.weforum.org/events/india-economic-summit-2016/sessions/cities-as-engines-of-growth

wef 19012017 6

ఆఫీషయల్ ట్విట్టర్ ఎకౌంటు నుంచి, వరల్డ్ ఎకనామిక్ ఫోరం "New Vision for Agriculture initiative" చేసిన ట్వీట్ ఇది

wef 19012017 4

Roland Busch, Chief Technology Officer at Siemens - నిన్న చంద్రబాబు గారితో కలిసి, ‘ప్రిపేరింగ్ ఫర్ సిటీ సెంచురీ’ అనే అంశంపై దావోస్ సదస్సులో పాల్గున్న ఆయన, చేసిన ట్వీట్ ఇది

wef 19012017 3

ఇవన్నీ మాకు తెలీదు, ఎవడో వెబ్సైటు లో ఇది రాసారు అని చూపిస్తున్నాడు ఇంకో మేధావి.... ఈ కింద రెడ్ లైన్లో ఉన్నది చూసి మీరే అర్ధం చేసుకోండి... ఇది, ఒక కంపెనీ కోసం పెట్టిన మెంబెర్-షిప్... డబ్బులు పెట్టినా కూడా, 250 బిగ్గెస్ట్ కంపనీలో ఒకటి గా ఉండాలి... పోనీ ఇది కూడా వదిలేద్దాం... 5 గురికి అయ్యే ఖర్చు చూసారా, ఇది కేవలం ఎంట్రీ పాస్ మాత్రమే, $6,22,000, అంటే షుమారుగా 4.2 కోట్లు... ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ 6.5 కోట్లలో, తలకాయి ఉన్నోడు ఎవడన్నా, 4.2 కోట్లు పెట్టి ఎంట్రీ పాస్ కొనుక్కుంటారా...

wef 19012017 8

సరే ఇది కూడా వదిలేద్దాం, మరి టికెట్ కొనుక్కొని లోపలకి వేల్లినోడికి, ఒక "పెవిలియన్" ఎందుకు ఇచ్చారు... ఇది కూడా కొనుక్కునారు అంటారా... మరి ఈ క్రింద పేర్కున్న కంపెనీలు ఎందుకు వచ్చి ముఖ్యమంత్రిని కలుస్తున్నాయి... ఎందుకు పెట్టుబడులు పెడతాం అంటున్నాయి... ఈ ప్రముఖ CEOలు కూడా, డబ్బులు పెట్టి షో చేస్తున్నారు అంటారా....

ఇవీ కంపెనీలు: Fujitsu, వోల్వో, స్టాడ్లర్ రైల్ మేనేజ్‌మెంట్, బి.కె.డబ్ల్యు ఎనర్జి ఎ.జి, గ్లోబల్ ఫండ్, ఆర్య కాపిటల్ పార్టనర్స్, ఐషర్, మైక్రోసాఫ్ట్, బర్కెలీలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, మొబినో స్విట్జర్లాండ్ , డ్యూర్ టెక్నాలజీస్, ట్రిట్టెక్, Baumgarte, St Gallen విశ్వవిద్యాలయం, Gherzi కార్పొరేషన్, రాటకొండ ఎనర్జీ సిస్టమ్స్, ఎలక్ట్రో పెయింట్స్ ఎస్ఏ గ్రూప్‌, సౌదీ ఆరాంకో, వేదాంత రెసోర్సెస్, న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్, పేటీఎం, సెక్వియా

వరల్డ్ ఎకనామిక్ ఫోరం వెబ్సైటు మేము హ్యాక్ చేసి, ఇవన్నీ చూపిస్తున్నాం అంటారా.... అన్నా కూడా అంటారు, అసలకే ఉన్మాదంలో ఉన్నారు....

చివరగా చెప్పేది ఏంటి అంటే, మన రాష్ట్రంలో ఏడుపు గాళ్ళుకు, వెనకటకి ఎవడో, చెరువు మీద అలిగి, ఎదో చెయ్యలేదు అంట... ప్రభుత్వం సక్రమంగా చేసే ప్రతి పనిని ఎగతాళి చేస్తే, నీ రాష్ట్రాన్ని, నీ ప్రాంతాన్ని, నీ జిల్లాని, నీ ఊరిని, నువ్వే ఎగతాళి చేస్తున్నట్టు, అనే చిన్న లాజిక్ మర్చిపోతున్నారు.... పక్క రాష్ట్రంలో అపర మేధావులకి చెప్పేది ఏంటి అంటే, మీది మీరు ఏడవండి, మాది మేము ఏడుస్తాం... లేదు మాకు ఎప్పుడూ పక్కోడి మీద పడి ఏడవటం అలవాటు, మా రాష్ట్రం మీద ఏడిస్తే, 10 km డీప్ లో, మా ముఖ్యమంత్రి పాతి పెడతాడు అంటారా... అలాగైతే మూసుకుని కూర్చోండి....

ఎప్పుడూ ఎదుటవాళ్ళ ఎదుగుదల మీద పడి ఏడుస్తారు మీరు.... కాని ఇవన్నీ ఎదుర్కొని, మీ నోర్లు మూపించే సమర్ధత మాకు ఉంది..

Advertisements

Advertisements

Latest Articles

Most Read