చంద్రబాబు హైటెక్ సిటీ కట్టింది నేనే అంటే, ఇంకా పురిటి వాసన కూడా పోని కొంత మంది పిల్లకాయలు సోషల్ మీడియాలో వెటకారం చేస్తున్నారు... అక్కడి పాలకులు, ఈ రోజు IT అంటే హైదరాబాద్... హైదరాబాద్ అంటే IT అని చెప్పుకుని తిరుగుతున్నారు అంటే, అది ఆ రోజు హైటెక్ ముఖ్యమంత్రిగా పేరు పొందిన చంద్రబాబు వేసిన పునాది... సాఫ్ట్‌వేర్‌ రంగంలో హైదరాబాద్‌ను మేటిగా చేసి, సైబరాబాద్‌ లాంటి కొత్త నగరాన్ని నిర్మించిన, చరిత్ర మన చంద్రబాబుది ...

ఏమిటి ఈ హైటెక్ సిటీ గొప్పతనం ?
హైదరాబాద్ లో ఉన్న హైటెక్ సిటీ లేదా "హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ" ఒక టౌన్షిప్ ప్రాంతం... మాదాపూర్ మరియు గచ్చిబౌలి శివార్లకి ఈ టౌన్ షిప్ ప్రాంతం అత్యంత సమీపంలో ఉంది. ఈ మిలీనియం ప్రారంభంలో భారత దేశపు ఐటి కేంద్రంగా బెంగళూర్ ఉద్భవించిన తరువాత అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ కే ప్రధాన ఐటి కేంద్రంగా హైదరాబాద్ నగరాన్నితీర్చిదిద్దాలనుకున్నారు. అత్యుత్తమ మౌలిక సదుపాయాలని కలిగిస్తూ ఎన్నో ఐటి కంపెనీలని హైదరాబాద్ నగరానికి ఆహ్వానించారు. సైబర్ టవర్స్ ఈ హైటెక్ సిటీ ప్రాజెక్ట్ లో మొదటి దశ, అలాగే సైబర్ గేట్ వే రెండవ దశ. జి ఇ కాపిటల్ ఇంకా ఒరాకిల్ కార్పొరేషన్ వంటి ఎన్నో బహుళ జాతి సంస్థల ఆఫీసులు ఈ సైబర్ టవర్స్ లో ఉన్నాయి. సత్యం కంప్యూటర్స్, విప్రో, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, మైండ్ స్పేస్, మరియు ఎల్ అండ్ టి, ఇన్ఫోసిస్, ఎపిఐఐసి, ఐబియం, గూగుల్ వంటి ఎన్నో కంపెనీ లు ఈ హైటెక్ సిటీ లేదా సైబర్ సిటీ లో ఉన్నాయి. ఇన్ఫోసిస్ వంటి ఎన్నో ప్రముఖమైన కంపెనీ లు వాటి యొక్క రోజు వారి అవసారాలకు తగినట్టుగా సెల్ఫ్ సఫిషియంట్ కాంపస్ లని ఏర్పాటు చేసుకున్నాయి.

వాజ్‌పేయిచే హైటెక్‌సిటీ ప్రారంభోత్సవం.
సుమారు 200 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్, మణికొండ, నానక్రాంగూడా ప్రాంతాలలో అప్పటి ప్రధాన మంత్రి వాజ్‌పేయిచే హైటెక్‌ సిటీ ప్రారంబించబడింది... ఈ సిటీలో ప్రధాన నిర్మాణాలు ఎల్ అండ్ టీ కంపెనీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా అభివృద్ధి చేసాయి... హైటెక్ సిటీ నిర్మాణం కోసం దేశంలోని నిపుణులందరినీ పిలిపించారు. చివరకు ఎల్అండ్‌టీ సంస్థతో 15 నెలలకు ఒప్పందం కుదుర్చుకుని నిర్మాణం చేశారు... ఎల్అండ్‌టీ కంపెనీ 24 నెలల సమయం కావాలంటే, చంద్రబాబు పట్టుబట్టి, రొజూ ఫాలో అప్ చేసి 15 నెలల్లో కట్టించారు.

చంద్రబాబు సీఎం అయ్యాక కొన్ని వందల గంటలపాటు మేధో మథనం చేసి విజ్ఞాన ఆధారిత కంపెనీలు తెస్తేనే ఉద్యోగాలు, అభివృద్ధి వస్తాయని నిర్ధారణకు వచ్చారు. ఆ సమయంలోనే మైక్రోసాఫ్ట్‌ కంపెనీ అధినేత బిల్‌ గేట్స్‌ ఢిల్లీ వస్తుంటే ఆయనను కలవాలని అపాయింట్‌మెంట్‌ అడిగారు చంద్రబాబు. తనకు రాజకీయ నాయకులతో పనిలే దని, కలిసే ఉద్దేశం లేదని బిల్‌ గేట్స్‌ బదులిచ్చారు. ఎంతో ప్రయత్నం చేస్తే చివరకు ఐదు నిమిషాలు మాత్రం ఇచ్చారు. కానీ ఆయన చంద్రబాబుతో 45 నిమషాలు మాట్లాడారు. విజ్ఞాన ఆధారిత సమాజం పై చంద్రబాబు ఆలోచనలు, భారతకు ఆ విషయంలో ఉన్న బలాలను ఆయనకు వివరించారు. బిల్‌ గేట్స్‌ ఆశ్చర్యపోయి ఏం కావాలని చంద్రబాబుని అడిగారు. హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్‌ కార్యా లయం పెట్టాలని చంద్రబాబు కోరారు. అమెరికా దాటి బయటకు రాదల్చుకొంటే హైదరాబాద్‌ వస్తామని ఆయన చెప్పారు. తర్వాత అమెరికా లోని ఆయన కార్యాలయానికి వెళ్ళారు చంద్రబాబు. దావోస్‌లో కలిసి మాట్లాడారు. ఇన్నిసార్లు తిరిగితే బిల్‌ గేట్స్‌ అమెరికా బయట తన మొదటి కార్యాలయాన్ని హైదరాబాద్‌లో పెట్టారు. మైక్రోసాఫ్ట్‌ వచ్చిన తర్వాత ఒరాకిల్‌, సన, ఇన్ఫోసిస్‌... ఇలా వరుసగా అనేక కంపెనీలు ఇక్కడకు తరలి వచ్చాయి. ఇందుకోసం న్యూయార్కులో 18 రోజులుండి ఫైళ్లు మోసుకుంటూ తిరిగారు చంద్రబాబు. హైదరాబాద్ ఎందుకు రావాలి, ఆంధ్రప్రదేశ్‌కు వస్తే కలిగే ప్రయోజనం ఏమిటో చెబుతూ ఒక విధంగా మార్కెటింగ్ చేశారు. అంత శ్రమ వల్లే నేడు హైదరాబాద్ ఐటీ హబ్‌గా మారింది. ఒక ఐటీ జాబ్ వచ్చిందంటే దానికి అనుబంధంగా ఇతర రంగాల్లో ఐదు ఉద్యోగాలు వస్తున్నాయి.

ఐఎస్‌బీని ముంబై, బెంగళూరు, చెన్నైలో పెట్టాలని ఆలోచన చేస్తే.. దేశంలోని పారిశ్రామికవేత్తలను చంద్రబాబు స్వయంగా ఇంటికి తీసుకెళ్లి వాళ్లకు టిఫిన్లు వడ్డించి ఇక్కడ ఏర్పాటు చేసేందుకు ఒప్పించారు. ఐటీ కంపెనీలు రావడానికి అన్ని సదుపాయాలు ఉన్న ఆవరణలు కావాలని ముంబైలోని రహేజా కార్యాలయానికి చంద్రబాబు వెళ్ళి మాట్లాడారు. ప్రతి వెయ్యి ఉద్యోగాలకు ఒక ఎకరం చొప్పున లక్ష ఉద్యోగాలకు వంద ఎకరాలు ఇచ్చారు. మైండ్‌ స్పేస్‌ పేరుతో ఒక అందమైన ఆవరణను వారు హైదరాబాద్ లో నిర్మించారు. ఇప్పుడు అందులోనే లక్షన్నర మంది పనిచేస్తున్నారు. బేగంపేట విమానా శ్రయం చాలదని దేశంలో మొదటిసారి ప్రైవేట్‌ రంగంలో గ్రీన్ ఫీల్డ్‌ విమానాశ్రయాన్ని శంషాబాద్‌లో ప్రతిపాదించి కట్టించారు చంద్రబాబు.

ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు వేసిన ఐటి ముద్ర... ఇది చేరిపేస్తే చెరిగిపోయేది కాదు... అమలాపురం నుంచి, ఆదిలాబాద్ దాకా, ఆ రోజుల్లో డిగ్రీ పూర్తి చేసుకుని, చేతిలో సర్టిఫికేట్ లు పట్టుకుని, హైదరాబాద్ లో గౌరవంగా ఉద్యోగాలు చేసిన వారని అడిగితే చెప్తారు... గ్రామాల్లో వ్యవసాయం చేసుకోవాల్సిన వాళ్ళు, చంద్రబాబు పుణ్యమా అని ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరి, నెలకు నాలుగు అంకెల జీతం తీసుకున్న వాళ్ళు చెప్తారు, వారికి చంద్రబాబు ఏ విధమైన భవిషత్తు ఇచ్చారో... చంద్రబాబు ప్రోత్సాహంతో, అమెరికాలో ఉద్యోగాలు చేసిన వారు చెప్తారు... వాళ్ళకి ఆ విశ్వాసం ఇప్పటికీ ఉంది... దానికి ఉదాహరణే మొన్నటి చంద్రబాబు అమెరికా పర్యటన... అమెరికాలో, ఏ సిటీలో దిగినా, అక్కడ తెలుగువారు ఆయనకు ఆహ్వానం పలికిన తీరే నిదర్శనం.

హైటెక్ సిటీకి చంద్రబాబుకి ఉన్న సంబంధం ఏంటో, చంద్రబాబుకి సమ ఉజ్జీ అయిన, ఆయన ప్రత్యర్ధి రాజశేఖర్ రెడ్డి మాటల్లోనే తెలుస్తుంది. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో, ఒకసారి హైటెక్ సిటీ ముందు నుంచి వెళుతూ మనం చంద్రబాబును ఎన్ని తిట్టినా ఇవన్నీ బాగా కట్టాడు అని సన్నిహితులకు చెప్పిన సంస్కారి రాజశేఖర్ రెడ్డి. YS కి అపార అనుభవం, రాష్ట్రం గురించి తపన ఉన్నాయి. మరి ఇవాళ ఆయన అభిమానులం అని చెప్పుకు తిరిగుతూ, అధికారం కోసం, రాష్ట్ర వినాసకానికి కూడా వెనుకాడని సైకో లని ఏమి అనాలి ?

1998 లో కొండల్లో, గుట్టలో హైటెక్ సిటీ అని బిల్దింగ్స్ కడితే ఎవడు వెల్తాడు అని ప్రతిపక్షాల హేళన, ఇప్పుడు తెలంగాణాకి 46,000 కోట్ల ఆదాయం ఒక్క హైటెక్ సిటీ నుండే వస్తుంది... e-seva పెడితే దాని వల్ల ప్రజలకి ఎమైనా ఉపయోగమా అని బాబు పైన సేటైర్లు, జోకులు. రెండు రాష్ట్రాల్లో e-seva సేవ మీద 2 లక్షల మందికి ఉపాది, ఇంకా e-seva ఉపయోగం ఏంటో అందరికీ తెలుసు ఇప్పుడు. విమర్సలు తాత్కాలికం.... భవిష్యత్తు ముఖ్యం... అది చంద్రబాబు గారికి ఎవరూ చెప్పనవసరం లేదు... ఇన్ని మంచి పనులు చేస్తూ, వాటి ఫలాలు పొందుతూ, వారే ఆయన్ను విమర్శించటం, బహుశా ఈ ప్రపంచంలోనే ఇలాంటి వింత లేదేమో... మనం విచెక్షణ కోల్పోయి, మనకు కులం, మతం, ప్రాంతం ఎక్కువైనప్పుడు, మనల్ని అన్ని విధాలుగా పైకి తీసుకువచ్చిన వారే, శత్రువులుగా కనిపిస్తారు...

హైటెక్ సిటీ, ఐటి, రోడ్లు, ఫ్లైఓవర్లూ, రింగ్ రోడ్లూ, స్టేడియంలూ, స్పోర్ట్స్ విలేజ్ లూ, ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లూ, ప్రణాళికా బద్దంగా పెంచిన స్కూళ్ళూ, కాలేజీలూ, నేషనల్ గేమ్స్, టైం తప్పకుండా రైతులకు విద్యుత్తూ, హైద్రాబాద్ కు ఇరవై నాలుగ్గంటలూ నిరంతరాయ విద్యుత్తూ, విజన్ 2020, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టూ, ఎంఎంటిఎస్, తొలిసారి అత్యంత వైభవంగా పుష్కరాలూ, పట్టిసీమ, సుందరీకరించిన బీచ్ లూ, పరిశుభ్రమైన నగరాలూ, తాగు సాగు నీరూ, అమరావతి, నూతన సచివాలయ నిర్మాణం, కాపు కార్పొరేషన్, బ్రాహ్మణ కార్పొరేషన్, విద్యుత్ ఆదా, అటవీ సంపద పరిరక్షణ, పరిశ్రమలూ, పెట్టుబడులూ, కొత్త ఒప్పందాలూ,ఇంకా ఎన్నెన్నో... అసలు రెండు రాష్ట్రాలకీ తలెత్తుకొని చూపించుకోగలిగిన రాజధానులు ఉన్నా... వస్తున్నా అది ఆయన పడ్డ కృషి, తపన ఫలితమే.... తెలుగు రాష్ట్రాలకి ఇందులో కనీసం మూడో వంతు పనిచేసిన వాడిని ఎవడినన్నా చూపించి అప్పుడు చంద్రబాబుని విమర్శించండి... మేము ఎదురు చెప్పం... చూపించలేకపోతే మాత్రం...మూసుకుని కూర్చోండి ప్లీజ్..

హైటెక్ సిటీ కట్టే సమయంలోని లాగుల బ్యాచ్ కి, ఇంకా కొంత మంది అమ్మ ఒడిలో పురిటి వాసన కూడా పోని పిల్ల కాకులకి, చంద్రబాబు బిల్ గేట్స్ ని బ్రతిమాలి మైక్రోసాఫ్ట్ పట్టుకొచ్చారని చెప్పినా, హైదరాబాద్ బిర్యానీ వాసనకొచ్చారని వాదిస్తారు.. ఇప్పటి లాగుల బ్యాచ్, రేపు అమరావతికి ఆవకాయ వాసన కోసం, నుజివీడు మామిడి పళ్ళ కోసం, ఉలవచారు కోసం, నెల్లూరు చేపల పులుసు కోసం, వచ్చారు అనే, వాదన తెస్తారేమోనని, ఈ వీడియో పెడుతున్నాం సాక్ష్యం గా... హైటెక్ సిటీ కట్టింది చంద్రబాబే... దాన్ని ప్రారంభించింది చంద్రబాబే... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఐటి అభివృద్ధి చేసింది చంద్రబాబే... హైదరాబాద్ ని నెంబర్ 1 చేసింది చంద్రబాబే... ఇప్పుడు నవ్యాంధ్రను నెంబర్ 1 చేస్తుంది చంద్రబాబే.... రేపు అమరావతిని ప్రపంచ ప్రఖ్యాత నగరం చేసేది ముమ్మాటికి చంద్రబాబే...

Advertisements

Advertisements

Latest Articles

Most Read