ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, చంద్రబాబు పార్టీ ఆఫీస్ లో జరిగిన వేడుకల్లో పాల్గున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు అనేక విషయాల పై స్పందించారు. ఆయన మాటల్లో "సరిగ్గా 40 ఏళ్ల క్రితం ఇదే రోజున స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశారు. ఆయన కేవలం అధికారం కోసమే పార్టీని స్థాపించలేదు. తెలుగు వారి గుర్తింపు కోసం, తెలుగు ప్రజల రుణం తీర్చుకోవాలని పార్టీని ఏర్పాటు చేశారు. నాడు ఎమ్మెల్యే క్వార్టర్స్ లో తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రజల ఆదరణతో 9 నెలల్లోనే అధికారం సాధించిన ఏకైక నాయకుడు నందమూరి తారకరామారావు. తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటిన వ్యక్తి ఎన్టీఆర్. రాజకీయాల నిర్వచనం మార్చాలనే సంకల్పంతో పాటు సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా నాడు అనేక కార్యక్రమాలు చేపట్టారు. నేడు అవి దేశానికి ఆదర్శమయ్యాయి. నాడు ఎన్టీఆర్ రూ.2 కిలో బియ్యం ప్రవేశపెడితే నేడు కేంద్రం అదే స్పూర్తితో వన్ నేషన్ వన్ రేషన్ కార్యక్రమానికి మొదలు పెట్టింది. నాడు ఎన్టీఆర్ రైతులకు అందించే విద్యుత్ కు శ్లాబ్ రేట్ రూ. 50 కి తీసుకువస్తే నేడు వాటన్నింటికి చిల్లు పెట్టి జగన్ మోటర్లకు మీటర్లు పెట్టి రైతులపై భారం మోపేందుకు సిద్దమయ్యారు. గుడెసెలో ఉండే ప్రతి పేద వాడికి పక్కా ఇళ్ల నిర్మాణానికి ఎన్టీఆర్ శ్రీకారం చుడితే నేడు కేంద్రం అదే బాటలో ప్రతి ఒక్కరికి ఇళ్లు నిర్మాణం చేపడుతోంది. నాడు మెజారిటీలో ఉన్న ప్రభుత్వాన్ని కుట్రతో రద్దు చేస్తే కేవలం 30 రోజుల్లో ఎన్టీఆర్ ను మళ్లీ గద్దెనెక్కించిన జాతి మన తెలుగు జాతి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక ప్రాంతీయ పార్టీ కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షంగా పని చేయడం ప్రతి ఒక్క తెలుగు వాడికి గర్వకారణం. నేను ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రజల్లో ఆత్మవిశ్వాన్ని పెంచాం. హైదరాబాద్ లో హైటెక్ సిటీ ప్రారంభించి లో తెలుగుజాతి కోసం సంపద సృష్టించాం. యువత భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని ఐటీని అభివృద్ధి చేసి తద్వారా సైబరాబాద్ నిర్మాణం చేయగలిగాం. అవుటర్ రింగ్ రోడ్డు, ఎయిర్ పోర్టు, జీనోమ్ వ్యాలీలు నేడు రాష్ట్రానికి వచ్చాయంటే నాడు మనం వేసిన బీజాలే నేడు పెరిగి పెద్దదై ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నాయి. జీనోమ్ వ్యాలీ నేడు కోవిడ్ సమయంలో ఉపయోగపడిందంటే దానికి మన ముందు చూపే కారణం."

"ఒకప్పుడు ఏపీలో ఒక ఎకరం అమ్మితే తెలంగాణలో 3 ఎకరాలు కొనుక్కునేవారు. కానీ నేడు తెలంగాణలో ఒక ఎకరా అమ్మితే ఏపీలో రెండు ఎకరాలు కొనే పరిస్థితి వచ్చిందని కేసీఆర్ మాట్లాడటం చూస్తే వైసీపీ పాలనలో రాష్ట్ర పరిస్థితి ఎంత దుర్బరంగా ఉందో అర్దమవుతోంది. అమరావతి ద్వారా యువతకు ఉద్యోగాలు, పోలవరం ద్వారా రైతులకు నీళ్లు అందించే విధంగా సంకల్పించి పనులు వేగిరం చేశాం. సంక్షేమంతో పాటు అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లాం. ఒక మనిషి పుట్టుక నుంచి చనిపోయేంత వరకు అనేక పథకాలను అందించాం. నాడు ప్రత్యేకహోదా విషయంలో కేంద్రం మీద ఒత్తిడి తెచ్చాం. దక్షిణ భారతదేశంలో ఏపీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాం. జగన్ రెడ్డి ప్రభుత్వం కేవలం 20 నెలల్లోనే లక్షా 70వేల కోట్లు అప్పు చేసి ప్రతి కుటుంబం మీద రూ. 2 లక్షల 50వేల భారం మోపారు. నిత్యావసర ధరలు, పెట్రోల్, డీజిల్, కరెంట్, విద్యుత్, ఇంటిపన్ను, వృత్తి పన్నులు పెంచేశారు. ఇలా అన్నింటిని పెంచుకుంటూ పోతే ప్రజలు ఏ విధంగా బ్రతుకుతారోనన్న ధ్యాస ప్రభుత్వంలో లేదు. కో-వి-డ్ సమయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఒక వైపు ఆర్ధిక సమస్యలు వస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఎప్పుడూ లేని విపత్కర పరిస్థితులు నేడు రాష్ట్రంలో ఉన్నాయి. నాడు ప్రత్యేకహోదా వస్తే ఉద్యోగాలు వస్తాయని 25 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచుతామన్న జగన్ రెడ్డి ఇప్పుడెక్కడ దాక్కున్నారు? 27 మంది వైసీపీ ఎంపీలు ఏం చేస్తున్నారు?

టీడీపీ హయాంలో పోలవరం 70 శాతం పూర్తి చేస్తే మిగిలిన పనులను పూర్తి చేయడానికి ఆపసోపాలు పడుతున్నారు. లక్ష నుంచి రెండు లక్షల కోట్ల సంపద ఉన్న అమరావతిని సర్వనాశనం చేశారు. మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాడుతున్నారు. తెలుగుదేశం హయాంలో 16 లక్షల కోట్ల ఎంవోయులు, 5.20 లక్షల మందికి ఉద్యోగాలు తెస్తే జగన్ రెడ్డి రెండేళ్లల్లో ఒక్క కంపెనీ అయినా తెచ్చారా? ఒక్కరికి అయినా ఉద్యోగం ఇచ్చారా? ఆంధ్రుల హక్కుగా ఉన్న విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేయకుండా 7 వేల ఎకరాల భూములు అమ్మితే సరిపోతుందని ముఖ్యమంత్రే మాట్లాడటం దుర్మార్గం. నాడు మద్యపాన నిషేదం చేస్తానని హామీనిచ్చి నేడు మద్యం ధరలు మూడు రెట్లు పెంచి సొంత కంపెనీలతో నాశిరకం బ్రాండ్లు తీసుకువచ్చి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ఈ ఏడాది కేవలం మద్యం ద్వారా రూ.20వేల కోట్లు ఆదాయం పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. రెండు బడ్జెట్ లను ఆర్డినెన్స్ ల ద్వారా ప్రవేశపెట్టిన ప్రభుత్వాన్ని నా జీవిత చరిత్రలో ఎప్పుడూ చూడలేదు. ఎంత ఖర్చు చేశారో ప్రజలకు చెప్పాల్సిన భాద్యత ప్రభుత్వానికి లేదా? రాష్ట్రం జగన్ రెడ్డి తాత జాగీరు కాదు. జవాబుదారీ తనంగా ఉండాల్సిన ప్రభుత్వం అసెంబ్లీలో కనీసం బడ్జెట్ కూడా పాస్ చేసుకోలేకపోతున్నారు. ప్రజలను చైతన్యవంతులుగా చేయడం నా బాధ్యత. నిజాన్ని పదే పదే చెప్పకపోతే ఎదుట వ్యక్తులు పదే పదే చెప్పే అబద్దాలే నిజమని ప్రజలు నమ్మే పరిస్థితి వస్తుందని డా. బి.ఆర్ అంబేద్కర్ ఎప్పుడో చెప్పారు. మనం నిజాన్ని ఒకటికి 100 సార్లు చెప్పాలి లేదంటే సమాజం నాశనం అవుతుంది. అంకితమైన భావంతో పని చేస్తాం, ప్రజా సేవకు పునరంకితం అవుతాం. "

శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు , ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ బడ్జెట్ పై ధ్వజమెత్తారు.. ఆయన మాటల్లోనే, "వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి బడ్జెట్ ప్రవేశపెట్టడంలో ఘోరంఘా విఫలమైంది. బడ్జెట్ ప్రవేశపెట్టకుండా ఆర్డినెన్స్ తెచ్చేంత దుర్భర పరిస్థితులు రాష్ట్రంలో ఏమున్నాయో అంతుచిక్కడం లేదు. తప్పనిసరిగా బడ్జెట్ సమావేశాలు జరిపి బడ్జెట్ ప్రవేశపెట్టకుండా.. రూ.70,983 కోట్లతో మూడు నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడం రాష్ట్రంలోని అసాధారణ పరిస్థితులను బహిర్గతం చేసింది. ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయాలను మరియు రుణాలని కన్సాలిడేటెడ్ ఫండ్ లో ఉంచుతారు. రాజ్యాగం ప్రకారం నిర్దిష్టమైన కారణాలు లేకుండా ఈ నిధులను విత్ డ్రా చేయడానికి వీలుపడదు. కానీ ఇలాంటి ప్రత్యేక కేటాయింపులకు ఎక్కువ సమయం పడుతున్నందున ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఇలాంటి పరిస్థితుల వలన స్వల్ప కాలంలో ప్రభుత్వం నిర్ణీత మొత్తాన్ని ఖర్చు చేయడానికి వీలవుతుంది. సాధారణంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో చర్చలను లాంఛన ప్రాయంగానే పరిగణిస్తారు తప్ప తప్పనిసరి కాదనే నియమాన్ని వైసీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు, మునిసిపల్ ఎన్నికలు మరియు తిరుపతి ఉప ఎన్నికలను సాకుగా చూపి తప్పనిసరిగా జరపాల్సిన బడ్జెట్ సమావేశాల కూడా ఆర్డినెన్స్ తో నెట్టుకొస్తోంది. 2019లో ఎన్నికల సంవత్సరం కారణంగా.. టీడీపీ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. 2020-21కి సంబంధించి కేరళ, కర్ణాటక, తెలంగాణ సహా పలు రాష్ట్రాలు ఫిబ్రవరి-మార్చిలో బడ్జెట్ ప్రవేశపెడితే జగన్ సర్కారు మాత్రం మూడు నెలల ఆగి జూన్ లో ప్రవేశపెట్టి.. కరోనాను సాకుగా చూపించి ఆర్డినెన్సుతో బడ్జెట్ ఆమోదించుకున్నారు. ఈ ఏడాది 14 రాష్ట్రాలు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాయి. పార్లమెంటులో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. కానీ.. ఏపీ ప్రభుత్వం మాత్రం ఫిబ్రవరి, మార్చిలో బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. ఏప్రిల్ 1 తర్వాత నుండి రోజువారీ ఖర్చులకు కూడా అనుమతి అవసరమైనందున.. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టి ఆర్డునెన్స్ ద్వారా బడ్జెట్ ఆమోదింపజేసుకుంటోంది. అందుకు చూపించిన కారణాలు కేవలం సాకులు తప్ప మరేమీ కాదనే విషయం వారికి కూడా తెలుసు.

గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదంతో 2021-22 ఆర్థిక సంవత్సరానికి కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి రూ.70,983 కోట్లు తీసుకునేందుకు మద్దతు లభించింది. తాజాగా కాగ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఫిబ్రవరి నెలలో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం రూ.5,000 కోట్లు అధనంగా అప్పు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపుగా రూ.80,000 కోట్లు అప్పు చేసింది. ద్రవ్య లోటు రూ.79,192 కోట్లు, 2020-21 ఆర్ధిక సంవత్సర మొత్తం బడ్జెట్ కంటే ఈ అప్పులు 164% ఎక్కువ. ప్రభుత్వం యొక్క రుణాలు పెరిగేకొద్దీ వడ్డీ చెల్లింపు వంటి ఆదాయేతర ఖర్చులు మరింత ఎక్కువ అవుతాయి. దీంతో పన్నులు, ధరలు పెరిగి ప్రజలపై భారం పెరుగుతుంది. గత 11 నెలల్లో పన్నుల రూపంలో ప్రభుత్వానికి రూ.68,821 కోట్లు ఆదాయం రాగా.., ఒక్క ఫిబ్రవరిలో రూ.7,573 కోట్లు జమయ్యాయి. ఇదే సమయంలో ఓటు-ఆన్- అకౌంట్ బడ్జెట్ లో ఆదాయం, ప్రజా రుణం, ఆర్థిక లోటు, దేశీయ ఉత్పత్తి రంగాల వారీగా గణాంకాలకు సంబంధించిన సమాచారం ఏదీ పేర్కొనాల్సిన అవసరమే లేదు. అదే సమయంలో మునుపటి సంవత్సరానికి సంబంధించి ప్రజా వ్యయాలను కూడా వివరించాల్సిన అవసరం లేకపోవడంతోనే జగన్ సర్కారు ఓటాన్ ఎకౌంట్ ను వినియోగించుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ పెడితే.. ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రశ్నలకు సమాధానం చెప్పడం కష్టమని అర్ధమైంది. అందుకే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టి ప్రజల్ని ఫూల్స్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. అసలు బడ్జెట్ ప్రవేశపెట్టలేనంతటి అసాధారణ పరిస్థితులు రాష్ట్రంలో ఏమున్నాయో సమాధానం చెప్పే సాహసం చేయగలరా.?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత, వాలంటీర్ అనే వ్యవస్థను తీసుకుని వచ్చిన సంగతి తెలిసిందే. 90 శాతం పైగా వాలంటీర్లను, తమ పార్టీ వాళ్ళనే పెట్టాను అంటూ, విజయసాయి రెడ్డి బహిరంగంగానే చెప్పారు. ఆ వీడియో కూడా వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే వాలంటీర్లు, ఒకటో తారీఖు పెన్షన్ ఇవ్వాటం మినహా, ప్రజలకు పెద్దగా ఉపయోగం పడటం లేదు. ఇలాంటి వారి పై నెలకు వందల కోట్లు, ఏడాదికి వేల కోట్లు ఖర్చు ప్రభుత్వం ఎందుకు పెడుతుందా అని అనుకున్న వారికి, మొన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లారిటీ వచ్చింది. మొన్న ఎన్నికల్లో వైసీపీ కార్యకర్తలు, నాయకులు ఏ మేరకు పని చేసారో కానీ, వాలంటీర్లు మాత్రం, చక్కగా పని చేసారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతి 50 ఇళ్ళకు ఒక వాలంటీర్ ఉండటంతో, వారిని ఎన్నికల్లో అధికార పార్టీ వాదేసింది. ముఖ్యంగా మాటు ఓటు వేయకపోతే, మీ పధకాలు కట్ చేస్తాం, మీ పెన్షన్ తీసేస్తాం అని బెదిరించారు. దీంతో ప్రజలు కూడా, ఇంకా మూడేళ్ళు పైగా భరించాలి, వీళ్ళతో ఎందుకు అనుకున్నారో ఏమో, చాలా మంది వైసీపీకి ఓటు వేసారు. దీంతో ఈ వాలంటీర్ వ్యవస్థ దెబ్బ ఏంటో తెలుగుదేశం పార్టీకి తెలిసి వచ్చింది. ఇప్పటికే దీనికి విరుగుడుగా ఏమి చేయాలో అనే ఆలోచనలో ఉన్న తెలుగుదేశం పార్టీ, అనేక ఆలోచనలు ఆలోచిస్తుంది.

volunteer 29032021 2

అయితే ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నిక జరుగుతూ ఉండటంతో, ముందుగా అక్కడ ఒక వినూత్న ఆలోచనతో ముందుకు వెళ్తుంది. ఏదైనా ప్రజల సహకారం లేనిదే, ఏమి చేయలేరు కాబట్టి, ప్రజలను భాగస్వామ్యులను చేస్తూ, ఇలా బెదిరిస్తున్న వాలంటీర్ల పని పట్టాలని డిసైడ్ అయ్యింది. ఈ రోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం జరిగింది. తిరుపతిలో టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, పాల్గున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాకు ఓటు వేయకపోతే, మీ పధకాలు కట్ చేస్తాం అంటూ వాలంటీర్లు బెదిరిస్తే, దాన్ని వెంటనే బహిర్గతం చేయాలని అన్నారు. ఇలా వాలంటీర్లు బెదిరిస్తే, దాన్ని వీడియో తీసి, 7557557744 అనే నంబర్ కు వాట్స్ అప్ చేయాలని, వీళ్ళ దురాగతాలను, ఆధారాలతో పట్టిస్తే, వారికి 10 వేల రూపాయాలు ఇస్తామని అన్నారు. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో ఇది వర్తిస్తుందని, ఈ విషయం అందరికీ తెలియ చేయాలని అన్నారు. పధకాలు అనేవి మీ హక్కు అని, ఎవరూ ఏమి చేయ లేరని అన్నారు. మరి టిడిపి చెప్తున్న ఈ ఐడియా ఎలా వర్క్ అవుతుందో చూడాలి.

మన దేశంలో జమిలీ ఎన్నికలు జరపటానికి, కేంద్రంలో ఉన్న బీజేపీ సమాయత్తం అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దీని పై ఒక అంచనాకు వచ్చిన బీజేపీ, ఒక్కో అద్దంగి తొలగించుకుంటూ వెళ్తుంది. నిజానికి క-రో-నా రాకపోయి ఉంటే, ఈ పాటికే జమిలి ఎన్నికల వాతవరణం వచ్చేసేది. ముందుగా బీజేపీ అనుకున్న దాని ప్రకారం, 2022లో జమిలి ఎన్నికలకు వెళ్ళాలని, దాని కోసం కొన్ని రాష్ట్రాల ఎన్నికలు ముందుకు జరపాలని, కొన్ని రాష్ట్రాల ఎన్నికలు అప్పటి వరకు పొడిగించాలని అనుకున్నారు. అయితే, క-రో-నా రావటంతో, మొత్తం రివర్స్ అయ్యింది. అయినా బీజేపీ ఈ విషయంలో హడావిడి పడటం లేదు. ఒక ప్లాన్ ప్రకారం, ఒక్కో అడుగు వేసుకుంటూ వెళ్తుంది. రాజ్యంగ ప్రక్రియలో, చేయాల్సిన అన్నీ, ఒక్కోటి చేసుకుంటూ ముందుకు వెళ్తుంది బీజేపీ. ఇందులో భాగంగా, ఇప్పటికే లా కమిషన్ నుంచి అభిప్రాయలు తీసుకున్నారు. లా కమిషన్ ఇప్పటికే జమిలికి సై అని చెప్పింది. ఈ లా కమిషన్, అన్ని పార్టీల అభిప్రాయం కూడా తీసుకుంది. మెజారిటీ పార్టీలు జమిలి ఎన్నికలకు ఒకే చెప్పేసారు కూడా. ఇది ఇలా ఉంటే, ఇప్పుడు మరో కీలకమైన కమిటీ కూడా జమిలి ఎన్నికల పై తన రిపోర్ట్ ఇచ్చింది. వారం రోజుల క్రితం, పార్లమెంటరీ స్థాయీ సంఘం కూడా జమిలి ఎన్నికల పై తన అభిప్రాయం చెప్పింది.

jamili 29032021 2

జమిలి ఎన్నికలకు ఈ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తన రిపోర్ట్ లో, అనేక అంశాలు ప్రస్తావించింది. జమిలి ఎన్నికలు మన దేశానికి కొత్త కాదని, స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో, మూడు సార్లు జమిలి పద్ధతిలోనే ఎన్నికలు జరిగిన విషయాన్ని చెప్పారు. దీంతో జమిలి ఎన్నికలకు కావలసిన అన్ని రాజ్యంగ ప్రక్రియలను, కేంద్రం ఒక్కోటి ఆమోదించుకుంటూ వెళ్తుంది. ఇప్పటికే ప్రధాని మోడి కూడా, ఈ విషయం పై తన అభిప్రయాన్ని కుండ బద్దలు కొట్టేసారు. ప్రతి సారి ఎన్నికలు జరుగుతూ ఉండటం వల్ల, ఖజానాకు భారమే కాకుండా, అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం అని అన్నారు. అందుకే జమిలి ఎన్నికల పై చర్చ జారగాలని అన్నారు. వన్ నేషన్ - వన్ ఎలక్షన్ అనే నినాదాన్ని ప్రజల్లోకి కూడా తీసుకుని వెళ్లారు. ఇక ఎన్నికల కమిషన్ కూడా, ఇదే ప్రక్రియలో భాగంగా తన వంతు కూడా సైలెంట్ గా చేసుకుంటూ వెళ్తుంది. ఒక్కో ఎన్నికకు ఒక్కో ఎన్నికల జాబితా కాకుండా, మొత్తం అన్ని రకాల ఎన్నికలకు ఒకే వోటింగ్ లిస్టు ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఈ హడావిడి అంతా చూస్తుంటే, 2023లో జమిలి ఎన్నికలు ఉండే అవకాసం ఉందని, పలువురు అభిప్రాయ పడుతున్నారు.

Advertisements

Latest Articles

Most Read