పవన్ కళ్యాణ్, బీజేపీ మధ్య పొత్తు ఉందో, లేదో కూడా తెలియని పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో ఉంది. ఏడాదిన్నర క్రితం, రెండు పార్టీలు పొత్తులోకి వచ్చాయి. అప్పటి నుంచి ఏ పార్టీకి, ఆ పార్టీ నిరసనలు చేస్తూ వస్తుందని కానీ, ఇద్దరూ కలిసి చేసిన నిరసన ఒకటి అరా మాత్రమే ఉన్నాయి. ఇక తెలంగాణాలో అయితే, పవన్ కళ్యాణ్ ని, అక్కడ బీజేపీ నేతలు హేళన చేయటంతో, హార్ట్ అయిన పవన్ కళ్యాణ్, బహిరంగంగానే, టీఆర్ఎస్ కు మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు పలికారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా తిరుపతి ఎంపీ సీటు అడిగినా బీజేపీ ఇవ్వలేదు. అక్కడ తమకు బలం ఉందని, ప్రజారాజ్యం సమయంలో అక్కడ సీటు గెలిచాం అని చెప్పినా, సీటు జనసేనకు ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ కూడా, ఇక్కడ సీరియస్ గా బీజేపీ ప్రచారం చేస్తేనే మద్దతు పలుకుతాం అని బహిరంగంగా చెప్పారు. ఈ నేపధ్యంలోనే, బీజేపీ అభ్యర్ధిని ప్రకటించటంతో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని మంచి చేసుకునే పనిలో పడింది బీజేపీ. అక్కడ బలిజ ఓటింగ్ ఎక్కువ, దీంతో పవన్ అవసరం బీజేపీకి ఎక్కువగా ఉంది. అయితే నిన్న సోము వీర్రాజు, పవన్ పై చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే, పవన్ ని ఎలా బుట్టలో వేస్తున్నారో అర్ధం అవుతుంది. పవన్ కళ్యాణ్ ని ఏపికి అధిపతని చేస్తామని చెప్పారు. మోడీకి పవన్ అంటే ఎంతో ఇస్తామని, పవన్ ని జాగ్రత్తగా చూసుకోమని తనకు చెప్పారని సోము వీర్రాజు చెప్పారు.

somu 290320212

అయితే ఇది అంతా బాగానే ఉంది కానీ, మరి సోము వీర్రాజుకి జాగ్రత్తగా చూసుకోమని చెప్పిన మోడీ, బండి సంజయ్ కు ఈ విషయం చెప్పలేదా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇక బీజేపీ తిరుపతిలో ఆడుతున్న డ్రామా పై, టిడిపి స్పందించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుపుతోంది అంటూ, విమర్శలు చేసారు టిడిపి మాజీ మంత్రి జవహర్. జాతీయ పార్టీ అయిన బీజేపీకి, ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధానం ఉందని, తెలంగాణాలో పవన్ పై లేని అభిమానం, తిరుపతిలో ఎందుకు వచ్చింది అంటూ సోము వీర్రాజు కి కౌంటర్ ఇచ్చారు జవహర్. పవన్ కళ్యాణ్ ని అసలు పోటీలోనే లేకుండా చేస్తే, ఆయన అధిపతి ఎలా అవుతారని ప్రశ్నించారు. మరో పక్క జగన్ తో డ్రామాలు ఆడుతున్నారని అన్నారు. ఏ ఫైల్ పంపినా, అరగంటలోనే ఆ ఫైల్ పై గవర్నర్ సంతకం పెట్టి పంపిస్తున్నారని, జగన్ కు గవర్నర్ ద్వారా బీజేపీ రిటర్న్ గిఫ్ట్ ఇస్తుందని అంటూ విమర్శించారు. లోపల జగన్ పై విపరీతమైన అభిమానం ఉందని, బయటకు మాత్రం నటిస్తున్నారని, ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీకి తిరపతి ప్రజలు, ఫూల్ స్టాప్ పెట్టాలని అన్నారు. 

జగన్ మోహన్ రెడ్డి కలలు కంటున్న ఏది ముందుకు వెళ్ళటం లేదు. మూడు రాజధానులు అని చెప్పి రెండేళ్ళు అయినా, ఇప్పటికీ ఒక్క అడుగు కూడా పడలేదు. ఇక జిల్లాల విభజన అంటూ, మరో పెద్ద టాస్క్ తీసుకున్నారు. ఇప్పుడు దీనికి కేంద్రం బ్రేకులు వేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేస్తాను అంటూ, జగన్ చెప్పుకొచ్చారు. ఇప్పటికే దీని పై కసరత్తు కూడా ప్రారంభించారు. చీఫ్ సెక్రటరీ స్థాయిలోనూ, జిల్లా కలెక్టర్ స్థాయిలోనూ వేరు వేరుగా కమిటీలు వేసారు. ఈ కమిటీలు కూడా తమ ప్రక్రియను ప్రారంభించారు. తొందర్లోనే జిల్లాల విభజన అంటూ, లీకులు ఇస్తూ వచ్చారు. అయితే ఎన్నికలు కూడా అయిపోవటంతో, ఇక ఈ జిల్లాల ప్రక్రయ ఊపందుకుంటుందని, ఉగాదికి కొత్త జిల్లాలు వచ్చేస్తాయని వైసీపీ ప్రభుత్వం చెప్పుకుంటూ వచ్చింది. అయితే దీనికి ఇప్పుడు కేంద్రం బ్రేకులు వేసింది. జనాభా లెక్కలు దీనికి సాకుగా చూపిస్తుంది. 2021 జనాభా లెక్కలు అయ్యేంత వరకు, జిల్లాల విభాజన కుదరదు అని తేల్చి చెప్పింది. మండల, జిల్లా, గ్రామ రెవిన్యూ పరిధిలో ఎక్కడా ఏమి చెయకూడదని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. అయితే గతంలో ఇచ్చిన ఆదేశాలు, ఇప్పటికీ అమలులో ఉన్నాయని, కొత్తగా ఏమి చేయకూడదు అని స్పష్టం చేసింది.

districts 29032021 2

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వెళ్ళిన ఒక ఆర్టీఐ ధరఖాస్తులో భాగంగా కేంద్రం మళ్ళీ ఇప్పుడు, ఈ ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఇప్పటి వరకు, జిల్లాల విభజన ప్రక్రియ, ఎన్నికలు అయిపోగానే మొదలు పెట్టి, ఉగాదికి కొత్త జిల్లాల ప్రకటన ఉంటుందని, అందరూ భావించారు. అయితే, క-రో-నా కారణంగా జనగణ లేట్ అవుతూ వస్తుంది. కేంద్రం మళ్ళీ ఈ ప్రక్రియ ఎప్పుడు ప్రరంభిస్తుందో తెలియదు. అలాగే ఎప్పుడు ముగిస్తుందో తెలియదు. ఇప్పుడు మళ్ళీ కేసులు పెరుగుతూ ఉండటంతో, ఇది ఎప్పటికి అవుతుందో తెలియదు. మరో పక్క కేంద్రం ఏమో, అది అయ్యే దాకా, జిల్లాల విభజన కుదరదు అని తేల్చి చెప్పింది. ప్రతి 10 ఏళ్ళకు జనాభా లెక్కలు జరుగుతూ ఉంటాయి. అయితే ఇది గత ఏడాది అవ్వాల్సి ఉండగా, క-రో-నా తో మొత్తం తారుమారు అయ్యింది. మాములుగా ఈ జనాభా లెక్కల ప్రక్రియ ఏడాది పాటు కొనసాగుతుంది. అయితే, ఇది ఎప్పుడు మొదలు అవుతుందో తెలియదు. జనాభా లెక్కల ప్రక్రియ మొదలైతే ఏడాది పాటు కొనసాగుతుంది, అప్పటి వరకు జిల్లాల విభజన ఏర్పాటు అయ్యే అవకాసం ఉండదు.

జగన్ మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి పై ఇప్పటికే 11 సిబిఐ కేసులు, 5 ఈడీ కేసులు ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసులు విచారణ, ఇంకా సాగుతూనే ఉంది. చార్జ్ షీట్లు ఫైల్ అవ్వటంతో,16 నెలల జైలు జీవితం తరువాత, కండీషనల్ బెయిల్ తో, బయటకు వచ్చారు. అయితే తదనంతర పరిణామాల్లో, ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. సిబిఐ కేసులు విచారణ జరిగితే, శిక్ష పడుతుందా లేదా అనేది, చూడాల్సిన విషయం. ఈ విషయం పక్కన పెడితే, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి పై, మరో సిబిఐ కేసు అంటూ, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘరామకృష్ణం రాజు బాంబు పేల్చారు. తానే స్వయంగా కేసు పెడతానని అంటున్నారు. అయితే రెండు రోజుల క్రితం రఘురామరాజు పై, సిబిఐ కేసు నమోదు అయ్యింది. ఇది వరుకే ఒక కేసు నమోదు చేయగా, ఇది రెండో కేసు. మొదటి కేసు పంజాబ్ నేషనల్ బ్యాంక్, రెండో కేసు స్టేట్ బ్యాంక్ పెడితే, సిబిఐ కేసు పెట్టింది. అయితే ఈ కేసు పై, ఇప్పటికే రఘురామరాజు వివరణ ఇచ్చారు. దీని పై ఇప్పటికే ఎన్సీటీఎల్ లో కేసు నడుస్తుందని, నేను ఏమి నిధులు మళ్ళించలేదని, ఎక్కడికీ డబ్బు తీసుకుపోలేదని, తమిళనాడు ప్రభుత్వం తన పవర్ ప్లాంట్ కి డబ్బులు ఇవ్వకపొవటంతో, నష్టపోయామని, దీని పై కేసు జరుగుతుంటే, ఇవేమీ ప్రాధమికంగా విచారణ చేయకుండా, తన పై సిబిఐ కేసు పెట్టటం వెనుక కుట్ర ఉందని అన్నారు.

cbi 28032021 2

తానేమీ, 10 రూపాయల షేర్ వందల్లో అమ్ముకోలేదని, అక్రమ సంపాదన లేదని అన్నారు. అయితే ఈ కేసులు వెనుక చాలా పెద్ద కుట్ర ఉందని అన్నారు. తన పై పెట్టిన కేసు ఎలాగూ వీగిపోతుందని, అయితే ఈ కుట్రని మాత్రం తాను వదలనని అంటున్నారు. తమిళనాడులో ఉన్న ఒక స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా డైరెక్టర్ తో, చీఫ్ మినిస్టర్ కార్యాలయం నుంచి, ఫోనులు వెళ్లాయని, దీని పై తనకు పక్కా సమాచారం ఉందని, ఆ ఫోన్ కాల్స్ అనంతరం, తన పై కేసులు పెట్టారని రఘురామరాజు అన్నారు. దీని పై త్వరలోనే సిబిఐ విచారణ కోరతానని అన్నారు. కచ్చిత్తంగా దీన్ని వదలను అని, దీని పై సిబిఐకి లేఖ రాసి, దీని వెనుక ఉన్న వారి పై విచారణ కోరతానని అన్నారు. ఒక పక్క అవినీతి కేసుల్లో, ఎన్నో చార్జ్ షీట్లు ఉండి, విచారణకు రాకుండా ఎగ్గోడుతుంటే, జగన్ మోహన్ రెడ్డిని సిబిఐ ఎందుకు ఏమి అనటం లేదో అర్ధం కావటం లేదని అన్నారు. ఏది ఏమైనా జగన్ కార్యాలయం ఫోన్ కాల్స్ పై, విచారణ కోరాతానని, రఘురామరాజు అన్నారు. మరి రఘురామరాజు ఎలాంటి ఆధారాలు ఇస్తారు ? సిబిఐ ఎలా స్పందిస్తుందో చూడాలి.

తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, నారా లోకేష్, కార్యకర్తలను ఉద్దేశించి భావోద్వేగ లేఖ రాసారు. రేపు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి, బహిరంగ లేఖ రాసారు. తెలుగుదేశం పార్టీ 40 ఏళ్ళుగా తెలుగు ప్రజలకు అండగా వస్తూ వచ్చిందని, మన పార్టీకి బలం, వెన్ను చూపని కార్యకర్తలు, నాయకులు అని, కార్యకర్తల సంక్షేమాన్ని మరువం అని, ప్రతి కార్యకర్త కష్టాన్ని, శ్రమని గౌరవిస్తాం అని అన్నారు. కార్యకర్తల సంక్షేమం కోసం, ఇప్పటికీ పని చేస్తుంది కేవలం టిడిపి పార్టీ మాత్రమే అని అన్నారు. ఆ నాడు అన్న ఎన్టీఆర్, బడుగు, బలహీన వర్గాల కోసం పెట్టిన పార్టీ, వెంటనే అధికారంలోకి వచ్చి, పేదవాడికి కూడు, గూడు, గుడ్డ నినాదంతో పని చేసిందని అన్నారు. అణగారిన వర్గాలకు, యువతకు, రాజకీయంగా ప్లాట్ఫారం ఇచ్చింది టిడిపి అని అన్నారు. అన్న ఎన్టీఆర్, చంద్రబాబు గారి సారధ్యంలో, తెలుగు జాతి కృషి కోసం, అభివృద్ది కోసం, రాష్ట్ర ప్రగతి కోసం కృషి చేస్తూనే ఉన్నారని అన్నారు. అధికారంలో ఉన్నా, లేకపోయినా టిడిపి కార్యకర్తలు కంటికి రెప్పలా పార్టీని కాపాడారని అన్నారు. ప్రతి పేదవాడికి అండగా ఉండటమే టిడిపి లక్ష్యం అని చెప్తూ, ఆవిర్భావ దినోత్స‌వ శుభాకాంక్షలు తెలిపారు.

Advertisements

Latest Articles

Most Read